S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/12/2016 - 08:41

ముంబయి/న్యూఢిల్లీ, నవంబర్ 11: పాత పెద్ద నోట్ల నిషేధం నేపథ్యంలో గడచిన నాలుగు రోజుల బంగారం నిల్వల వివరాలను తెలియజేయాల్సిందిగా మార్కెట్‌లోని ప్రముఖ నగల వర్తక సంస్థలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటిలిజెన్స్ (డిజిసిఇఐ) కోరింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 రూపాయల నోట్లను నిషేధిస్తూ మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది తెలిసిందే.

11/12/2016 - 08:40

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 80 శాతం పడిపోయింది. మొండి బకాయిల దెబ్బతో 51.42 కోట్ల రూపాయలకే బ్యాంక్ లాభం పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 251.26 కోట్ల రూపాయలుగా ఉంది.

11/12/2016 - 08:40

ముంబయి, నవంబర్ 11: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం భారీగా పతనమైంది. మూడు నెలల కనిష్టాన్ని తాకుతూ 62 పైసలు క్షీణించి 67 రూపాయల స్థాయికి దిగువన 67.25 వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున రూపాయి విలువ పడిపోవడం ఇది రెండోసారి. జూలై 26 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. నాడు 67.27 వద్ద ముగిసింది.

11/11/2016 - 06:56

న్యూఢిల్లీ, నవంబర్ 10: ‘సామాన్యులకు భయం అక్కర్లేదు. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవు.’ అని అధిక విలువ కలిగిన నోట్ల నిషేధం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్ల చలామణీని మంగళవారం అర్ధరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం నిషేధించినది తెలిసిందే.

11/11/2016 - 06:54

హైదరాబాద్, నవంబర్ 10: కాల్ హెల్త్ సర్వీసెస్ సంస్థ.. వైద్య రంగంలో నిపుణులు, సహాయకులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా కాల్ హెల్త్ అకాడమీ ఫర్ మెడికల్ పయనీర్స్ అండ్ ఇన్నోవేషన్‌ను ఏర్పాటు చేసింది. రోగి ఇంటి వద్దకే సకల సౌకర్యాలను తీసుకువచ్చి మధ్యవర్తిగా వ్యవహరిస్తూనే సేవకు సిద్ధంగా ఉండే విభాగాన్ని ఏర్పాటు చేశామని సంస్థ తెలియజేసింది.

11/11/2016 - 06:53

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఔషధరంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రెండింతలకుపైగా ఎగిసింది. 2,235.14 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 1,028.82 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సన్ ఫార్మా గురువారం తెలిపింది.

11/11/2016 - 06:53

ముంబయి, నవంబర్ 10: ఆలయాలకు విరాళాలు, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి)పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం 500, 1,000 రూపాయల నోట్ల చలామణీపై మోదీ సర్కారు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించినది తెలిసిందే.

11/11/2016 - 06:52

ముంబయి, నవంబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక, 500, 1,000 రూపాయల నోట్ల నిషేధం నేపథ్యంలో బుధవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు.. గురువారం కోలుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. పెద్ద మొత్తంలో జరుగుతున్న పాత నోట్ల డిపాజిట్లతో మదుపరులు బ్యాంకింగ్ షేర్లలో పెట్టుబడులకు ముందుకొచ్చారు.

11/11/2016 - 06:51

న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్ర్తిని తొలగించింది టాటా సన్స్. ఆ స్థానంలో ఇషాత్ హుస్సేన్‌ను నియమించింది. మార్కెట్ విలువ ఆధారంగా టాటా గ్రూప్‌లో అత్యంత భారీ సంస్థ టిసిఎస్ అన్నది తెలిసిందే.

11/10/2016 - 06:00

ఒకానొక దశలో గరిష్ఠ స్థాయిలో సెనె్సక్స్ 1,689 పాయింట్లు, నిఫ్టీ 541 పాయింట్లు పడిపోయాయ. అయతే చివరికల్లా రికార్డు స్థాయలో సెనె్సక్స్ 1,350, నిఫ్టీ 430 పాయంట్లు కోలుకున్నాయ. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా 28 పైసలు క్షీణించింది

Pages