S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/10/2016 - 05:59

న్యూఢిల్లీ, నవంబర్ 9: నల్ల ధనం ప్రాథమిక హక్కు కాదని, 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేయటం వలన సగటు మనిషి ఇబ్బందులకు గురి అవుతున్నాడంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా కొనసాగుతున్న నల్లధనాన్ని అదుపు చేసేందుకు పెద్ద నోట్ల రద్దు జరిగిందని స్పష్టం చేశారు.

11/10/2016 - 05:56

న్యూఢిల్లీ, నవంబర్ 9: కేంద్ర ప్రభుత్వం 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని నిషేధించిన నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. తమవద్ద భారీగా ఉన్న 500, 1,000 రూపాయల నోట్లను వదిలించుకోవడానికి సులభ మార్గం బంగారం కొనుగోళ్లేనని భావించిన అక్రమార్కులు పెద్ద ఎత్తున పుత్తడి కొనుగోళ్లకు దిగారు. దీంతో పసిడి మార్కెట్‌లో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్..

11/10/2016 - 05:55

‘నల్లధనం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల సంఘం తరఫున స్వాగతిస్తున్నాం.’
- సిఐఐ అధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్
‘ఈ నిర్ణయంతో కొద్దిరోజులు ఇబ్బందులుంటాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాల ప్రయోజనాలు కలుగుతాయి.’
- ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా

11/10/2016 - 05:54

హైదరాబాద్, నవంబర్ 9: కేంద్ర ప్రభుత్వం 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. బుధవారం ఒక్కరోజే హైదరాబాద్‌తోసహా రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. దక్షిణ భారతంలో హైదరాబాద్‌కు మంచి వ్యాపార కేంద్రంగా పేరుంది.

11/10/2016 - 05:53

ముంబయి, నవంబర్ 9: కేంద్ర ప్రభుత్వం 500, 1,000 రూపాయల నోట్ల చలామణీపై నిషేధం విధించిన నేపథ్యంలో ఎటిఎమ్‌ల వద్ద పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రధాన బ్యాంకులు తమ పని వేళలు పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకున్నాయి.

11/10/2016 - 05:51

న్యూఢిల్లీ, నవంబర్ 9: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రత్యక్ష పన్ను వసూళ్లు గడచిన ఏడు నెలల్లో 10.6 శాతం పెరిగాయి. ఏప్రిల్-అక్టోబర్ వ్యవధిలో 3.77 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) బుధవారం తెలియజేసింది.

11/10/2016 - 05:51

ఆదిలాబాద్, నవంబర్ 9: దేశంలో నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 500, 1,000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో అలజడి సృష్టించింది. నోట్ల రద్దుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నప్పటికీ.. బుధవారం సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

11/09/2016 - 08:28

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రస్తుతం ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దయిన నేపథ్యంలో వాటి స్థానంలో సరికొత్త రీతిలో అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో కొత్త 2000 రూపాయల, 500 రూపాయల నోట్లను రిజర్వు బ్యాంకు విడుదల చేయబోతోంది. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మంగళవారం ఈ కొత్త నోట్ల నమూనాను మీడియాకు విడుదల చేశారు.

11/09/2016 - 08:25

న్యూఢిల్లీ, నవంబర్ 8: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం.. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు ఊతమివ్వనుంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం 500, 1,000 రూపాయల నోట్లపై మోదీ సర్కారు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది.

11/09/2016 - 08:24

ముంబయి, నవంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మదుపరులు పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతకుముందు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. హిల్లరీ కంటే ముందంజలో కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు గురైనది తెలిసిందే.

Pages