S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/16/2016 - 07:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు బాకీపడి లండన్ వెళ్లిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత, మద్యం దిగ్గజం విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దేశంలోని బ్యాంకులకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాల్యా బ్రిటన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా పాస్‌పోర్టును ప్రభుత్వం శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది.

04/16/2016 - 07:02

సెంటినరికాలనీ, ఏప్రిల్ 15: దేశంలో ఉన్న భూగర్భ గనులు కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్‌లోని అడ్రియాల గనిని ఆదర్శంగా తీసుకోవాలని కోల్ ఇండియా అనుబంధ విభాగం, రాంచీకి చెందిన కోల్‌మైన్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇనిస్టిట్యూషన్ (సిఎంపిడిఐ) సిఎండి శేఖర్ శరణ్ అన్నారు.

04/16/2016 - 07:02

వాషింగ్టన్, ఏప్రిల్ 15: వర్షాలు సమృద్ధిగా కురిసి, ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీరేట్లను మరింతగా తగ్గిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ‘ద్రవ్యోల్బణం కదలికలను గమనిస్తున్నాం.

04/16/2016 - 07:01

విజయవాడ, ఏప్రిల్ 15: భారతీయ రైల్వే విభాగమైన రైల్‌టెల్ అతిత్వరలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో త్వరలోనే హైస్పీడ్ పబ్లిక్ ఫ్రీ వైఫై సేవలను ఆరంభించనుంది. ఇది రైల్‌వైర్‌గా తన విస్తృత నెట్‌వర్క్‌లో గూగుల్‌తో కలసి ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీంతో గూగుల్ దేశవ్యాప్తంగా పది ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో పబ్లిక్ వై-ఫై సేవలను అందు బాటులోకి తెస్తున్నట్లైంది.

04/15/2016 - 04:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ 13 శాతం పెరిగి రూ. 3.45 లక్షల కోట్లకు చేరుకుంది. రిటైల్ ఇనె్వస్టర్లు ఈ పథకాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడమే వీటి అసెట్ బేస్ ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణం. 2015 మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ రూ. 3.05 లక్షల కోట్లు ఉండగా, అది ఈ ఏడాది మార్చి చివరికి రూ.

04/15/2016 - 04:10

వాషింగ్టన్, ఏప్రిల్ 14: దేశంలో ఈ ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయని, వర్షపాతం సాధారణ సగటు కంటే అధికంగా నమోదవుతుందని చెబుతున్న వాతావరణ నిపుణుల అంచనాలు నిజమైతే భారత ఆర్థికాభివృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని గత ఆర్థిక సంవత్సరం సాధించిన స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రేటు (7.5 శాతం) కంటే మరింత మెరుగైన వృద్ధిరేటును సాధించడం ఖాయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

04/15/2016 - 04:19

ముంబయి, ఏప్రిల్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సాగరమాల’ ప్రాజెక్టు గడువును సగానికి కుదించుకోవాలని నిర్ణయించింది.

04/15/2016 - 04:06

హైదరాబాద్, ఏప్రిల్ 14: ప్లాటినం 3జి నెట్ వర్క్‌ను హైదరాబాద్‌లోని తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. త్వరలో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.

04/15/2016 - 04:05

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) మహిళా సంస్థ (ఎఫ్‌ఎల్‌ఓ) జాతీయ ఉపాధ్యక్షురాలిగా అపర్ణ పింకీరెడ్డి ఎంపికయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 32వ వార్షిక సమావేశంలో పింకీరెడ్డి ఈ పదవికి ఎంపికయ్యారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

04/15/2016 - 04:04

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్‌గా దిననాథ్ దుభాషి నియమితులయ్యారు. గురువారం నుంచి దుబాషి నియామకం అమల్లోకి వస్తుందని ఎల్‌అండ్‌టి వెల్లడించింది. ఫైనాన్సియల్ రంగంలో ఆయనకు 25 ఏళ్ల పాటు విశేష అనుభవం ఉందని, కార్పొరేట్ బ్యాంకింగ్, క్యాష్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ రేటింగ్స్, రిటైల్ లెండింగ్, రూరల్ ఫైనాన్సింగ్ విభాగాల్లో ఆయన పని చేశారు.

Pages