S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/06/2017 - 00:33

ముంబయి, జనవరి 5: అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరిలో జరిపే ద్రవ్య పరపతి విధానం సమీక్షలో రెపో రేట్‌ను తగ్గించకపోవచ్చని, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉంచడం కోసం కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా దాని వైఖరి అలాగే కొనసాగవచ్చని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) తన తాజా నివేదికలో అభిప్రాయ పడింది.

01/06/2017 - 00:32

హైదరాబాద్, జనవరి 5: దేశ ఆర్ధిక వ్యవస్ధలో రానున్న రోజుల్లో పెనుమార్పులు రాబోతున్నాయని, ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్ చెల్లింపుల విప్లవరం వస్తుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. నల్లధనం విధ్వంసానికి కేంద్రం అమలు చేసిన వినూత్న విచ్చిన్న విధానం పెద్ద నోట్ల రద్దు అని ఆయన అభివర్ణించారు.

01/06/2017 - 00:30

న్యూఢిల్లీ, జనవరి 5: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి) వివిధ కాల పరిమితులతో కూడిన రుణాలపై ప్రామాణిక వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది.

01/06/2017 - 00:29

న్యూఢిల్లీ, జనవరి 5: స్థిరమైన ప్రాతిపదికపై దేశ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మరింత పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు.

01/06/2017 - 00:28

న్యూఢిల్లీ, జనవరి 5: స్థూల ఆర్థిక పునాదులు మరింతగా మెరుగుపడ్డం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మెరుగుపడకపోయినప్పటికీ భారత్ పరిస్థితి మాత్రం మెరుగ్గానే ఉంటుందని నల్లధనం, పన్నుల ఎగవేతలాంటి వాటిని అంతమొందించడానికి తీసుకున్న చర్యలు స్థూల జాతీయ ఉత్పత్తి(జిడిపి)పై సానుకూల ప్రభావం చూపించే అవకాశముందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ఆర్థిక సుస్థిరత, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డిసి) అభిప్రా

01/06/2017 - 00:26

న్యూఢిల్లీ, జనవరి 5: నోట్ల రద్దు తర్వాత ఉత్పాదక, సేవా రంగాల్లో వృద్ధి గణనీయంగా తగ్గిపోయిన కారణంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధి ఇంతకు ముందు అంచనా వేసిన దానికన్నా చాలా తక్కువగా 5 శాతమే ఉండవచ్చని హెచ్‌ఎస్‌బిసి ఒక నివేదికలో అభిప్రాయ పడింది.

01/06/2017 - 00:25

హైదరాబాద్, జనవరి 5: చిన్నతనం నుంచే డిజిటల్ అక్షరాస్యత మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను గుర్తించిన శ్యాంసంగ్ ఇండియా గురువారం తమ ఫ్లాగ్ షిప్ కార్యక్రమం శాంసంగ్ స్మార్ట్ క్లాస్‌ను జవహర్ నవోదయ విద్యాలయం గచ్చిబౌలిలో ప్రదర్శించింది. ప్రతి శాంసంగ్ స్మార్ట్ క్లాసులో ఇంటరాక్టివ్ శాంసంగ్ స్మార్ట్‌బోర్డు ల్యాప్‌టాప్స్, టాబ్లెట్, ప్రింటర్, వైఫై కనెక్టివిటీ, పవర్ బ్యాకప్ ఉంటాయి.

01/06/2017 - 00:24

హైదరాబాద్, జనవరి 5: బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు బయో ఆసియా సిఇవో శక్తి నాగప్పన్ తెలిపారు. ఈ సదస్సుకు 50 దేశాల నుంచి 800 మంది కార్పోరేట్ కంపెనీల నుంచి 1500 మంది ఫార్మసూటికల్ నిపుణులు పాల్గొంటారని చెప్పారు.

01/05/2017 - 07:49

న్యూఢిల్లీ, జనవరి 4: గృహ, కార్పొరేట్ రుణాలపై వడ్డీరేట్లు దిగివస్తున్నాయ. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయ. బుధవారం దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తమ వడ్డీరేట్లను 0.90 శాతం వరకు తగ్గించింది. మార్ట్‌గేజ్ సంస్థ డిహెచ్‌ఎఫ్‌ఎల్ సైతం వడ్డీరేట్లను 0.50 శాతం తగ్గించగా, ప్రభుత్వరంగ బ్యాంకైన కెనరా బ్యాంక్ కూడా 0.75 శాతం మేర దించింది.

01/05/2017 - 07:47

కూచిపూడి, జనవరి 4: మార్కెట్‌లో ధాన్యం, మినుముల ధరలు రోజురోజుకూ పుంజుకుం టున్నాయ. నిజానికి కొత్త ధాన్యం, అపరాలు సిద్ధమయిన తరుణంలో ధరలు తగ్గాల్సి ఉంది. అయతే క్రమేపి పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట కోతకు రాగా, కొంతమంది రైతులు నూర్పిడి కూడా చేస్తున్నారు. ఎంటియు 1,061 రకం ధాన్యం 76 కిలోలకు 1,132 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించింది.

Pages