S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/08/2017 - 00:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) లాభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో నాలుగింతలైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 51.1 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందిన పిఎన్‌బి.. ఈ అక్టోబర్-డిసెంబర్‌లో 207.18 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది.

02/08/2017 - 00:29

హైదరాబాద్, ఫిబ్రవరి 7: సౌర విద్యుత్‌పై అసోచామ్ సంస్థ బుధవారం ఇక్కడ సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సదస్సులో విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి, టిస్‌ఇఆర్‌సి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అసోచామ్ సభ్యులు కిషోర్ నాయర్, ఎఫ్ ట్యా ప్సీ అధ్యక్షుడు రవీంద్రమోదీ, అసోచామ్ తెలంగాణ విభాగం చైర్మన్ బాడిగ శ్రీకాంత్ పాల్గొంటారు.

02/08/2017 - 00:29

హైదరాబాద్, ఫిబ్రవరి 7: ఏసిసి సిమెంట్ ఎండి, సిఇఒగా నీరజ్ అఖౌరీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘనమైన చరిత్ర, అత్యున్నతమైన నాణ్యత ఉన్న ఏసిసి సిమెంట్ ఉత్పత్తులను విస్తృతంగా మార్కెటింగ్ చేస్తామన్నారు. ఈ కంపెనీకి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, అంతకుముందు నీరజ్ అఖౌరీ లఫర్జ్ సుర్మ సిమెంట్ సిఇఒగా బాధ్యతలు నిర్వర్తించారు.

02/07/2017 - 00:25

ముంబయి, ఫిబ్రవరి 6: ఉద్వాసనకు గురైన టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్ర్తి.. ఆ సంస్థ డైరెక్టర్ పదవినీ కోల్పోయారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన టాటా సన్స్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో సంస్థ భాగస్వాములు మిస్ర్తి తొలగింపునకు మద్దతుగా ఓటేశారు. ‘ఈరోజు నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశంలో టాటా సన్స్ లిమిటెడ్ భాగస్వాములు.. టాటా సన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా సైరస్ మీస్ర్తిని తొలగించాలని తీర్మానించారు.

02/07/2017 - 00:23

హైదరాబాద్, ఫిబ్రవరి 6: బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లలోని నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) బాధ్యత నుంచి తప్పించుకోలేవని, వాటిని అదుపుచేయడం బ్యాంకర్ల విధి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ సి రంగరాజన్ సోమవారం ఇక్కడ అన్నారు.

02/07/2017 - 00:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: నగదు రహిత లావాదేవీలకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తూ ఆధార్ ఆధారిత లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పిఒఎస్ మెషీన్లపై చెల్లింపులను దేశంలోని అన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ల్లో అనుమతించాలని కేంద్రం భావిస్తోంది. ఎరువుల డిపోల్లోనూ ఈ తరహా లావాదేవీలు జరపాలని యోచిస్తోంది. ఆర్థిక కార్యదర్శి అశోక్ లావస పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు తెలిపారు.

02/07/2017 - 00:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇస్తున్న ఉచిత 4జి సేవలపై వివరణ ఇవ్వాలని టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్‌ని టెలికామ్ ట్రిబ్యునల్ టిడిశాట్ ఆదేశించింది. భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ దాఖలు చేసిన తాజా పిటిషన్ల నేపథ్యంలో పైవిధంగా స్పందించింది టెలికామ్ వివాదాల పరిష్కార, అప్పీలెట్ ట్రిబ్యునల్ టిడిశాట్.

02/07/2017 - 00:21

ముంబయి, ఫిబ్రవరి 6: జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)లో ఏజంట్లు పెద్ద ఎత్తున మానివేస్తుండడంతో దీనికి అడ్డుకట్ట వేయడంతోపాటుగా వారు మరింత ఎక్కువ వ్యాపారం చేసేలా చూడడం కోసం ఆ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న పది లక్షలకుపైగా ఏజంట్లకు చెల్లించే గ్రాట్యుటీని 3 లక్షల రూపాయలకు పెంచింది.

02/07/2017 - 00:19

కాకినాడ, ఫిబ్రవరి 6: తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం పారిశ్రామికంగా పురోగమిస్తోంది. రానున్న రెండు, మూడేళ్లలో జిల్లా పారిశ్రామిక రంగం లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలున్నట్టు అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు ప్రారంభించాయి.

02/07/2017 - 00:18

ముంబయి, ఫిబ్రవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ ర్యాలీని కొనసాగిస్తున్న సూచీలకు బుధవారం జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు మరింత జోష్‌నిచ్చాయి.

Pages