S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/02/2016 - 07:48

విశాఖపట్నం, నవంబర్ 1: అనేక రకాలైన పథకాలతో ఒకవైపు వినియోగదారులను ఆకర్షిస్తూనే మరోపక్క గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న గిరిజన సహకార సంస్థ (జిసిసి) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈసారి కుంకుమ తయారీకి ప్రాధాన్యతనివ్వనుంది. దీనిని తయారు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది.

11/02/2016 - 07:48

న్యూఢిల్లీ, నవంబర్ 1: సబ్సిడీ వంట గ్యాస్ (ఎల్‌పిజి) ధరలు స్వల్పంగా పెరిగాయి. 14.2 కిలోల సిలిండర్ ధరను 2.05 రూపాయల చొప్పున మంగళవారం చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. గడచిన ఐదు నెలల్లో ఈ పెంపు ఆరోసారి అవగా, తాజా పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ ధర 430.64 రూపాయలకు చేరింది. ఇంతకుముందు ఇది 428.59 రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే విమానయాన ఇంధనం (ఎటిఎఫ్) ధర కూడా పెరిగింది.

11/02/2016 - 07:47

కొత్తగూడెం, నవంబర్ 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో సింగరేణి ఎదురీదుతోంది. అక్టోబర్‌తో ముగిసిన గడచిన ఏడు మాసాల్లో 3 కోట్ల 46 లక్షల 37,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగాను 3 కోట్ల 8 లక్షల 83,694 టన్నులు సాధించి 89 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది.

11/02/2016 - 07:47

హైదరాబాద్, నవంబర్ 1: పౌరులకు సేవలందించడంలో పారదర్శకత, జవాబుదారీతనం తేవడంలో భాగంగా కేంద్రం ఈ-ఆఫీసుల ఏర్పాటుకు పెద్దపీట వేస్తోందని, 2018 మార్చి నాటికి అన్ని ప్రభుత్వ శాఖల్లో, విభాగాల్లో కాగితం ప్రమేయం లేకుండా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పాలన సంస్కరణలు-ప్రజా సమస్యల విభాగం (డిఓఏఆర్‌పిజి) కార్యదర్శి సి విశ్వనాథ్ తెలిపారు.

11/01/2016 - 08:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న క్రమంలో మార్కెట్లను అగ్రరాజ్య ఎన్నికలూ ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు.

11/01/2016 - 07:57

కొత్తగూడెం, అక్టోబర్ 31: సింగరేణిలోని భూగర్భ గనులు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మొత్తం 11 ఏరియాల్లోని భూగర్భ గనుల్లో భూపాలపల్లి పరిధిలో ఉన్న కెటికె-2 గని మినహా మిగిలిన వాటిలో కనీసం కార్మికుల వేతనాలు కూడా సమకూరడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే గనుల్లో యంత్రాల పని గంటలు పెంచాలనే నిర్ణయానికి యాజమాన్యం వచ్చింది.

11/01/2016 - 07:57

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్రం దేశంలో పరిశ్రమలకు లీడర్‌గా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఒకేసారి పదమూడో స్థానం నుంచి మొదటి స్థానంలోకి వచ్చింది మరి. 90 నుంచి వంద పాయింట్లు వచ్చిన రాష్ట్రాలను లీడర్స్‌గా పేర్కొన్నారు. ఈ పాయింట్లలో రెండు తెలుగు రాష్ట్రాలు సమాన పాయింట్లను సాధించాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

11/01/2016 - 07:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో వౌలిక రంగం వృద్ధిరేటు 3 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 5 శాతాన్ని చేరింది. సిమెంట్, ఉక్కు, రిఫైనరీ ఉత్పత్తుల పనితీరు బాగుండటమే ఇందుకు కారణం. ఎనిమిది కీలక రంగాలైన బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాల్లో వృద్ధిరేటు నిరుడు సెప్టెంబర్‌లో 3.7 శాతంగా నమోదైంది.

11/01/2016 - 07:55

ముంబయి, అక్టోబర్ 31: ‘సంవత్ 2073’కి నష్టాలతో స్వాగతం పలికాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఆదివారం దీపావళి సందర్భంగా సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్య కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ గంటపాటు జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. అమెరికా రాజకీయ పరిణామాల నడుమ అమెరికా స్టాక్ మార్కెట్లతోపాటు ఆసియా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయ.

11/01/2016 - 07:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారతీయ మార్కెట్ల నుంచి అక్టోబర్ నెలలో విదేశీ మదుపరులు (ఎఫ్‌పిఐ) 10,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. సెప్టెంబర్‌లో పెట్టుబడులను తీసుకొచ్చిన మదుపరులు.. అక్టోబర్‌లో మాత్రం వెనక్కి తగ్గారు. ముఖ్యంగా రుణ మార్కెట్ల నుంచి భారీ స్థాయలో పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరించుకున్నారు.

Pages