S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/12/2017 - 01:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జరిగిన నగదు డిపాజిట్లకు సంబంధించి ప్రశ్నలకు సమాధానం కోసం గడువును ఆదాయ పన్ను (ఐటి) శాఖ ఈ నెల 15 వరకు పెంచింది. అలాగే 20,000 రూపాయలు అంతకంటే ఎక్కువగా ఉన్న నగదు విరాళాలు లేదా బహుమతుల వివరాలను స్వచ్చంధంగా తెలియపరచాలని, తద్వారా విచారణ నుంచి తప్పించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

02/12/2017 - 04:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఇటీవలి ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందని అనుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అయినప్పటికీ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్‌బి ఐ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు.

02/12/2017 - 01:09

భీమవరం, ఫిబ్రవరి 11: బ్రాండ్ ఇండియాగా పేరొందిన భీమవరం రొయ్యకు విదేశాల్లో మరింత డిమాండ్ పెరిగింది. ఇక నుంచి కాలుష్య రహితంగా రొయ్యను పండించేలా అడుగులు పడుతు న్నాయ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ‘ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్’ అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది.

02/12/2017 - 01:07

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్ ఏకీకృత నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 383.87 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 659.35 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఐడియా సెల్యులార్ అందుకుంది.

02/12/2017 - 01:05

వాషింగ్టన్, ఫిబ్రవరి 11: విదేశాలకు మకాం మార్చుకోవాలని ఆలోచిస్తున్న దేశీయ కంపెనీలు తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉద్యోగులను విడిచిపెట్టి, కేవలం బై బై చెప్పి వెళ్లిపోవడం ఇటువంటి సంస్థలకు అనుకున్నంత సులువు కాబోదని, ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తామని ఆయన వారాంతపు రేడియో ప్రసంగంలో స్పష్టం చేశారు.

02/12/2017 - 01:05

హైదరాబాద్, ఫిబ్రవరి 11: పొదుపు రూపంలో పెట్టుబడులు మరింత మెరుగుపడాలంటే బ్యాంకుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా సెక్యూరిటీ మార్కెట్‌పై వచ్చేది ఎక్కువగా ఉండాలని నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఫెయిజన్ ముస్త్ఫా అన్నారు. అప్పుడే క్యాపిటల్ మార్కెట్ వృద్ధి బాట పడుతుందని స్పష్టం చేశారు.

02/12/2017 - 01:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పాదక సంస్థ కోల్ ఇండియా ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 22 శాతం క్షీణించి 2,884.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 3,718 కోట్ల రూపాయలుగా ఉంది.

02/11/2017 - 00:54

ముంబయి, ఫిబ్రవరి 10: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 71 శాతం పెరిగి 2,152.2 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో బ్యాంక్ లాభం 1,259.4 కోట్ల రూపాయలుగా ఉంది.

02/11/2017 - 00:53

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ఆధ్వర్యంలోని అన్ని చౌక ధరల దుకాణాల (రేషన్ షాపులు)ను ఈ ఏడాది జూన్‌కల్లా ఆధార్ అనుసంధానంతో ఏకం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ మేరకు శుక్రవారం తెలిపారు. 5.58 లక్షల రేషన్ షాపులను ఆధార్ ఆధారంగా అనుసంధానం చేయాలని చూస్తున్నట్లు చెప్పారు.

02/11/2017 - 00:53

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి.. మల్టీ-స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పాలని యోచిస్తోంది. హాస్పిటాలిటీ రంగంలో తమకున్న అనుభవాన్ని.. మెడికల్ టూరిజం విభాగంలోకి విస్తరించాలనుకుంటోంది. కోల్‌కతాకు చెందిన ఈ సంస్థ సిగరెట్లు తదితర ఎఫ్‌ఎమ్‌సిజి ఉత్పత్తులకు పెట్టింది పేరు.

Pages