S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/18/2016 - 05:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రాబోయే రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పుంజుకుంటాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ఈ క్రమంలోనే పాయింట్ ఆఫ్ సేల్ (పిఒఎస్) మెషీన్లు అంతటా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

12/18/2016 - 05:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రద్దయిన నోట్ల స్థానంలో వస్తున్న కొత్త నోట్లు అంతే స్థాయిలో రాకపోవచ్చన్న సంకేతాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను మోదీ సర్కారు గత నెల 8వ తేదీ రాత్రి రద్దు చేసినది తెలిసిందే.

12/18/2016 - 05:22

బంగారం ధరలు శనివారం
10 నెలల కనిష్ట స్థాయ నుంచి కోలుకున్నాయ. 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి వెల 180 రూపాయలు పెరిగి 27,930 రూపాయలకు చేరుకుంది. వెండి కిలో ధర కూడా 50 రూపాయలు అందిపుచ్చుకుని 39,650 రూపాయలను తాకింది. మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు పెరిగాయ. ఔన్సు పుత్తడి ధర 0.57 శాతం ఎగిసి 1,134.60 డాలర్లకు వెళ్లింది. వెండి ధర 0.75 శాతం పుంజుకుని 16.07 డాలర్లు పలికింది.

12/17/2016 - 03:02

ముంబయి, డిసెంబర్ 16: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వచ్చే ఏడాది మరింతగా వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలకు తోడు నోట్ల రద్దులాంటి పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో ఈ నష్టాలు శుక్రవారం చాలావరకు తగ్గాయి.

12/17/2016 - 03:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8వ తేదీన ప్రభుత్వం ప్రకటన చేయడానికి ముందుగానీ, ఆ తర్వాత గానీ దేశంలో ఉన్న నల్లధనం ఎంతన్న దానిపై అధికారికంగా ఎటువంటి అంచనా వేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖతపూర్వక సమాధంనంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

12/17/2016 - 02:58

అమరావతి, డిసెంబర్ 16: దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఇ-కామర్స్ విపణిలోకి ఆంధ్రప్రదేశ్‌లోని హస్తకళలు, చేనేత కళాకారులు రూపొందించిన వస్తువులను విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్ సెర్ప్ ప్రారంభించిన డిజిటల్ మార్కెటింగ్ విధానంలో ఇదో ముందడుగు. ఈ ఏడాది మేలో అర్బన్ విలేజ్ బ్రాండ్ నేమ్‌తో ప్రారంభించిన డిజిటల్ మార్కెటింగ్ కళాకారులకు కొత్త మార్కెట్ అందిస్తోంది.

12/17/2016 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు కొరత వలన ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త 2000, 500 రూపాయలను అందుబాటులోకి తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం, వీటితో పాటు మున్ముందు ఇతర డినామినేషన్ల కరెన్సీ నోట్లను కూడా కొత్త డిజైన్‌తో ప్రవేశపెట్టనున్నట్లు శుక్రవారం పార్లమెంట్‌లో వెల్లడించింది.

12/17/2016 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నోట్ల రద్దు భారత్‌లో భారీ మార్పును తీసుకు రానుందని, ఈ చర్య ఫలితంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్నాయని ఓ నివేదిక అంచనా వేసింది. 2025 నాటికల్లా నగదు రహిత రిటైల్ పేమెంట్లు ఏకంగా పది రెట్లు పెరిగే అవకాశముందని కూడా అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం డచ్ బ్యాంక్ అంచనా వేసింది.

12/17/2016 - 02:55

ముంబయి, డిసెంబర్ 16: మన దేశంతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో కొరియా వాణిజ్య, పెట్టుబడుల అభివృద్ధి సంస్థ (కొట్రా) భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (్ఫక్కీ)తో కలసి ఈ నెల 19, 20 తేదీల్లో ఇక్కడ కొరియన్ ఎక్స్‌పో-2016ను నిర్వహించనుంది.

12/17/2016 - 02:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) ఈ ఏడాది నవంబర్ వరకు ఇటిఎఫ్ (ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లో 10,484 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. సెనె్సక్స్, నిఫ్టీల్లోని టాప్-50 సూచీలను ఆధారంగా చేసుకుని ఇపిఎఫ్‌ఓ ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇటిఎఫ్‌లలో పెట్టుబడులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Pages