S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/10/2017 - 01:05

విశాఖపట్నం, ఫిబ్రవరి 9: ప్రపంచ మార్కెట్‌లోకి ఎక్కుతున్న అరకుకాఫీ ఇక నుంచి అరకు కాఫీ బ్రాండ్‌తో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రపంచ దేశాల్లో బ్రెజిల్‌తోపాటు పలు దేశాల్లో కాఫీ పంటకు పేరుండగా, ఇక నుంచి భారతదేశంలో విశాఖ జిల్లా అరకు కాఫీ ప్రతిష్ఠను మరింత పెంచే విధంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో గిరిజన సహకార సంస్థ (జిసిసి) లక్ష్యాలను అధిగమించనుంది.

02/10/2017 - 01:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హెచ్‌ఎంఎస్‌ఐ (హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా) విస్తృత ప్రజాదరణ పొందిన తమ యాక్టివా-125 స్కూటర్‌కు మరిన్ని మెరుగులు దిద్ది అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారత్ స్టేజ్-4 (బిఎస్-4) ఉద్గార ప్రమాణాలు, ఎహెచ్‌ఓ (హెడ్ ల్యాంప్ ఆన్) లాంటి అత్యాధునిక ఫీచర్లు ఈ స్కూటర్ ప్రత్యేకతలు.

02/10/2017 - 01:03

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉన్నతాధికార ముఖ్యమంత్రుల కమిటీ సూచించిన విధంగా దేశంలో రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలపై బ్యాంకింగ్ నగదు లావాదేవీల పన్ను (బిసిటిటి) విధించాలన్న విషయంపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.

02/10/2017 - 01:02

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కీలక వడ్డీ రేట్లను తగ్గించకూడదన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం భారతీయ ఈక్విటీలకు, రూపాయికి సమీప భవిష్యత్తులో కాస్త ప్రతికూలంగా మారవచ్చని నోమురా ఒక నివేదికలో అభిప్రాయ పడింది.వడ్డీ రేట్లను తగ్గించకూడదన్న ఆశ్చర్యకర నిర్ణయం భారతీయ ఈక్విటీలకు, రూపాయికి సమీప భవిష్యత్తులో కాస్త నెగెటివ్‌గా మారవచ్చు.

02/10/2017 - 01:02

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణలో హెల్త్ టెక్ స్టార్టప్స్‌ను సంయుక్త నిర్వహణలో చేపట్టేందుకు వీలుగా ఫార్మా దిగ్గజం నోవార్టిస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌పిఎల్)తో టి-హబ్ అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. నోవర్టిస్‌తో కలిసి పనిచేయడం వల్ల హెల్త్ టెక్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ స్టార్టప్స్ స్ధాపన, వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని టి హబ్ ఇన్‌క్యుబేటర్ పేర్కొంది.

02/09/2017 - 00:48

ముంబయి, ఫిబ్రవరి 8: మరోసారి కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్యసమీక్షను ముగించేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ). బుధవారం నిర్వహించిన ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి ద్వైమాసిక ద్రవ్యసమీక్షలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది ఆర్‌బిఐ. నిరుడు డిసెంబర్‌లో జరిగిన గత ద్రవ్యసమీక్షలో కూడా రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉన్నాయి.

02/09/2017 - 00:46

ముంబయి, ఫిబ్రవరి 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండటంతో మదుపరులు లాభాల స్వీకరణ వైపు నడిచారు. అంచనాలకు విరుద్ధంగా రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్‌బిఐ వెళ్లకపోవడంతో ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

02/09/2017 - 00:45

హైదరాబాద్, ఫిబ్రవరి 8: దేశీయ సౌర విద్యుదుత్పాదనలో తెలంగాణకు అగ్రస్థానం వస్తుందని, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా అన్నారు. 2019-20 నాటికి 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు.

02/09/2017 - 00:45

ముంబయి, ఫిబ్రవరి 8: ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ యాత్రా డాట్‌కామ్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. హాలిడే ప్యాకేజీల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా ఈ ఒప్పందాన్ని చేసుకున్నట్లు బుధవారం సంస్థ తెలిపింది. అవగాహన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరిగేలా యాత్రా డాట్‌కామ్ పనిచేస్తుంది.

02/09/2017 - 00:44

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రభుత్వరంగ విద్యుదుత్పాదక సంస్థ ఎన్‌టిపిసి నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 7.5 శాతం పడిపోయి 2,468.72 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 2,668.77 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages