S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/29/2016 - 00:40

న్యూఢిల్లీ, జూన్ 28: దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నెట్-సర్వీస్ ప్రొవైడర్ నియోటెల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో టాటా కమ్యూనికేషన్స్.. తమ మెజారిటీ వాటాను అమ్మేస్తోంది. టెలీకమ్యూనికేషన్స్ సంస్థ ఎకోనెట్ వైర్‌లెస్ గ్లోబల్‌కు 293 మిలియన్ డాలర్ల (దాదాపు 1,992 కోట్ల రూపాయలు)కు ఈ వాటాను టాటా కమ్యూనికేషన్స్ విక్రయిస్తోంది.

06/29/2016 - 00:46

డెట్రాయిట్, జూన్ 28: జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్.. కర్బన ఉద్గారాల చీటింగ్ కేసులను పరిష్కరించుకోవడంలో భాగంగా భారీ నష్టపరిహారానికి అంగీకరించింది. 15 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించేందుకు ముందుకొచ్చింది. తమ చీటింగ్‌తో మోసపోయిన కార్ల యజమానులకు నష్టపరిహారంగానే ఇందులో 10 బిలియన్ డాలర్లను కేటాయించింది. 5,100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యజమానులకు నష్టపరిహారంగా ఇవ్వనుంది.

06/28/2016 - 00:37

న్యూఢిల్లీ, జూన్ 27: ఎగుమతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే నెలల్లో దేశీయ ఎగుమతులు వృద్ధిపథంలో వెళ్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా. 2014 డిసెంబర్ నుంచి భారత ఎగుమతులు క్రమేణా క్షీణిస్తున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల మేలో ఎగుమతులు పుంజుకున్న సంకేతాలు కనిపించాయి.

06/28/2016 - 00:35

న్యూయార్క్, జూన్ 27: గూగుల్ సిఇఒ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ కోరా అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఇంతకుముందు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ ట్విట్టర్, పింటరెస్ట్ అకౌంట్లను హ్యాక్ చేసినవాళ్లే ఇప్పుడు పిచాయ్ కోరా అకౌంట్‌ను హ్యాక్ చేయడం గమనార్హం. అవర్‌మైన్ టీమ్‌గా పిలువబడే ఈ హ్యాకర్ గ్రూప్.. పిచాయ్ అకౌంట్ ద్వారా కోరాపై సందేశాలను కూడా పంపించారు.

06/28/2016 - 00:34

లండన్, జూన్ 27: యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో ఆ దేశ పౌండ్ విలువ అంతకంతకూ దిగజారుతోంది. రెఫరెండంలో మెజారిటీ బ్రిటనీయులు బ్రెగ్జిట్‌కు మద్దతు పలకడంతో శుక్రవారం పౌండ్ విలువ 31 ఏళ్ల కనిష్టానికి పడిపోయినది తెలిసిందే. తాజాగా సోమవారం కూడా దాదాపు 30 ఏళ్లకుపైగా కనిష్టానికి పౌండ్ విలువ పతనమైంది. బ్రిటన్ ఆర్థిక, రాజకీయ రంగాల్లో నెలకొన్న అనిశ్చితే ఇందుకు కారణం.

06/28/2016 - 00:32

చెన్నై, జూన్ 27: చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా.. సోమవారం దేశీయ ప్రయాణికుల కోసం పలు ప్రోత్సాహక ఆఫర్లను ప్రకటించింది. 786 రూపాయల ప్రారంభ చార్జీ (అన్ని పన్నులతోసహా)తో దేశంలోని వివిధ ప్రాంతాలకు టిక్కెట్లను తెచ్చింది. ఈ చార్జీ రానుపోను ప్రయాణానికి కాదు. ఒకవైపు మాత్రమే. వచ్చే నెల 3 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

06/28/2016 - 00:30

ముంబయి, జూన్ 27: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ముగింపు నాటికి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 22,000 స్థాయికి పడిపోతుందని ఓ నివేదిక అంచనా వేసింది. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ తప్పుకున్న (బ్రెగ్జిట్) నేపథ్యంలో సెనె్సక్స్ భారీగా పతనం కావచ్చని ఆర్థిక సేవల సంస్థ అంబిత్ క్యాపిటల్ అంచనా వేసింది.

06/28/2016 - 00:28

ముంబయి, జూన్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ బయటకురావడం (బ్రెగ్జిట్)తో శుక్రవారం భారీ నష్టాలకు లోనైనది తెలిసిందే. భారత్‌సహా ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్లన్నీ కూడా తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ క్రమంలో సోమవారం భారతీయ సూచీలు కొంత నిలకడను సంతరించుకున్నాయి.

06/28/2016 - 00:26

న్యూఢిల్లీ, జూన్ 27: దేశంలో విక్రయించే అప్పడాలు, సాస్‌లు, ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో అత్యధిక స్థాయిలో ఉప్పు శాతం ఉందని, దీని కారణంగానే రక్తపోటు, గుండె పోటు, పక్షవాతం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. మొత్తం 5,796 ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై జార్జి గ్లోబల్ హెల్త్ ఇండియా సంస్థ సర్వే జరిపింది.

,
06/28/2016 - 00:22

విజయవాడ, జూన్ 27: విశాఖ, విజయవాడ, తిరుపతిల్లోని ప్రధాన విమానాశ్రయాల నుంచి వివిధ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు ప్రముఖ విదేశీ విమానయాన సంస్థ ఇతిహాద్ ముందుకొచ్చింది. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోరోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. టియాంజిన్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొని పలువురు పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు.

Pages