S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/25/2017 - 00:25

రిలయన్స్ జియో రాకతో భారతీయ టెలికామ్ రంగంలో నిత్యం సంచలనాలు చోటుచేసుకుంటున్నది తెలిసిందే. అప్పటిదాకా కొనసాగిన భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా ఆధిపత్యానికి బ్రేకులు పడగా, ఉచిత డేటా-కాల్స్‌తో జియో దూసుకెళ్తోంది. దీంతో మిగతా సంస్థలూ తమ ఇంటర్నెట్ డేటా, కాల్స్ ధరలను భారీగా తగ్గిస్తుండగా, వాటి ఆదాయంపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

02/25/2017 - 00:23

తడ, ఫిబ్రవరి 24: నెల్లూరు- చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పిన శ్రీసిటీ పారిశ్రామిక వాడలో శుక్రవారం ముంబయకి చెందిన పార్క్‌సన్ ప్యాకేజింగ్ లిమిటెడ్ నూతన పరిశ్రమను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రమేష్ కేజ్రీవాల్, బాబ్స్ గ్రూప్ సిఇఒ జీన్ పాప్కల్ బాబ్స్, హెడిల్‌బర్క్ గ్రూప్ హెడ్ స్టీఫెన్ ఫ్లంజ్‌లు పాల్గొన్నారు.

02/25/2017 - 00:18

హైదరాబాద్, ఫిబ్రవరి 24: వంద రోజుల్లో 100 కోట్ల రూపాయల రుణాలను లక్ష్యంగా పెట్టుకుంది ఆక్సీలోన్స్. వచ్చే నెల 1 నుంచి జూన్ 8 వరకు 100 కోట్ల రూపాయలను పంపిణీ చేయడానికి వీలుగా శుక్రవారం ఇక్కడ ‘ఆక్సీలోన్ ఛాలెంజ్’ ప్రారంభించింది. గత 15 రోజుల్లో 250 కోట్ల రూపాయల విలువైన 270 రుణ దరఖాస్తులను అందుకున్నామని విలేఖరులతో సంస్థ వ్యవస్థాపక సిఇఒ రాధాకృష్ణ టి తెలిపారు.

02/25/2017 - 00:14

ముంబయి, ఫిబ్రవరి 24: క్యాస్ట్రాల్ ఇండియా నికర లాభం నిరుడు అక్టోబర్-డిసెంబర్‌లో గతంతో పోల్చితే 10.7 శాతం పెరిగి 155.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం మాత్రం 1 శాతం తగ్గి 782.2 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ పేర్కొంది. కాగా, ఒక్కో షేర్‌కు 4.50 రూపాయల డివిడెండ్‌ను క్యాస్ట్రాల్ బోర్డు ఇచ్చింది. 2015లో ఇది 5 రూపాయలుగా ఉంది.

02/25/2017 - 00:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అంబుజా సిమెంట్ ఏకీకృత నికర లాభం నిరుడు అక్టోబర్-డిసెంబర్‌లో గతంతో పోల్చితే 85.24 శాతం ఎగిసి 205.70 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇది 111.04 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 2016 చివరి త్రైమాసికంలో 4,93 6.20 కోట్ల రూపాయలుగా, 2015 ఆఖరు త్రైమాసికంలో 2,384.84 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.

02/24/2017 - 00:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కేంద్ర ప్రభుత్వం వచ్చే సోమవారం ఏడో విడత సావరిన్ గోల్డ్ బాండ్ల పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద జనం 500 గ్రాముల బంగారందాకా విలువైన బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బంగారు బాండ్లను జారీ చేయడం ఇదే చివరి విడత కానుంది.

02/24/2017 - 00:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: టాటా సన్స్ సంస్థ అధిపతి ఎన్.చంద్రశేఖరన్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సిఎల్) డైరెక్టర్ల బోర్డు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. టాటా గ్రూపులోని ఆతిథ్య రంగ సంస్థ అయిన ఐహెచ్‌సిఎల్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన తొలిసారి తమ బోర్డు సభ్యుడిగా నియమితుడైన చంద్రశేఖరన్ అనతి కాలంలోనే చైర్మన్‌గా ఎన్నికవడం విశేషం.

02/24/2017 - 00:35

ముంబయి, ఫిబ్రవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభంలో భారీ లాభాల్లో కొనసాగినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆరంభంలో ఆర్జించిన లాభాలను దాదాపుగా కోల్పోయి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి.

02/24/2017 - 00:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: దేశంలోని ప్రధాన టెలికామ్ ఆపరేటర్లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తన ఏడు సర్కిళ్లలో టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి టెలినార్ సౌత్ ఏషియా ఇనె్వస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ గురువారం వెల్లడించింది. అయితే ఈ కొనుగోలు ఒప్పందం విలువ ఎంతన్నదీ ఇటు ఎయిర్‌టెల్ గానీ, అటు టెలినార్ సంస్థ గానీ వెల్లడించలేదు.

02/24/2017 - 00:32

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైటెక్ సిటీ హైదరాబాద్‌కే పరిమితం కాదు. తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీలు రానున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌కే పరిమితమైన ఐటి కంపెనీలు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో జిల్లాల్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రూరల్ టెక్నాలజీ సెంటర్ పాలసీ వల్ల ఐటి కంపెనీలు కరీంనగర్, వరంగల్ నగరాలపై దృష్టిని సారించాయి.

Pages