S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/05/2017 - 01:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: హెచ్-1బి వీసాలపై అమెరికా తాజా మెమో ప్రభావం భారతీయ ఐటిరంగ సంస్థలపై స్వల్పంగానే ఉండొచ్చని దేశీయ ఐటి పరిశ్రమల సంఘం నాస్కామ్ మంగళవారం అభిప్రాయపడింది. ఈ ఏడాదికిగాను ఉన్నతస్థాయి ప్రత్యేక నిపుణుల కోసం వీసా దరఖాస్తులు ఇప్పటికే మొదలైనందున హెచ్-1బి వీసా మెమో ప్రభావం పెద్దగా ఉండబోదంది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) ఇటీవల ఓ పాలసీ మెమరాండమ్‌ను విడుదల చేసింది.

04/05/2017 - 02:09

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: మనీ లాండరింగ్, షెల్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కొరడా ఝుళిపిస్తూనే ఉంది. తాజాగా మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో ఇద్దరిని అరెస్టు చేసిన ఈడి.. 100 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులను జప్తు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణల కేసుకు సంబంధించ బెంగళూరులో జి ధనంజయ రెడ్డి, చెన్నైలో కె లియాకత్ అలీని ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

04/05/2017 - 01:04

గన్నవరం, ఏప్రిల్ 4: విజయవాడ నుండి హైదరాబాద్ మీదుగా చెన్నైకి 3వ సర్వీసును మంగళవారం ప్రారంభించినట్లు ట్రూజెట్ సంస్థ స్టేషన్ మేనేజర్ ఎం. కిరణ్‌రాజ్ తెలిపారు. చెన్నైలో ఉదయం 10.50 గంటలకు బయలుదేరి హైదరాబాద్ మీదుగా 12.10కి గన్నవరం చేరుకుంటుందని తెలిపారు. తిరిగి 12.35 గంటలకు ఇక్కడి నుండి బయలుదేరి హైదరాబాద్ గుండా చెన్నైకి వెళ్తుందన్నారు.

04/05/2017 - 01:03

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా మహేష్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఆయన పదవీ బాధ్యతల్లోకి వచ్చినట్లు మంగళవారం ఐడిబిఐ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఇండియన్ బ్యాంక్‌ను గాడిలో పెట్టిన జైన్.. ఐడిబిఐకి వస్తుండగా, ఐడిబిఐ చీఫ్ కిశోర్ ఖారత్.. ఇండియన్ బ్యాంక్‌కు వెళ్తున్నారు.

04/05/2017 - 01:02

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: క్రికెట్ పండగ మొదలైంది. పొట్టి మ్యాచ్‌లకు యమా క్రేజ్‌ను తీసుకొచ్చిన ఐపిఎల్‌లో పదో సీజన్ రానేవచ్చింది. వివిధ వ్యాపార సంస్థలు ఇప్పటికే ఆయా జట్లతో తమ స్పాన్సర్‌షిప్‌లను దాదాపు ఖరారు చేశాయి. తాజాగా మొబైల్ ఫోన్ల తయారీదారు జియోని ఇండియా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మరోవైపు సైకిళ్ల ఉత్పత్తిదారు హీరో సైకిల్స్..

04/05/2017 - 01:01

విశాఖపట్నం, ఏప్రిల్ 4: విస్తరణలో భాగంగా విశాఖపట్నం పోర్టు ట్రస్టు (విపిటి)లో చేపట్టిన అభివృద్ధి పనులు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) చివరకు పూర్తి కానున్నాయి. పోర్టులో కార్గో హ్యాండ్లింగ్‌ను మరింత విస్తృతపరిచే చర్యల్లో భాగంగా 243.23 కోట్ల రూపాయలతో చేపట్టిన డబ్ల్యుక్యూ-7 (వెస్ట్‌క్యూ-7), డబ్ల్యుక్యూ-8 (వెస్ట్‌క్యూ-8) పనులు వచ్చే మార్చి చివరి నాటికి పూర్తికానున్నాయి.

04/05/2017 - 01:00

టాటా మోటార్స్ మంగళవారం హైదరాబాద్‌లో తమ నూతన కారు టిగోర్‌ను ఆవిష్కరించింది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ
ధర రూ. 4.85 లక్షలు, డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర
రూ. 5.77 లక్షలుగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది

04/05/2017 - 00:58

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రియల్ ఎస్టేట్ క్రమబద్ధీకరణ చట్టం నేపథ్యంలో స్టాంపు డ్యూటీలను తగ్గించి, భూమి విలువను మార్కెట్ ధరలకు దగ్గరగా పెంచాలని కోరుతున్నట్లు కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఎపి స్టేట్ ఉపాధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్ తెలిపారు.

04/04/2017 - 00:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: నిర్మాణం, ఔషధ, విద్య తదితర రంగాల్లో దాదాపు 36 బిలియన్ డాలర్ల విలువైన 31 అవగాహన ఒప్పందాలను భారత్-మలేసియా సంస్థలు కుదుర్చుకున్నాయి. సోమవారం ఇక్కడ మలేసియా ప్రధాన మంత్రి మహమ్మద్ నజీబ్ తున్ అబ్దుల్ రజాక్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఈ ఎమ్‌ఒయులను ఆయా సంస్థల ప్రతినిధులు మార్చుకున్నారు.

04/04/2017 - 00:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఒఒ) యుబి ప్రవీణ్‌రావు వేతన పెంపును దేశీయంగా రెండో అతిపెద్ద ఐటి సంస్థ అయిన ఇన్ఫోసిస్ గట్టిగా సమర్థించుకుంది. ప్రవీణ్‌రావు వేతన పెంపును సంస్థ మాజీ చైర్మన్, వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి ఆదివారం తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో సోమవారం ఇన్ఫోసిస్ స్పందించింది.

Pages