S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/04/2017 - 00:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: బిఎస్-3 వాహనాలపై సుప్రీం కోర్టు విధించిన నిషేధం విలువ 3 వేల కోట్ల రూపాయలుగా ఉంటుందని మార్కెట్ రిసెర్చ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయి ప్రమాదకర స్థితికి చేరుకున్న నేపథ్యంలో బిఎస్-3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై ఈ నెల 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు గత నెల మార్చి 29న అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పినది తెలిసిందే.

04/04/2017 - 02:08

ముంబయి, ఏప్రిల్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. నూతన ఆర్థిక సంవత్సరాని (2017-18)కి శుభారంభాన్నిస్తూ ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 289.72 పాయింట్లు పుంజుకుని 29,910.22 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 64.10 పాయింట్లు ఎగిసి 9,237.85 వద్ద నిలిచింది.

04/04/2017 - 00:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను మెరుగుపరచడంలో భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ కీలకపాత్ర పోషించగలదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడ దక్షిణ ఆసియా ఉప ప్రాంతీయ ఆర్థిక సహకార (ఎస్‌ఎఎస్‌ఇసి) సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షోభ సమయంలో కలిసికట్టుగా ఉండాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు.

04/04/2017 - 00:32

ముంబయి, ఏప్రిల్ 3: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనమైన ఐదు అనుబంధ బ్యాంకుల్లో ఇప్పటిదాకా 2,800 ఉద్యోగులు మాత్రమే స్వచ్చంధ పదవీ విరమణ (విఆర్‌ఎస్) పథకాన్ని ఎంచుకున్నారని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య సోమవారం తెలిపారు. నిజానికి 12,000 మందికిపైగా విఆర్‌ఎస్‌కు అర్హులుగా ఉన్నారని ఆమె చెప్పారు.

04/04/2017 - 00:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు..

04/04/2017 - 00:27

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: దేశీయ ఆటోరంగ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారీగా నమోదయ్యాయి. మారుతి సుజుకి 9.8 శాతం వృద్ధితో 15,68,603 యూనిట్లను విక్రయించగా అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)లో 14,29,248 యూనిట్లను అమ్మింది. టాటా మోటార్స్ విక్రయాలు 5,11,705 యూనిట్ల నుంచి 5,42,561 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు కూడా 4,84,324 యూనిట్ల నుంచి 5,09,707 యూనిట్లకు ఎగిశాయి.

04/03/2017 - 00:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: రిజర్వ్ బ్యాంక్ వచ్చే వారం జరపనున్న ద్రవ్య పరపతి విధానం సమీక్ష, అలాగే స్థూల ఆర్థిక గణాంకాల విడుదల వచ్చేవారం స్టాక్స్ ఏ దిశలో కదలనున్నాయో నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. కాగా, శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో వచ్చే వారం నాలుగు రోజులే ట్రేడింగ్ జరగనుంది.

04/03/2017 - 00:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో పాటు డిప్యూటీ గవర్నర్ల వేతనాలు భారీగా పెరిగాయి. వీరి మూల వేతనాలను ప్రభుత్వం ఒకేసారి రెట్టింపు కంటే ఎక్కువ మొత్తానికి పెంచింది. దీంతో ఇప్పటివరకూ రూ.90 వేలుగా ఉన్న ఆర్‌బిఐ గవర్నర్ మూల వేతనం ఎకాఎకిన రూ.2.5 లక్షలకు, రూ.80 వేలుగా ఉన్న డిప్యూటీ గవర్నర్ల మూల వేతనం రూ.2.25 లక్షలకు పెరిగింది.

04/03/2017 - 00:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఫేమ్ ఇండియా పథకం కింద మైల్డ్ హైబ్రిడ్ వాహనాలకు ఇస్తున్న రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియాకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది.

04/03/2017 - 00:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: దేశంలో ప్రధాన స్టాక్ ఎక్స్‌చేంజి అయిన బిఎస్‌ఇ సోమవారం నుంచి ట్రేడింగ్ ఆధారంగా ప్రతి ఈక్విటీపైనా లావాదేవీ చార్జీని వసూలు చేయనుంది. బిఎస్‌ఇ తీసుకున్న ఈ చర్య కారణంగా రాబోయే రోజుల్లో భారీ లావాదేవీల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ కొత్త విధానం ప్రకారం బిఎస్‌ఇ నెలలో రూ.

Pages