S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/20/2016 - 00:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన కొత్త బడ్జెట్‌లో ఆదాయ వర్గాలకు మరింత ఊరట కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఆదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే రీతిలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపాదించవచ్చుననే కథనాలు వెలువడుతున్నాయి.

12/20/2016 - 00:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: మొబైల్ వినియోగదారులను తీవ్రంగా వేధిస్తున్న కాల్‌డ్రాప్స్ సమస్యపై ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాల్‌డ్రాప్స్‌పై టెలికామ్ వినియోగదారుల స్పందనను తెలుసుకునేందుకు త్వరలో ‘1955’ టోల్ ఫ్రీ నెంబర్‌ను పరిచయం చేయాలనుకుంటోంది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.

12/20/2016 - 00:46

పారిస్, డిసెంబర్ 19: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) చీఫ్ క్రిస్టిన్ లగార్డే నిర్లక్ష్యాన్ని ఓ ఫ్రెంచ్ కోర్టు ఎత్తిచూపింది. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. అయితే ఇందుకు శిక్షగా ఆమె జరిమానాగానీ, జైలుశిక్షగానీ ఎదుర్కోబోవడం లేదు. 2007-11 మధ్య ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిగా ఉన్న లగార్డే..

12/20/2016 - 00:46

బెంగళూరు/న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఉద్యోగ భవిష్య నిధి ఇపిఎఫ్‌ఒ.. ఇపిఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) 8.8 శాతం వడ్డీరేటును ఇచ్చిన ఇపిఎఫ్‌ఒ.. ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం దాన్ని 8.65 శాతానికే పరిమితం చేసింది.

12/20/2016 - 00:44

ముంబయి, డిసెంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 114.86 పాయింట్లు కోల్పోయి 26,374.70 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 35.10 పాయింట్లు పడిపోయి 8,104.35 వద్ద నిలిచింది. ఇక సూచీలు వరుసగా నాలుగు రోజులు నష్టాలకే పరిమితమవగా, సోమవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ రెండు వారాల కనిష్ట స్థాయికి దిగజారింది.

12/20/2016 - 00:43

ముంబయి, డిసెంబర్ 19: టాటా-మిస్ర్తిల వివాదం సరికొత్త మలుపు తీసుకుంది. తనను అన్యాయంగా తొలగించారంటూ టాటాలపై దాదాపు రెండు నెలల నుంచి ఎదురుదాడి చేస్తున్న సైరస్ మిస్ర్తి.. సోమవారం అనూహ్యంగా ఆరు ప్రధాన టాటా గ్రూప్ సంస్థల బోర్డుల నుంచి తప్పుకున్నారు. అయితే రతన్ టాటాపై తన పోరును మాత్రం ఆపబోనని మిస్ర్తి తేల్చిచెప్పారు.

12/20/2016 - 00:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ చైర్మన్ కెపి సింగ్ కుమార్తె రేణుక తల్వార్.. సెంట్రల్ ఢిల్లీలోని ఓ భవంతిని దాదాపు 450 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఎకరానికిపైగా విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవనం లూటిన్స్ ఢిల్లీలోగల పృథ్వీ రాజ్ రోడ్డు వద్ద ఉంది. నిర్మాణ రంగ సంస్థ టిడిఐ ఎండి కమల్ తనేజా దీన్ని అమ్మేశారు. ఈయన నుంచి తల్వార్ కొనుగోలు చేశారు.

12/20/2016 - 00:39

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో మూతబడిన పరిశ్రమలను (సిక్ యూనిట్లు) తిరిగి పునరుద్ధరించేందుకు చేయూతనిస్తామని, ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక విధానాన్ని (పాలసీ) ప్రకటిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు స్పష్టం చేశారు.

12/20/2016 - 00:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుత అవకాశమిచ్చింది. బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్లకు అంగీకరిస్తే 2 కోట్ల రూపాయల టర్నోవర్ వరకు పన్ను మినహాయింపునిస్తామని సోమవారం కేంద్రం స్పష్టం చేసింది.

12/20/2016 - 00:36

ముంబయి, డిసెంబర్ 19: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల నేపథ్యంలో బకాయల వసూళ్లకుగాను దాని ప్రమోటర్ విజయ్ మాల్యాకి చెందిన ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు చేస్తున్న చర్యలు విజయ వంతం అయ్యేలా కనిపిం చడం లేదు. మరోసారి బ్యాంకులు చేసిన ప్రయ త్నం విఫలమైంది మరి. ఇప్పటికే పలుమార్లు ముంబయిలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను వేలం వేసిన బ్యాంకులకు చుక్కెదురవగా, సోమవారం మళ్లీ నిర్వహించిన వేలంలోనూ భంగపాటుకు గురయ్యాయ బ్యాంకులు.

Pages