S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/23/2016 - 00:55

ముంబయి, డిసెంబర్ 22: టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది అమెరికన్ టూరిస్టర్. వచ్చే ఏడాదికిగానూ తమ ఉత్పత్తుల ప్రచారాన్ని కోహ్లీ చేపడుతారని అమెరికన్ టూరిస్టర్ ఓ ప్రకటనలో గురువారం తెలిపింది. లగేజ్ బ్యాగులు, సూట్‌కేసుల తయారీలో అమెరికన్ టూరిస్టర్ ప్రముఖ సంస్థ అన్నది తెలిసిందే.

12/23/2016 - 00:54

విజయవాడ, డిసెంబర్ 22: గుంటూరుతోపాటు ఇతర జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల పంపిణీ అయిన నాసిరకం చంద్రన్న కానుకల స్థానంలో నాణ్యమైన సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రేషన్ షాపు డీలర్లను, అధికారులను ఆదేశించారు. ఒకటి, రెండుచోట్ల నాసిరకం సరకులు పంపిణీ చేయటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

12/23/2016 - 00:53

ముంబయి, డిసెంబర్ 22: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల నేపథ్యంలో బకాయల వసూళ్లకుగాను దాని ప్రమోటర్ విజయ్ మాల్యాకి చెందిన ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు చేస్తున్న చర్యలు విజయవంతం అయ్యేలా కనిపించడం లేదు. మరోసారి బ్యాంకులు చేసిన ప్రయత్నం విఫలమైంది మరి. గురువారం గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లా వేలానికి స్పందన కరువైంది.

12/23/2016 - 00:51

ముంబయి, డిసెంబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 262.78 పాయింట్లు పతనమై 25,979.60 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 82.20 పాయింట్లు క్షీణించి 8 వేల స్థాయికి దిగువన 7,979.10 వద్ద నిలిచింది.

12/23/2016 - 00:50

కాకినాడ, డిసెంబర్ 22: జిఎంఆర్ ఎనర్జీ సెక్టార్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరంలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌ను పూర్తిస్థాయి ఆటోమేటిక్ ప్లాంట్‌గా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు, కార్మికుల అవసరం లేకుండా కేవలం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి పనిచేసేలా టెర్మినల్‌ను నిర్మించనున్నారు.

12/23/2016 - 00:48

అమరావతి, డిసెంబర్ 22: పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుద్యోగ యువతకు, వీధి వ్యాపారులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. యువతీ యువకుల ఆసక్తిని బట్టి మెప్మా ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ఇలా శిక్షణ పొందినవారికి సొంతంగా వ్యాపారం చేసుకోడానికి రుణాలనూ అందజేస్తోంది.

12/22/2016 - 07:59

ముంబయి, డిసెంబర్ 21: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనా? చేతిలో డబ్బు లేకున్నా ఈజీగా బ్రతికేయొచ్చా? డిజిటల్ లావాదేవీలు నిజంగా పుంజుకుంటున్నాయా?.. అంటే కాదు, కుదరదు, లేదు అన్న సమాధానాలే చెప్పాల్సి వస్తోంది. అవును.. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎలక్ట్రానిక్ లావాదేవీలకు అలవాటు పడుతున్నారని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయిమరి.

12/22/2016 - 07:55

ముంబయి, డిసెంబర్ 21: ప్రయాణికులను ఆకర్షించడానికి దేశీయ విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా గోఎయిర్ సంస్థ పరిమిత కాలవ్యవధితో 999 రూపాయలకే టిక్కెట్‌ను పరిచయం చేసింది.

12/22/2016 - 07:54

ఆంధ్రభూమి ప్రతినిధి

12/22/2016 - 07:53

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 21: ఒడిశాలోని పారదీప్ నుండి హైదరాబాద్‌కు పెట్రోలియం ఉత్పత్తులు తరలించడానికి 2,000 కోట్ల రూపాయల వ్యయంతో 1,150 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ప్రభుత్వరంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి)కు చెందిన కేంద్ర ప్రభుత్వ అధీకృత అధికారి కె అనిల్ తెలిపారు.

Pages