S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/12/2017 - 01:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రభుత్వరంగ ఉక్కు ఉత్పాదక దిగ్గజం సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు చెందిన మూడు యూనిట్లలో ఉద్యోగులు మంగళవారం సమ్మె బాట పట్టారు. ఈ యూనిట్లలో వాటాను ఉపసంహరించుకోవాలని ప్రభు త్వం ప్రతిపాదించడమే ఈ ఒకరోజు సమ్మెకు కారణమని వాణిజ్య సంఘం ఐఎన్‌టియుసి తెలిపింది.

04/12/2017 - 01:03

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నప్పటికీ తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టిజిబి) మాత్రం పాత ఐదు జిల్లాలకే పరిమితమైంది. మిగతా పాత ఐదు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఎపిజివిబి)గానే పనిచేస్తోంది.

04/12/2017 - 01:02

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రిలయన్స్ జియో మంగళవారం మరో సరికొత్త ప్లాన్‌ను వినియోగదారులకు ప్రకటించింది. తమ ప్రైమ్ సభ్యులకు 309 రూపాయలకే 3 నెలలపాటు రోజుకు 1జిబి డేటాను 4జి వేగంతో అందిస్తామని తెలిపింది. అలాగే 509 రూపాయలకు 3 నెలలపాటు రోజుకు 2జిబి డేటాను 4జి వేగంతో ఇస్తామని చెప్పింది. ఈ రెండు ఆఫర్లు కూడా దేశీయంగా అపరిమిత ఎస్‌ఎమ్‌ఎస్, కాలింగ్ సదుపాయాలున్నవేనని స్పష్టం చేసింది.

04/12/2017 - 01:00

ముంబయి, ఏప్రిల్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 212.61 పాయింట్లు ఎగిసి 29,788.35 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.55 పాయింట్లు ఎగబాకి 9,237 వద్ద నిలిచింది.

04/12/2017 - 01:00

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఎండాకాలం వచ్చేసింది. ఆరంభంలోనే అదిరిపోయే ఎండలు కొడుతున్నాయి. మరో రెండు నెలలు ఎండలను తట్టుకునేదెలా?.. అంటూ ఎయిర్ కూలర్ల షాపులకేసి పరుగులు పెడుతున్నారు జనం. అయితే నిరుడు చల్లగాలి వస్తే సరిపోతుందిలే అని ఆలోచించిన కస్టమర్లు.. ఈ ఏడాది మాత్రం ఇంకా ఏయే సౌకర్యాలున్నాయో అని ఆరా తీస్తున్నారు. ఆయా సంస్థలు సైతం తమ కూలర్లను మరిన్ని ఫీచర్లతో మార్కెట్‌లోకి తెస్తున్నాయి.

04/12/2017 - 00:57

హైదరాబాద్, ఏప్రిల్ 11: పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ) మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొందరు సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు కొన్ని చోట్ల పది రూపాయల నాణేల చట్టబద్ధత గురించి, వర్తకులు, దుకాణదారులు, సామాన్య ప్రజానీకంలో సందేహాలు లేవనెత్తుతున్నందున రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని మరోసారి ప్రకటించింది.

04/12/2017 - 00:56

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 400 కోట్ల రూపాయలతో ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ తెలంగాణ టెలికామ్ సర్కిల్ చీఫ్ జిఎం ఎల్ అనంతరామ్ మంగళవారం తెలిపారు. ఉమ్మడి ఏపి సర్కిల్‌లో గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో మొత్తం 2,526.18 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించినట్లు ఆయన చెప్పారు.

04/12/2017 - 00:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశీయంగా ప్యాసింజర్ వాహన అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 9.23 శాతం పెరిగినట్లు ఆటో పరిశ్రమల సంఘం సియామ్ తెలిపింది. 30,46,727 యూనిట్ల విక్రయాలు జరిగాయంది. 2015-16లో 27,89,208 యూనిట్ల అమ్మకాలే జరిగినట్లు చెప్పింది. గత నెల మార్చిలో 8.17 శాతం వృద్ధితో 2,82,519 యూనిట్ల అమ్మకాలు జరిగాయంది. అంతకుముందు మార్చిలో 2,56,920 యూనిట్ల విక్రయాలు జరిగాయని చెప్పింది.

04/12/2017 - 00:55

ముంబయి, ఏప్రిల్ 11: వ్యవసాయ రుణాల మాఫీ సరైనది కాదని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకైన నాబార్డు వ్యాఖ్యానించింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినది తెలిసిందే. రుణాల రద్దు వల్ల నిజాయితీగా డబ్బులు చెల్లించేవారు కూడా చెల్లించరంది.

04/12/2017 - 00:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో రికార్డుస్థాయి అమ్మకాలను నమోదు చేసింది. 3,650 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. అయితే నిరుడుతో పోల్చితే స్వల్పంగానే పెరిగాయి. గత సంవత్సరం జనవరి-మార్చిలో 3,622 యూనిట్లను అమ్మింది. ఈ-క్లాస్ సెడాన్, ఎస్‌యువి విభాగాల్లో కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు సంస్థ పేర్కొంది.

Pages