S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/02/2017 - 00:27

నల్లమాడ, మే 1: ఈ ఏడాది మామిడి దిగుబడి ఎక్కువ రావడంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని భావించిన మామిడి తోటల కొనుగోలుదారులకు చుక్కెదురైంది. మార్కెట్ మాయగాళ్లు ధర తగ్గించేసి దోపిడీ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 47 వేల హెక్టార్లలో మామిడితోటలు సాగు చేశారు. హెక్టారుకు 9 టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా జిల్లాలో మామిడి వ్యాపారంపైనే ఆధారపడ్డ కుటుంబాలు 2 లక్షలకుపైగా ఉన్నాయి.

05/02/2017 - 00:24

న్యూఢిల్లీ, మే 1: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్.. ధరలను పెంచింది. వివిధ రకాల మోడళ్లపై కనిష్టంగా 500 రూపాయల నుంచి గరిష్ఠంగా 2,200 రూపాయల వరకు పెంపును ప్రకటించింది. పెరిగిన ఉత్పాదక వ్యయం వల్ల ధరలను పెంచక తప్పట్లేదని సోమవారం హీరో మోటోకార్ప్ తెలిపింది. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

05/02/2017 - 00:23

న్యూఢిల్లీ, మే 1: భారత్.. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన దేశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ పెట్టుబడులకు మంచి సమయం ఇదేనని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంతర్జాతీయ మదుపరులకు పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ భారత పర్యటన సందర్భంగా సోమవారం ఇక్కడ ఇండియా-టర్కీ బిజినెస్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో మాట్లాడిన మోదీ..

05/02/2017 - 00:22

రాజమహేంద్రవరం, మే 1: వర్జీనియా పొగాకు రైతులు అధిక ధర కోసం ఎదురు చూస్తుండటంతో కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన వేలం ప్రక్రియ మందగమనంలో సాగుతోంది. ప్రస్తుతం ధర ఆశాజనకంగానే ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత లభిస్తుందనే ఆలోచనతోనే రైతులు వేలానికి బేళ్లను తక్కువ సంఖ్యలో తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వేలం ప్రక్రియ మందగమనంలో సాగుతోందని అంచనా వేస్తున్నారు.

05/01/2017 - 00:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఈ వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా త్రైమా సిక ఫలితాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

05/01/2017 - 00:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: సాఫ్ట్‌బ్యాంక్ సారథ్యంలోని ఓలా క్యాబ్స్.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,311 కోట్ల రూపాయలకుపైగా నష్టాలను చవిచూసింది. అంటే రోజుకు 6 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందన్నమాట. ప్రకటనలకు భారీగా ఖర్చు చేయడం, ఇతరత్రా వ్యయం పెరిగిపోవడం, పరిమితికి మించిన ఉద్యోగుల వేతన భారం ఇంతటి నష్టాలకు దారితీసింది.

05/01/2017 - 00:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇక పెట్రోల్, డీజిల్ ధరలూ రోజూ మారనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ఇప్పటివరకూ 15 రోజులకోసారి ధరలను సవరిస్తూపోయిన చమురు మార్కెటింగ్ సంస్థలు.. సోమవారం నుంచి రోజుకోసారి ఈ సవరణలు చేపడుతాయి. అయితే పుదుచ్చెరి, విశాఖపట్నం, ఉదయ్‌పూర్, జంషేడ్‌పూర్, చంఢీగఢ్‌లలో తొలుత ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

05/01/2017 - 00:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రభుత్వరంగ బ్యాంకులు ఏకీకృతమవుతున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో ఆరు బ్యాంకులు విలీనమైనది తెలిసిందే. ఈ క్రమంలో మరిన్ని బ్యాంకులు కూడా ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొండి బకాయిల సమస్య తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బ్యాంకుల ఏకీకరణ ఒక్కటే పరిష్కారమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

05/01/2017 - 00:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు..

05/01/2017 - 00:48

హైదరాబాద్, ఏప్రిల్ 30: పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ (ఈఎసి).. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ అనుమతినిచ్చింది. ఈ ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు.. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సరిహద్దులో ఉంది. విశాఖ నగరం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో నిర్మితమవుతోంది.

Pages