S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/09/2016 - 08:23

న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి అవసరమైన చర్యలను తీసుకోవడంలో వెనుకాడబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా సంస్కరణలను ప్రవేశపెడతామని, వౌలిక రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం ఇక్కడ భారత్-యుకె టెక్ సదస్సులో జైట్లీ మాట్లాడారు.

11/09/2016 - 08:22

హైదరాబాద్, నవంబర్ 8: కేంద్రం ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయడంపై సిఐఐ తెలంగాణ ఆహ్వానించింది. కాగా మరో ఆర్ధిక నిపుణుడు హరగోవింద్ ప్రసాద్ మాత్రం ఐదు కోట్ల మంది ఆదాయం పన్ను శాఖ చెల్లించేవారిని టార్గెట్ చేసేందుకు 120 కోట్ల మందికి తీవ్ర ఇక్లట్లు కలిగిస్తున్నారని, ఇది ఒక రకంగా చెప్పాపెంటకుండా వేసిన హీరోషీమా, నాగసాకి బాంబు లాంటిదని అన్నారు.

11/09/2016 - 08:21

హైదరాబాద్, నవంబర్ 8: ‘వంద నోట్లు కాకుండా, వెయ్యి, ఐదు వందల నోట్లు ఉంటే ఇవ్వండి సార్’.. నిన్నమొన్నటి వరకు బ్యాంకుల్లో, క్యాష్ కౌంటర్లలో వినిపించే ఈ మాటలు ఇక నుంచి మనకు వినిపించవు. లక్ష అయినా ఎన్ని లక్షలైనా వంద, యాబై నోట్ల కట్టలు ఉంటే ఇవ్వండి అని ఇక నుంచి వినిపించనున్నాయి మరి. దేశంలో రూ. 500, రూ.

11/09/2016 - 08:20

హైదరాబాద్, నవంబర్ 8: రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రభావం మంగళవారం రాత్రి పెట్రోల్ బంకులలో కనిపించింది. ఈ సమాచారం పెట్రోల్ బంకుల వరకు చేరనంత వరకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సమాచారం పెట్రోల్ బంకులకు చేరాక అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి.

11/09/2016 - 08:20

హైదరాబాద్, నవంబర్ 8:‘బ్లాక్‌మనీపై మోడీ సర్జికల్ స్ట్రైక్’ ఐదువందల రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించగానే ఫేస్‌బుక్‌లో నెట్‌జనుల కామెంట్ ఇది. నెట్ జనులు నోట్ల రద్దుపై వినూత్న రీతిలో స్పందించారు. అయితే అంతా పాజిటివ్‌గానే స్పందించడం విశేషం. మోడీ ఈ నిర్ణయంతో భారతీయ యువత మనసు దోచుకున్నారని పలువురు పేర్కొన్నారు.

11/09/2016 - 08:19

హైదరాబాద్, నవంబర్ 8: ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను మంగళవారం రాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్టమ్రంతా ఎటిఎంల వద్ద జనం క్యూ కట్టారు. చాలా ఎటిఎంల వద్ద సర్వీసు లేదని బోర్డులు పెట్టారు. దీంతో జనం నిరాశకు గురయ్యే తిరిగి వెళ్లారు.

11/09/2016 - 08:18

హైదరాబాద్, నవంబర్ 8: దేశంలో మంగళవారం అర్ధరాత్రి నుండి 500, వెయ్యి కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో నోట్ల మార్పిడికి ఆర్‌బిఐ మార్గదర్శకాలు జారీ చేసింది. మధ్యకాలిక, దీర్ఘకాలిక దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వెల్లడించారు.

11/08/2016 - 00:22

న్యూఢిల్లీ, నవంబర్ 7: తీవ్ర సంఘర్షణ మధ్య యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బయటకు వచ్చిన బ్రిటన్.. ఇప్పుడు ఆర్థిక సుస్థిరత కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వ్యాపార, వాణిజ్యపరంగా తమ మిత్ర దేశాలతో సంబంధాలను బలపరుచుకోవాలని చూస్తున్న బ్రిటన్.. భారత్‌తో తమ మైత్రిని మరింత పదిలం చేసుకోవాలని ఆశిస్తోంది. ఇందులో భాగంగానే బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే రెండు రోజుల భారత పర్యటన జరుగుతోంది.

11/08/2016 - 00:16

ముంబయి, నవంబర్ 7: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడి)గా ఎమ్ రాజేశ్వర్‌రావు నియమితులయ్యారు. జి మహాలింగం స్వచ్చంధ పదవీ విరమణతో ఖాళీ అయిన స్థానాన్ని రాజేశ్వర్‌రావుతో భర్తీ చేసింది ఆర్‌బిఐ. దీనికి ముందు ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా రాజేశ్వర్‌రావు పనిచేశారు. ఎకనామిక్స్‌లో బిఎ చేసిన రాజేశ్వర్‌రావు..

11/08/2016 - 00:15

న్యూఢిల్లీ, నవంబర్ 7: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు గత నెల అక్టోబర్‌లో 11 శాతం పెరిగి 46,325 యూనిట్లుగా నమోదయ్యాయి. లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఇవాక్యు, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, జాగ్వార్ ఎఫ్-పేస్ మోడళ్ల అమ్మకాలు బాగున్నాయి. చైనా, యూరప్‌లలోనూ అమ్మకాలు వృద్ధి చెందినట్లు ఓ ప్రకటనలో సోమవారం సంస్థ తెలియజేసింది.

Pages