S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/03/2017 - 00:55

హైదరాబాద్, ఫిబ్రవరి 2: వజ్రాల వినియోగదారులకు నాణ్యమైన వజ్రాలను అందించేందుకు జిఐఏ మిలీ అనాలసిస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జిఐఏ ఇండియా ప్రకటించింది. 0.90 నుండి 4.0 ఎంఎం వ్యాసార్ధం కలిగిన వజ్రాలను వేగంగా, కచ్చితంగా విశే్లషించడంతోపాటు వాటిని వేరు చేస్తుంది. సింథటిక్ లేదా ట్రీటెడ్ వజ్రాలను కలపడంపై ఉండే ఆందోళనను ఇది తగ్గిస్తుంది.

02/03/2017 - 00:54

హీరో ఎలక్ట్రిక్ సంస్థ సరికొత్త ఈ- స్కూటర్‌ను పరిచయం చేసింది. ఫ్లాష్ పేరిట వచ్చిన దీని ధర 19,990 రూఫాయలు

02/03/2017 - 00:53

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యు తమ నూతన హైబ్రీడ్ స్పోర్ట్స్ కార్ ఐ8ను ప్రదర్శించింది. భారతీయ వాహన ప్రియులను తమ కారు ఆకర్షించగలదన్న విశ్వాసాన్ని బిఎమ్‌డబ్ల్యు ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. దేశీయ ఆటో మార్కెట్‌లోనూ సంచలనాలు సృష్టించగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చింది

02/03/2017 - 00:51

ప్రదర్శనలో వీడియో గేమ్స్.. ఆహుతులను ఎంతగానో అలరించాయ. సామ్‌సంగ్ ఈ సందర్భంగా ‘కర్వ్‌డ్’ గేమింగ్ మానిటర్‌ను ఆవిష్కరించింది. 24 అంగుళాల డిస్‌ప్లే కలిగిన మానిటర్ ధర 35,000 రూపాయలు, 27 అంగుళాల డిస్‌ప్లే కలిగినది 42,000 రూపాయలకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది

02/03/2017 - 00:49

బిఎన్ కాలేజ్ విద్యార్థులు రూపొందించిన సోలార్ ఆధారిత వాహనం.. ప్రదర్శనకు హాజరైనవారిని విశేషంగా ఆకట్టుకుంది. సర్వత్రా ప్రశంసలు పొందింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు

02/03/2017 - 00:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టారిఫ్ ప్లాన్లు సహేతుకమేనని, నిబంధనలకు లోబడే ఉన్నాయని టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ స్పష్టం చేసింది. ప్రస్తుత టారీఫ్ ఆర్డర్లకు అనుగుణంగానే జియో ఆఫర్లు కొనసాగుతున్నాయని చెప్పింది. జియో ఉచిత 4జి ఆఫర్లపై భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్‌లు టెలికామ్ ట్రిబ్యునల్ టిడిశాట్‌ను ఆశ్రయించినది తెలిసిందే.

02/03/2017 - 00:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: జనరల్ యాంటి-అవాయిడెన్స్ రూల్స్ (గార్), ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్‌మెంట్ (పోయెమ్) ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) ఆరంభం నుంచి గార్, పోయెమ్ అమలవుతాయని గురువారం ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ సంస్థలు భారత్‌లో పన్నులు కట్టేలా పోయెమ్ ఉంటుంది.

02/02/2017 - 09:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: నిజాయితీగా పన్ను చెల్లించేవారికి మరింత వెసులుబాటును కల్పించామని వారి చేతిలో మరింత నగదు ఉండేలా కొత్త బడ్జెట్‌ను రూపొందించానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అలాగే తొలిసారి పన్ను చెల్లించేవారికి మరింతగా ప్రోత్సహకాలు అందించినట్టు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరినీ కూడా పన్నుల పరిధిలోకి తెచ్చేలా అనుకూలమైన రీతిలోనే ఈ ప్రతిపాదనలను రూపొందించినట్టు ఆయన తెలిపారు.

02/02/2017 - 09:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా కేంద్ర బడ్జెట్‌లో ధూమపాన ప్రియులు, పొగాకు వినియోగదారులపైన మరింత భారం వేశారు. సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్నులను గణనీయంగా పెంచారు. తయారీలోని పొగాకుపైన సుంకాన్ని ఇప్పుడున్న 4.2 శాతం నుంచి 8.3 శాతానికి పెంచారు.

02/02/2017 - 09:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రభుత్వ యత్నంలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రంగానికి రుణ లక్ష్యాన్ని ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు.

Pages