S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/14/2016 - 07:08

రాజమహేంద్రవరం, జనవరి 13: పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో కనీస పురోగతి కూడా కనిపించటం లేదు. పోలవరం హెడ్‌వర్క్స్ నిర్మాణ పనులతో సమానంగానే పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరగాలి. లేదంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదు.

01/14/2016 - 07:07

విశాఖపట్నం, జనవరి 13: ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చైనా, రష్యా వంటి దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. భారత్ మాత్రం సేవా రంగంపై వస్తున్న ఆదాయాన్ని చూపించి, ఆర్థిక ఇబ్బంది లేదని ప్రపంచ దేశాల ముందు చెప్పుకుంటుంటోంది. తయారీ, వ్యవసాయ రంగాలు పూర్తిగా ప్రతికూల పర్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది.

01/14/2016 - 07:06

ముంబయి, జనవరి 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం ప్రకటించిన పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రతికూలంగా నమోదైనప్పటికీ, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు.

01/14/2016 - 07:05

ముంబయి, జనవరి 13: హైదరాబాద్‌కు చెందిన మల్టీ స్పెషాలిటీ హెల్త్‌కేర్ కేర్ హాస్పిటల్స్‌లో ఎడ్వెంట్ ఇంటర్నేషనల్ వాటాను యుఎఇకి చెందిన అబ్రాజ్ గ్రూప్ దక్కించుకుంది. మొత్తం 72 శాతం వాటాను దాదాపు 1,300 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కేర్ హాస్పిటల్స్ మొత్తం విలువ 1,800 కోట్ల రూపాయల పైమాటే.

01/13/2016 - 18:21

ముంబయి‌: స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 172 పాయింట్లు లాభపడి 24,854 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 7,562 పాయింట్ల వద్ద ముగిసింది.

01/13/2016 - 08:04

న్యూఢిల్లీ, జనవరి 12: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. నాన్-కోర్ ఆస్తులను నగదుగా మార్చుకోవాలని ఆలోచిస్తోంది. అలాగే అనుంబంధంగా ఉన్న బ్యాంకింగ్ సంస్థలను లిస్టింగ్ చేయాలని కూడా యోచిస్తోంది. పెట్టుబడులు, ఇతరత్రా అవసరాలకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడానికే ఇదంతా అని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మంగళవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం అసోచామ్ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు.

01/13/2016 - 08:02

ముంబయి, జనవరి 12: దేశీయ ఐటి రంగ దిగ్గజం టిసిఎస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 14.2 శాతం పెరిగి 6,083 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 5,328 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 11.7 శాతం పెరిగి 27,364 కోట్ల రూపాయలకు చేరింది. అంతకుముందు 24,501 కోట్ల రూపాయలకు పరిమితమైంది.

01/13/2016 - 08:01

రాజమహేంద్రవరం, జనవరి 12: గోదావరి నదిలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజికి ఎగువన ఉన్న ఇసుక మేటలను తొలగించేందుకు ప్రతిపాదించిన డ్రెడ్జింగ్ కార్యక్రమానికి బ్రేకు పడినట్టు తెలుస్తోంది. బ్యారేజి నుండి 3 కిలోమీటర్లు ఎగువ ప్రాంతంలోని బౌస్ట్రింగ్ రైలు వంతెన వరకు సుమారు 7 కిలోమీటర్లు పొడవున గోదావరి నదిలో ఉన్న ఇసుకను డ్రెడ్జింగ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే.

01/13/2016 - 08:00

భోపాల్, జనవరి 12: కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోగల 32 ప్రభుత్వరంగ సంస్థల్లో 12 సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. బిహెచ్‌ఇఎల్‌తోపాటు మరో 11 సంస్థలు ప్రస్తుతం నష్టాల్లోనే ఉన్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన మహారత్న హోదా కలిగిన బిహెచ్‌ఇఎల్ ఒక ఏడాదిలో లాభాల్లోకి రాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

01/13/2016 - 08:00

న్యూఢిల్లీ, జనవరి 12: అనిల్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) నుంచి దాదాపు 5,600 కోట్ల రూపాయలను టెలికామ్ శాఖ డిమాండ్ చేస్తోంది. స్పెక్ట్రమ్ సరళీకరణకు పాల్పడ్డారనే దానిపై ఈ మొత్తాన్ని టెలికాం శాఖ కోరుతుండగా, దీనికి సంబంధించి గత నెల డిసెంబర్ 22న ఆర్‌కామ్‌కు నోటీసులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది.

Pages