S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/06/2019 - 04:34

భీమవరం, సెప్టెంబర్ 5: దేశంలోని ఆక్వా ఎగుమతులను లక్ష కోట్లకు పెంచుతామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, డైయిరీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగానికి ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

09/06/2019 - 04:27

విజయవాడ, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు వీలుగా 93 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం మంజూరు చేసింది. రాష్ట్రంలో 3500 మద్యం దుకాణాలను రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించడం తెలిసిందే. దీంతో దుకాణాల అద్దె, వేతనాలు, రవాణా, విద్యుత్ చార్జీలు తదితర ఖర్చులు చెల్లించేందుకు వీలుగా ఈ నిధులు కేటాయిస్తూ పాలనామోదాన్ని ప్రభుత్వం తెలిపింది.

09/06/2019 - 04:02

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 5: సాగర్‌లోని ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం సాయంత్రం నుండి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. గత వారం రోజులుగా ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తలెత్తిన సాంకేతిక కారణాలకు తోడు కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపులు జరగని కారణంగా జెన్‌కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.

09/06/2019 - 04:00

హైదరాబాద్, సెప్టెంబర్ 5: ఎల్‌పీజీ, పెట్రోల్ బంకులు, కిరోసిన్ డీలర్లు ఇక నుంచి ప్రతి ఏడాది లైసెన్స్ రెన్యువల్ నుంచి మినహాయింపుఇస్తూ తెంలగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి లైసెన్స్ తీసుకున్నవారు ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా వన్ టైమ్ లైసెన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది.

09/06/2019 - 01:45

విజయవాడ, సెప్టెంబర్ 5: ఇటీవల భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించిన విజయవాడ - గూడూరు ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కి వినియోగదారుల నుండి భారీ స్పందన లభించి 85 శాతం ప్రయాణికులతో నడుస్తోంది. సౌకర్యవంతమైన సమయాల్లో రాష్ట్ర రాజధాని, సింహపురి ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, కావలి, నెల్లూరు ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటోంది.

09/05/2019 - 23:17

మాడ్రిడ్‌లో గురువారం పట్టాలెక్కిన ‘నోహా’ గూడ్స్ ట్రైన్ ఇదే. కేవలం వస్తువుల రవాణాకు ఉద్దేశించి రైల్ ఫ్రెయట్ ఫార్వార్డ్ (ఆర్‌ఎఫ్‌ఎఫ్) నడిపిస్తున్న ఈ పియో రైలును ప్రపంచంలోనే అతి పెద్దదైన మొబైల్ నెట్‌వర్క్ ప్రకటనలతో ముంచెత్తేశారు. 2030 సంవత్సరంలోనే 30 శాతం రవాణాను చేజిక్కించుకోవాలని ఆర్‌ఎఫ్‌ఎఫ్ లక్ష్యంగా ఎంచుకుంది. అందులో భాగంగానే ‘నోహా’ను పట్టాలెక్కించింది.

09/05/2019 - 04:35

ముంబయి: ముంబయి స్టాక్ మార్కెట్ (బీఎస్‌ఈ)లో బుధవారం లావాదేవీలు ఆశాజనకంగానే కొనసాగాయి. మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, సెనె్సక్స్ 161.83 పాయింట్లు పెరిగి 36,724.74 పాయింట్లకు చేరింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన వెంటనే వివిధ కంపెనీ షేర్ల లావాదేవీలు నష్టాలను ఎదుర్కొంది. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి మెరుగుపడినట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత దారుణ పతనం కనిపించింది.

09/05/2019 - 01:09

విజయవాడ : నూతన ఇసుక విధానానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గురువారం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇసుక తవ్వకం, రవాణాను ఏపీ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టనుంది. పర్యావరణం దెబ్బతినకుండా, ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త విధానాన్ని రూపకల్పన చేశారు. గతంలో పోలిస్తే ఇసుక ధర తగ్గనుంది.

09/04/2019 - 22:43

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: విశాఖ నుంచి రాజమండ్రి మీదుగా బెంగళూరుకు విమాన సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ అంగీకారం తెలిపింది. ఈ నెల 16 నుంచి ఈ విమాన సర్వీసు అందుబాటులోకి రానున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ నరేష్ తెలిపారు. ఎయిర్ పోర్టు సలహా కమిటీ సమావేశం విశాఖలో బుధవారం జరిగింది.

09/04/2019 - 22:41

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: అమెరికాతో స్వేచ్చా వాణిజ్య విధానాలను అనుసరించాల్సిందిగా అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఆమ్‌చామ్) భారత్‌కు సూచించింది. స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమ్‌చామ్ అధ్యక్షురాలు తారా జోసెఫ్ తెలిపారు. ద్వైపాక్షిక పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

Pages