S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/17/2017 - 00:38

సత్యవేడు/తడ, మార్చి 16: పరిశ్రమలకు అవసరమైన ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ సొలూషన్స్ పరికరాలను ఉత్పత్తచేసే థర్మాక్స్ లిమిటెడ్ తన నూతన ఉత్పత్తి కేంద్రానికి గురువారం ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులోని తడ వద్ద ఉన్న శ్రీ సిటీలో సెజ్‌లో భూమిపూజ చేశారు. కంపెనీ గ్లోబెల్ హెడ్ ఆషిష్ వైష్ణవ్ భూమి పూజ చేశారు. ఇటిజడ్ ప్రాంతంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.150కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది.

03/17/2017 - 00:36

న్యూఢిల్లీ, మార్చి 16: దేశీయ టెలికామ్ మార్కెట్‌లో ఆపరేటర్ల మధ్య సాగుతున్న ‘యుద్ధం’ ఏకపక్షంగానే కొనసాగనుంది. రిలయన్స్ జియో తమ వినియోగదారులకు కొనసాగిస్తున్న ఉచిత ప్రమోషనల్ ఆఫర్‌పై టెలికామ్ ట్రిబ్యునల్ స్టే విధించకపోవడమే ఇందుకు కారణం.

03/16/2017 - 06:12

వాషింగ్టన్, మార్చి 15: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2005లో 38 మిలియన్ డాలర్ల పన్నులను చెల్లించారు. 150 మిలియన్ డార్లకుపైగా ఉన్న తన ఆదాయంపై ఈ మేరకు పన్నులను ట్రంప్ చెల్లించినట్లు వైట్‌హౌజ్ వర్గాలు బుధవారం తెలిపాయి. ఓ ప్రజాదరణ పొందిన టెలివిజన్ షోలో ట్రంప్ ట్యాక్స్ రిటర్న్స్‌పై కథనం రావడంతో వైట్‌హౌజ్ పైవిధంగా స్పందించింది.

03/16/2017 - 06:07

దేశంలోనే రెండో స్థానం
ద్వితీయ శ్రేణి పట్టణాలకూ వేగంగా విస్తరణ
మండలిలో తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్

03/16/2017 - 06:06

ముద్రణ వ్యయాన్ని వెల్లడించిన కేంద్రం
రూ. 2.87తో 500 నోటు
రూ. 3.77తో 2,000 నోటు ప్రింటింగ్

03/16/2017 - 06:05

హైదరాబాద్, మార్చి 15: ఓ అనామకుడి ఖాతాలో రూ. 17 కోట్లు జమ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఒకే ఖాతా ద్వారా చెల్లింపులు నిర్వహిస్తూ పన్నులు ఎగవేస్తున్న ఆ అనామకుడిని ఐటి శాఖ అధికారులు బయటపెట్టారు. నిరుడు నవంబర్ 8న పాత పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత హైదరాబాద్ నాంపల్లిలోని ఒక బ్యాంక్ ఖాతాలో రూ. 17 కోట్లు జమ అవడాన్ని ఆదాయపు పన్నుల శాఖ అధికారులు గమనించారు.

03/16/2017 - 06:04

విశాఖపట్నం, మార్చి 15: బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌లు, విత్‌డ్రాలపై చార్జీల మోత మోగుతున్న తరుణంలో పోస్ట్ఫాసు సేవలపై ప్రజలు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోస్ట్ఫాసు డెబిట్ కార్డుతో ఎక్కడైనా ఎన్ని లావాదేవీలు నిర్వహించినా చార్జీల భారం పడకపోవడంతో ఖాతాదారులు వీటిపై ఆకస్తి వీలుంది మరి. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై విధించిన విపరీతమైన ఆంక్షలు ఖాతాదారులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.

03/15/2017 - 00:18

హైదరాబాద్, మార్చి 14: బీఆర్‌పీ పైప్స్, ఫిట్టింగ్స్.. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత సుమ కనకాలను నియమించుకుంది. 25 సంవత్సరాలకుపైగా వ్యాపారానుభవం కలిగిన ఈ సంస్థ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. 2022 నాటికి 1,000 మంది ఉద్యోగులను నియమిస్తామని సంస్థ సిఎండి ప్రకాశ్ పట్వారీ తెలిపారు.
మార్కెట్లకు మోదీ జోష్

03/15/2017 - 00:14

న్యూఢిల్లీ, మార్చి 14: ద్రవ్యోల్బణం గత నెల ఫిబ్రవరిలో పెరిగింది. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ లేదా హోల్‌సేల్) ఆధారిత ద్రవ్యోల్బణం ఏకంగా 39 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 6.55 శాతంగా నమోదైంది. వినియోగదారుల ధరల (చిల్లర) సూచీ (సిపిఐ లేదా రిటైల్) ఆధారిత ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ఠ స్థాయికి చేరి 3.65 శాతంగా ఉంది. అంతకుముందు నెల జనవరిలో డబ్ల్యుపిఐ సూచీ 5.25 శాతంగా ఉండగా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.17 శాతంగా ఉంది.

03/15/2017 - 00:12

అమరావతి, మార్చి 14: నవ్యాంధ్రలో ఉన్న వనరుల ఆధారంగా ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు స్థాపించవచ్చో అధ్యయనం చేసి ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపార అవకాశాలు దేశంలో మరే రాష్ట్రానికి లేవని, వీటిని వినియోగించుకుని రాష్ట్రానికి భారీఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.

Pages