S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/12/2017 - 01:13

న్యూఢిల్లీ, మే 11: తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకు మార్చాలని ఎంపీ వినోద్‌కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను కలిశారు.

05/12/2017 - 01:13

ముంబయి, మే 11: ఈ ఏడాది రుతు పవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గురువారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ఆశావహ దృక్పథంతో ముగిశాయి. వరసగా రెండో రోజు గురువారం కూడా సెనె్సక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 3 పాయింట్లు పెరిగి 30,250.98 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఇ సిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 9, 422.41 వద్ద ముగిసింది.

05/12/2017 - 01:11

న్యూఢిల్లీ, మే 11: దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో మార్కెట్లోకి విడుదల చేసిన కాన్వాస్ 2 స్మార్ట్ఫోన్‌ను అద్భుతమైన ఆఫర్లతో గురువారం తిరిగి లాంచ్ చేసింది. ఈ సందర్భంగా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఏడాది పాటు యూజర్లకు 4జి నెట్‌వర్క్, ఏ నెట్‌వర్క్ ఫోన్లకయినా అపరిమతమైన కాలింగ్ సదుపాయంను ఆఫర్ చేస్తోంది.

05/12/2017 - 01:09

బెంగళూరు, మే 11: ప్రపంచ రేటింగ్ ఏజన్సీలపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగ్ ఏజన్సీల పేరుతో అవి దేశాలతో ఆటలాడుంటున్నాయన్నారు. ముఖ్యంగా భారత్, చైనాల విషయంలో రేటింగ్ ఏజన్సీలు గత కొంతకాలంగా నిలకడలేని ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆయన అంటూ, వాటిని ‘పూర్ స్టాండర్డ్స్’ అని అభివర్ణించారు.

05/12/2017 - 01:07

ముంబయి, మే 11: ఓ పక్క ప్రపంచ దేశాలనుంచి వీసాల సమస్యలు, మరో వైపు ఐటి రంగంలో ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజాల్లో ఒకటయిన హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 2017 మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. మార్కెట్ అంచనాలను మించి ఈ లాభాలు ఉండడం గమనార్హం.

05/12/2017 - 01:05

న్యూఢిల్లీ, మే 11: భారత్‌లో ఆన్‌లైన్ గేమర్ల సంఖ్య ఇప్పుడున్న 12 కోట్లనుంచి 2021 నాటికి దాదాపు మూడు రెట్లు అంటే 31 కోట్లకు పెరుగుతుందని గూగుల్ ఇండియా కెపిఎంజి సంస్థలు రూపొందించిన ఒక నివేదిక అంచనా వేసింది.

05/12/2017 - 01:04

విశాఖపట్నం, మే 11: విశాఖ నుంచి సింగపూర్, దుబాయ్, మలేషియాకు అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. జూలై 8 నుంచి నుం చి కొలంబోకు నేరుగా విమాన సర్వీసును శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ నడపబోతోంది.

05/12/2017 - 01:01

కర్నూలు, మే 11: రాష్ట్ర ప్రభుత్వం సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో చేపట్టిన అనంతరం చార్జీలు గణనీయంగా తగ్గుతాయని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకాలం ప్రతి రెండేళ్లకు ఒకసారి విద్యుత్ చార్జీల పెంపుతో విసిగిపోయిన ప్రజలకు రానున్న రెండేళ్లలో ఉపశమనం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

05/12/2017 - 00:59

ఏలూరు, మే 11: పశ్చిమ గోదావరి జిల్లా కేం ద్రం ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అధికార్ల బృందం గురువా రం సందర్శించింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్యసేవల అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రథ మ స్థానంలో ఉన్న ఏలూరు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

05/11/2017 - 00:43

ముంబయి, మే 10: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రంకేసింది. బుధవారం ట్రేడింగ్‌లో అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీలు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. మదుపరుల కొనుగోళ్ల జోరుతో గత రికార్డులన్నీ కొట్టుకుపోగా, కొత్త రికార్డులు కొలువుదీరాయి. వర్షపాత అంచనాలను వాతావరణ శాఖ పెంచడమే మార్కెట్ జోష్‌కు అసలు కారణం.

Pages