S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/12/2017 - 00:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: వోల్వో ఆటో ఇండియా కార్ల ధరలను పెంచుతోంది. ఉత్పాదక వ్యయం పెరిగిన నేపథ్యంలో ఆయా మోడళ్లపై 2.50 లక్షల రూపాయల వరకు ధరను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను సంస్థ విడుదల చేసింది. లగ్జరీ, ఎస్‌యువి శ్రేణిలో వోల్వో.. కార్లను విక్రయిస్తుండగా, ధరల శ్రేణి రూ. 26.04 లక్షలు- 1.28 కోట్ల వరకు ఉంది.

04/12/2017 - 00:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్‌లో 350 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్‌బి ఎనర్జీ హోల్డింగ్స్ మంగళవారం తెలిపింది. సోలార్ పార్కుల పథకమైన జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ క్రింద సౌర విద్యుదుత్పత్తిని చేస్తున్న తొలి ప్లాంట్ కూడా ఇదేనని ఓ ప్రకటనలో ఎస్‌బి ఎనర్జీ హోల్డింగ్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది.

04/11/2017 - 00:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. టెనె్సంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్ప్, ఈబే నుంచి భారీ స్థాయిలో నిధులను సమీకరించింది.

04/11/2017 - 00:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్.. విదేశీ అమ్మకాలు గత నెల మార్చిలో నిరుడు మార్చితో పోల్చితే 9 శాతం మేర పెరిగాయి. ఈసారి 1,29,951 యూనిట్ల విక్రయాలు జరిగితే, పోయినసారి 1,18,750 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో టాటా మోటార్స్ స్పష్టం చేసింది. ప్యాసింజర్ వాహన విభాగంలో ఈసారి అమ్మకాలు 87,355 యూనిట్లుగా ఉంటే, నిరుడు 73,515 యూనిట్లుగా ఉన్నాయి.

04/11/2017 - 00:27

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ).. రిలయన్స్ రిటైల్-హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు ఒప్పందానికి అనుమతినిచ్చింది. మరో రెండు ఒప్పందాలకూ సిసిఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హావెల్స్-లాయిడ్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, డిహెచ్‌ఎఫ్‌ఎల్-ప్రమెరిక లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల ఒప్పందాలకూ సిసిఐ పచ్చజెండా ఊపింది.

04/11/2017 - 00:27

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 10: వర్జీనియా పొగాకు వేలం ప్రక్రియలో ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ మరింత ధర లభిస్తుందేమోననే ఆశతో కొందరు రైతులు అమ్మేందుకు తటపటాయిస్తున్నారు. నిరుడు కేజీ పొగాకు సరాసరి ధర 99 రూపాయలుగా ఉంటే, ప్రస్తుతం గత నాలుగు రోజులుగా జరుగుతోన్న వేలం ప్రక్రియలో సరాసరి 153.61 రూపాయల ధర పలికింది.

04/11/2017 - 00:25

ముంబయి, ఏప్రిల్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 130.87 పాయింట్లు క్షీణించి 29,575.74 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 16.85 పాయింట్లు కోల్పోయి 9,181.45 వద్ద నిలిచింది.

04/11/2017 - 00:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య 9 బిలియన్ డాలర్ల (60 వేల కోట్ల రూపాయలు)కుపైగా విలువైన ఒప్పందాలు కుదిరాయి. భారత్-బం గ్లాదేశ్‌లకు చెందిన వివిధ రంగాల సంస్థలు సోమవారం ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. విద్యుత్, చమురు, గ్యాస్ తదితర రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి.

04/11/2017 - 00:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్‌కి రిలయన్స్ జియోపై వొడాఫోన్ ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ‘సమ్మర్ సర్‌ప్రైజ్’ ఆఫర్‌ను ఇంకా జియో కొనసాగిస్తోందని ట్రాయ్‌కి సోమవారం అందించిన లేఖలో వొడాఫోన్ పేర్కొంది. సమ్మర్ సర్‌ప్రైజ్ పేరిట తెచ్చిన ‘కాంప్లిమెంటరీ సర్వీస్ ఆఫర్’ను ఆపేయాలని రిలయన్స్ జియోకు ట్రాయ్ ఇప్పటికే చెప్పినది తెలిసిందే.

04/11/2017 - 00:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ జియోని.. తమ నూతన మోడల్ ఎ1 స్మార్ట్ఫోన్‌కు 10 రోజుల్లో దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయని సోమవారం తెలిపింది. ఈ ఏడాదిలో తాము మార్కెట్‌కు పరిచయం చేసిన తొలి స్మార్ట్ఫోన్ ఎ1 అని, ఈ నెల 9 వరకు దీని కోసం 150 కోట్ల రూపాయల విలువైన బుకింగ్స్ జరిగాయని చెప్పింది.

Pages