S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/16/2017 - 08:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. ఖాతాల్లో నెలసరి కనీస నగదు (మినిమం బ్యాలెన్స్) నియమంపై మెత్తబడింది. కొన్నిరకాల ఖాతాదారులకు మినహాయింపునిచ్చింది. స్మాల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, జన్‌ధన్ ఖాతాలు లేదా ప్రధాన్ మంత్రి జన్-్ధన్ యోజన (పిఎమ్‌జెడివై) క్రింద నమోదైన ఖాతాలకు కనీస నగదు అక్కర్లేదని తెలియజేసింది.

04/16/2017 - 08:43

హైదరాబాద్, ఏప్రిల్ 15: దేశంలోనే రికార్డు స్థాయిలో ఈసారి తెలంగాణలో యాసంగి సీజన్ ధాన్యం పండింది. దాదాపు 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా యాసంగిలో రికార్డు స్థాయిలో 21 లక్షల 64 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది.

04/16/2017 - 08:42

చాపాడు, ఏప్రిల్ 15: పచ్చ బంగారంగా పిలువబడే పసుపు పంటకు కాలం కలిసి రావడం లేదు. గత ఆరేళ్లుగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. అయినా ప్రభుత్వ వర్గాల్లో ఏమాత్రం స్పందన లేదని పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిలకడ లేని ధరలతో రైతులు బేజారవుతున్నారు. ఫలితంగా పంట వచ్చింది వచ్చినట్లుగానే విక్రయిస్తున్నారు.

04/16/2017 - 08:40

విజయవాడ/విశాఖపట్నం, ఏప్రిల్ 15: నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న నిర్మాణ రంగానికి ఒక్కసారిగా బ్రేకు లు పడ్డాయి. సిమెంట్ ధరల పెంపు, ఇసుక క్వారీల మూత ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

04/15/2017 - 00:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో లక్ష కోట్ల రూపాయల డిజిటల్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రంలోనే నరేంద్ర మోదీ సర్కారు డిజిటల్ లావాదేవీలకు పెద్దపీట వేస్తున్నది తెలిసిందే.

04/15/2017 - 00:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారతీయ బీమా రంగ నియంత్రణ వ్యవస్థ ఐఆర్‌డిఎఐ.. ఆన్‌లైన్‌లో పాలసీలను అమ్మేందుకు బీమా రంగ సంస్థల కోసం ఓ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా బీమా సంస్థలు ఇకపై ఆన్‌లైన్‌లోనే పాలసీల విక్రయాలు, నమోదును చేసుకోవచ్చు. జఒశఔ.జూజ్ఘూ.్య్ప.జశ ఫేరిట వచ్చిన ఈ వెబ్ పోర్టల్‌ను బీమా వ్యాపారంలో మధ్యవర్తిత్వాలకూ వినియోగించుకోవచ్చని ఓ సర్క్యులర్‌లో ఐఆర్‌డిఎఐ తెలిపింది.

04/15/2017 - 00:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ డిసిబి బ్యాంక్ లాభం.. గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 24 శాతం క్షీణించింది. 53 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి వ్యవధిలో ఇది 70 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు డిసిబి బ్యాంక్ తెలిపింది. ఆదాయం ఈసారి 284 కోట్ల రూపాయలుగా, పోయినసారి 230 కోట్ల రూపాయలుగా ఉంది.

04/15/2017 - 00:25

స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటో రంగ సంస్థ వోల్వో కార్స్.. శుక్రవారం భారతీయ మార్కెట్‌కు ఎస్60 పోల్‌స్టార్
మోడల్‌ను పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 52.5 లక్షల రూపాయలు.
కేవలం 4.7 సెకండ్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు గరిష్ఠ వేగం.. గంటకు 250 కిలోమీటర్లు

04/15/2017 - 00:23

శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ మహిళా విభాగం 33వ వార్షిక సెషన్‌లో
అవార్డు గ్రహీతలతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

04/15/2017 - 00:21

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా.. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దాదాపు 43 కోట్ల రూపాయల (6.68 మిలియన్ డాలర్లు) వేతనాన్ని అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) పొందిన దానితో పోల్చితే ఇది తక్కువే. సంస్థ వివరాల ప్రకారం నాడు 48.73 కోట్ల రూపాయల వేతనాన్ని తీసుకున్నారు.

Pages