S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/15/2017 - 00:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రముఖ విదేశీ శీతల పానియాల తయారీ సంస్థ పెప్సీ.. ఇకపై భారతదేశవ్యాప్తంగా ఒకే ధరకు త్రాగునీరును అమ్మనుంది. ఆక్వాఫినా పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మినరల్ వాటర్‌ను మార్కెట్‌లో పెప్సీ విక్రయిస్తున్నది తెలిసిందే.

04/15/2017 - 00:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థాగత మదుపరి సాఫ్ట్‌బ్యాంక్.. భారతీయ రవాణా స్టార్టప్ ఓలాలో తాజాగా దాదాపు 1,675 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. ఇందులో ఓలా నిర్వహణదారైన ఎఎన్‌ఐ టెక్నాలజీస్‌లో 12,895 రూపాయల ప్రీమియం వద్ద 10 రూపాయల ముఖ విలువ కలిగిన 12,97,945 షేర్లను సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ ఎస్‌ఐఎమ్‌ఐ పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది కూడా ఉంది.

04/15/2017 - 00:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించిన ఐదు సంస్థల్లో నాలుగు సంస్థలు.. మదుపరులకు రెండింతల లాభాలను తెచ్చిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) సూచీ సెనె్సక్స్ ఈ జనవరి 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 11 శాతం పెరిగింది.

04/14/2017 - 01:11

బెంగళూరు, ఏప్రిల్ 13: దేశంలో రెండవ అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ గురువారం జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అయితే ఈ ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం మదుపరులను నిరాశపరిచింది. ఫలితంగా ఆ కంపెనీ షేరు 3 శాతానికి పైగా పడిపోయింది.

04/14/2017 - 01:10

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఈ ఏడాది జూన్ 15 వరకు ఎస్‌బిఐలో విలీనమైన బ్యాంకు అధికారులు ఇచ్చిన ఆఫ్షన్లపై తుది నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు గురువారం ఎస్‌బిఐ చైర్మన్‌ను ఆదేశించింది. అసోసియేటెడ్ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్, ఇతర బ్యాంకు సంఘాల అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.

04/14/2017 - 01:09

బెంగళూరు, ఏప్రిల్ 13: దేశీయ ఐటి దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫీ (ఇన్ఫోసిస్) తమ స్వతంత్ర డైరెక్టర్ రవి వెంకటేశన్‌ను కో-చైర్మన్‌గా నియమించింది. డైరెక్టర్ల బోర్డును విస్తరించాలని సంస్థ వ్యవస్థాపకుల నుంచి వచ్చిన సూచనల మేరకు ఇన్ఫోసిస్ గురువారం ఆయనను ఈ పదవిలో నియమించింది.

04/14/2017 - 01:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: మార్కెట్ నియంత్రణా సంస్థ ట్రాయ్ ఆదేశాల ప్రకారం మూడు నెలల కాంప్లిమెంటరీ ఆఫర్‌ను ఉపసంహరించుకోవడంలో రిలయన్స్ జియో జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ భారతీ ఎయిర్‌టెల్ టెలికామ్ వివాదాల పరిష్కార అప్పిలెట్ ట్రిబ్యునల్ (టిడిఎస్‌ఎటి)కు ఫిర్యాదు చేసింది.

04/14/2017 - 01:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారతీయ కంపెనీల విలీనాలు, స్వాధీనాలు గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగాయి. విలువ లెక్కలో చూసినట్లయితే గత ఏడాదికన్నా మూడు రెట్లు పెరిగాయి. వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైంది, అతిపెద్ద విలీనం వొడాఫోన్-ఐడియా కంపెనీల విలీనం కూడా ఉందని ఓ నివేదిక వెల్లడించింది.

04/14/2017 - 01:06

ముంబయి, ఏప్రిల్ 13: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావాలకు తోడు ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు మదుపరులను కదిలించలేక పోవడంలాంటి పరిణామాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 182 పాయింట్లు నష్టపోయి రెండువారాల కనిష్టస్థాయికి చేరుకోగా, నిఫ్టీ సైతం 9,200 పాయింట్ల దిగువకు పడిపోయింది.

04/14/2017 - 01:06

హైదరాబాద్, ఏప్రిల్ 13: ప్లాస్టిక్ ఉత్పత్తులకు సంబంధించిన మరో కొత్త పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుందని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. సిద్దిపేట, లేదా యాదాద్రిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. గురువారం ఈ పారిశ్రామిక వాడపై ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన బాలమల్లు ఈ వివరాలను వెల్లడించారు.

Pages