S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/07/2017 - 00:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్, ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు సోమవారం సరికొత్త ఆఫర్లను ప్రకటించాయి. ఆదివారం, రాత్రి సమయాల్లో ల్యాండ్‌లైన్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనాసరే అపరిమిత కాల్స్ ప్యాకేజీ ధరను బిఎస్‌ఎన్‌ఎల్ 99 రూపాయల నుంచి 49 రూపాయలకు తగ్గించింది.

02/07/2017 - 00:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: నకిలీ మొబైల్ ఫోన్ వినియోగదారులను నియంత్రించడంలో భాగంగా సుప్రీం కోర్టు.. మొబైల్ వినియోగదారులందరినీ గుర్తించే పటిష్ఠ వ్యవస్థను ఏడాదిలోగా తీసుకురావాలని సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రభావవంతమైన విధానం.. దేశంలోని 100 కోట్లకుపైగా మొబైల్ వినియోగదారులను పరిశీలించేలా ఉండాలని, వారి వివరాలను, గుర్తింపును కనిపెట్టగలగాలని స్పష్టం చేసింది.

02/07/2017 - 00:16

అనకాపల్లి, ఫిబ్రవరి 6: దేశంలోనే బెల్లానికి ప్రసిద్ధిగాంచిన విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్‌లో రికార్డు స్థాయిలో బెల్లం ధరలు పలికాయి. పది కిలోల మంచి రంగు బెల్లానికి 405 రూపాయల వరకు ధర వచ్చింది. ఈ ధర మార్కెట్ చరిత్రలో ఏనాడూ తాము చూడలేదని అటు వ్యాపారులు, ఇటు రైతులు అంటున్నారు.

02/06/2017 - 01:03

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల వద్ద నిధులు ఇబ్బడిముబ్బడిగా ఉండడం, అలాగే చమురు ధరలు పెరుగుతుండడంతో ద్రవ్యోల్బణంపై దాని ప్రభావం పడే అవకాశం ఉండడంతో రిజర్వ్ బ్యాంక్ వచ్చే వారం జరిగే ద్రవ్య పరపతి విధానం సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

02/06/2017 - 01:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి)కు ఆరేళ్లలో దాదాపు 11 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బొగ్గు కొరత, కొనుగోళ్లలో ఇబ్బందులే ఇందుకు కారణమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది.

02/06/2017 - 01:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: వచ్చే వారం జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానం సమీక్ష,కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్ తీరును నిర్ణయించనున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నెల 8న జరిగే ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించాలా వద్దా అనే దానిపై ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ ఒక నిర్ణయం తీసుకోనుంది.

02/06/2017 - 00:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత వాటికి సమకూర్చాల్సిన రెండవ, తుది విడత పెట్టుబడులను ప్రభుత్వం ఖరారు చేయనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

02/06/2017 - 00:58

భీమవరం, ఫిబ్రవరి 5: తెలుగు రాష్ట్రాల్లో సాగుచేస్తున్న వనామి రొయ్య ప్రపంచంలోని వంద దేశాలకు ఎగుమతి అవుతోందని ఎంపెడా జాయింట్ డైరక్టర్ సంపత్‌కుమార్ చెప్పారు. అమెరికాతోపాటు జపాన్, యూరోపియన్ యూనియన్, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ దేశాలకు మరింత ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారన్నారు.

02/06/2017 - 00:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ప్రస్తుతం కృషి చేస్తున్న విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు (ఎఫ్‌ఐపిబి)కు బదులుగా రానున్న రెండు నెలల్లో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు.

02/06/2017 - 00:55

చౌటుప్పల్, ఫిబ్రవరి 5: చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌కు కందుల వరుద కొనసాగుతోంది. అంచనాలకు మించి కందులు మార్కెట్ వస్తుండడంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో మార్కెట్‌కు సెలవులు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు మార్కెట్‌కు నాలుగు రోజుల వంతును సెలవులు ప్రకటించారు. ఆదివారం రెండవ దఫా కంది కొనుగోలు కేంద్రం పునఃప్రారంభమైంది.

Pages