S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/05/2017 - 03:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: యేటా 2 లక్షల రూపాయలకు మించి రెండో ఇంటి కొనుగోలుకు పన్ను ప్రోత్సాహకాలు ఉండవన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తేల్చిచెప్పారు. ‘అందరికీ ఇళ్లు’ అనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఇది తప్పనిసరి అన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు.

02/05/2017 - 03:22

తడ, ఫిబ్రవరి 4: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో వెలసిన శ్రీసిటీ పారిశ్రామిక వాడను శనివారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రీటా టియోటియా సందర్శించారు. శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి, సెజ్ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ కమిషనర్ శర్మలతో కలసి ఆమె సెజ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతిని వీక్షించారు.

02/05/2017 - 03:19

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ‘మా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు పెట్టండి..’ అని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. బాల మల్లు నేతృత్వంలో శనివారం తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఐఎఫ్) ప్రతినిధుల బృందం హర్యానా, రాజస్థాన్‌లో పర్యటించింది.

02/05/2017 - 03:17

దొనకొండ, ఫిబ్రవరి 4: ఈ ఏడాది జూలై నాటికి యుద్ధ విమానాల విడిభాగాల పరిశ్రమ పనులను ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ప్రారంభిస్తామని టైటాన్ ఏవియేషన్ ఏరోసిస్ సంస్థ చైర్మన్ గిరికుమార్ తెలిపారు. శనివారం మండలంలోని మల్లంపేట, కొచ్చర్లకోట, సిద్ధాయపాలెం, మంగినపుడి పరిధిలోని 5 వేల ఎకరాలకు చెందిన భూముల హద్దులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే మొదటిదశ పనులు జూలైలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

02/05/2017 - 03:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ముగియడానికి రెండు నెలల సమయం కూడా లేనప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 45,000 కోట్ల రూపాయల నిధులను అందుకోగలమన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 30,000 కోట్ల రూపాయలుగానే ఉంది.

02/05/2017 - 03:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. తమ యుటిలిటి వాహనం బొలెరో మ్యాక్సీ ట్రక్ ప్లస్ మోడల్‌ను రీకాల్ చేసింది. ఫ్లూయిడ్ హోస్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో భాగంగానే ఈ రీకాల్ అని, ముందస్తు తనిఖీలను చేపట్టాలని నిర్ణయించుకున్నందునే ఈ మోడల్‌కు చెందిన అన్ని వాహనాలను వెనక్కి పిలుస్తున్నామని మహీంద్ర అండ్ మహీంద్ర ఓ ప్రకటనలో శనివారం తెలిపింది.

02/04/2017 - 01:02

న్యూఢిల్లీ/బెంగళూరు, ఫిబ్రవరి 3: భారతీయ ఐటి రంగాన్ని హెచ్-1బి వీసాలు కుదిపేస్తున్న నేపథ్యంలో అసలు వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, దాని మాజీ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అన్నారు. భారతీయ ఐటి సంస్థల ఆదాయంలో విదేశాల నుంచి వచ్చేదే ఎక్కువ. అందులో అమెరికాది అగ్రభాగం. ప్రపంచ ఐటి రంగాన్ని శాసిస్తున్న భారతీయ ఐటి సంస్థల చేతిలోనే అగ్రరాజ్య ఐటి ప్రాజెక్టులూ ఉన్నాయి.

02/04/2017 - 01:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: మైక్రోసాఫ్ట్ భారత సంతతి సారథి సత్య నాదెళ్ల.. ఈ నెల 21-22 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. ముంబయిలో జరిగే ‘్ఫ్యచర్ డీకోడెడ్’పై సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ పర్యటనలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు టాటా మోటార్స్ సిఇఒ, హావె ల్స్ చైర్మన్‌లతోనూ నాదెళ్ల సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

02/04/2017 - 01:00

ముంబయి, ఫిబ్రవరి 3: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా, నగదు లావాదేవీలపై దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్.. చార్జీలను పెంచింది. నగదు లావాదేవీల్లో సేవింగ్స్ ఖాతాదారుల ప్రమేయం ఎక్కువగా ఉండటంతో వారి ఖాతాల ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే థర్డ్-పార్టీ లావాదేవీల పరిమితిని రోజుకు 25,000 రూపాయలు చేసింది.

02/04/2017 - 00:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: రుణ ఎగవేతదారులు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో లిక్కర్ వ్యాపారి, రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా తనను తాను ఓ ఫుట్‌బాల్‌గా అభివర్ణించుకున్నారు.

Pages