S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/01/2017 - 00:19

బాసెల్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: నగదు రహిత లావాదేవీలే ముద్దు అని ఓ వైపు భారత్ అంటుంటే, మరోవైపు నగదు లావాదేవీలే ముద్దు అని స్విట్జర్లాండ్ చెబుతోంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు నగదు రహిత లావాదేవీలే చక్కని మార్గమని భావించిన కేంద్రం.. నిరుడు నవంబర్ 8న పాత పెద్ద నోట్లను రద్దు చేసినది తెలిసిందే.

03/01/2017 - 00:19

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 51 శాతం వాటాను కేంద్రం అమ్మేయాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీన్ని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే కొట్టిపారేస్తున్నారు. నష్టాల్లో నడుస్తున్న ఎయిరిండియాలో 51 శాతం వాటాను ఓ వ్యూహాత్మక భాగస్వామికి కేంద్ర ప్రభుత్వం అమ్మనుందనే వార్తలు వెలువడిన నేపథ్యంలో చౌబే వాటిని మంగళవారం ఖండించారు.

03/01/2017 - 00:17

ముంబయి, ఫిబ్రవరి 28: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సోమవారం కూడా నష్టాలకే పరిమితమైన నేపథ్యంలో మదుపరులను జిడిపి గణాంకాల భయం వెంటాడింది. నిరుడు అక్టోబర్-డిసెంబర్ జిడిపి వృద్ధిరేటు గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ).. మార్కెట్లు ముగిశాక విడుదల చేయగా, అవి ఎలా ఉంటాయోనన్న అంచనాల మధ్య మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు.

03/01/2017 - 00:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: గుజరాత్, అసోం రాష్ట్రాలకు ప్రభుత్వరంగ చమురు, గ్యాస్ ఉత్పాదక సంస్థలు ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియాలు చెల్లించాల్సిన రాయల్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. దాదాపు 22,000 కోట్ల రూపాయలను ఆ రెండు రాష్ట్రాలకు ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా బకాయిపడగా, ఈ బకాయిల్లో వడ్డీ మినహా ఉన్న మొత్తం 14,698 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తోంది.

02/28/2017 - 00:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఔట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్‌తోపాటు ఎస్‌ఎమ్‌ఎస్‌లు, డేటా వినియోగంపై అన్ని రకాల రోమింగ్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.

02/28/2017 - 00:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విజయ్ మాల్యా 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు బదిలీ చేశారన్న బ్యాంకుల ఆరోపణలపై విచారణ సోమవారం సుప్రీం కోర్టులో జరగలేదు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టులోని మరో ధర్మాసనం ముందుండటమే దీనికి కారణం.

02/28/2017 - 00:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ప్రభుత్వరంగ బ్యాంకులు మంగళవారం మూతబడుతున్నాయి. వివిధ డిమాండ్ల పరిష్కారార్థం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (యుఎఫ్‌బియు) బంద్ నిర్వహిస్తోంది. యుఎఫ్‌బియు.. 9 ఉద్యోగ సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తోంది.

02/28/2017 - 00:42

ముంబయి, ఫిబ్రవరి 27: క్యాపిటల్ మార్కెట్ల సమగ్రతను దెబ్బతీసే శక్తులు, సంస్థలపట్ల కఠినంగా వ్యవహరించామని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ యుకె సిన్హా అన్నారు. మార్చి 1తో సిన్హా పదవీకాలం ముగుస్తున్న క్రమంలో సోమవారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

02/28/2017 - 00:40

రామచంద్రపురం, ఫిబ్రవరి 27: సుమారు 57 సంవత్సరాల క్రితం కోస్తాంధ్రలో ఏకైక బ్రూవరీస్ సంస్థగా గణతికెక్కిన తూర్పు గోదావరి జిల్లాలోని ఆర్టోస్ (ప్రస్తుతం ఆర్థోస్) బీరు ఫ్యాక్టరీ గత సంవత్సర కాలంగా ఉత్ఫత్తిని నిలిపివేసిన నేపథ్యంలో కార్మికులను కర్మాగారంలోకి రావద్దంటూ యాజమాన్యం సోమవారం గేట్ నోటీసు జారీ చేసింది. ఈ పరిస్థితిని కార్మికులు లాకౌట్ కాని లాకౌట్‌గా అభివర్ణిస్తూ రోడ్డెక్కారు.

02/28/2017 - 00:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పత్తి దిగ్గజం ఒఎన్‌జిసి.. దేశీయ ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థల్లో మూడో అతిపెద్దదైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)ను హస్తగతం చేసుకునే అవకాశాలున్నాయి. దాదాపు 44,000 కోట్ల రూపాయల (6.6 బిలియన్ డాలర్లు)తో హెచ్‌పిసిఎల్‌ను ఒఎన్‌జిసి చేజిక్కించుకునే వీలుంది.

Pages