S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/26/2016 - 08:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం, ప్రైవేట్‌రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 4.9 శాతం క్షీణించింది. 1,461 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 1,536 కోట్ల రూపాయలుగా ఉంది.

10/26/2016 - 08:32

ముంబయి, అక్టోబర్ 25: సైరస్ మిస్ర్తిని టాటా గ్రూప్ చైర్మన్‌గా తొలగిస్తూ టాటా సన్స్ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మిస్ర్తి న్యాయపోరాటానికి దిగుతుండటంపై టాటాలు స్పందించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టుతోపాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేవియట్లు దాఖలు చేశారు. సోమవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో మిస్ర్తికి టాటా సన్స్ ఉద్వాసన పలికినది తెలిసిందే.

10/26/2016 - 08:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిసెజ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 1,091 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌తో పోల్చితే ఇది 61 శాతం అధికమవగా, నాడు సంస్థ లాభం 678 కోట్ల రూపాయలు.

10/26/2016 - 08:31

హైదరాబాద్, అక్టోబర్ 25: దక్షిణాసియా ఔషధ రంగం అభివృద్ధి, పరిశోధనలపై వచ్చే నెల 17 నుంచి 23 వరకు ముంబయిలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని యుబిఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్, ఫార్మా ఎక్సిల్ అదనపు ఇడి రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు.

10/26/2016 - 08:30

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్ర్తిని ఆశ్చర్యకరంగా సోమవారం టాటా సన్స్ తొలగించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలకు లోనయ్యాయి. పలు టాటా సంస్థల షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు గురికావడమే ఇందుకు ప్రధాన కారణం.

10/26/2016 - 08:29

విజయవాడ, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్‌ను విమానయాన హబ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నందున సహకరించాలని మంగళవారంనాడిక్కడ ఎయిర్ లైన్స్ నిర్వాహక ప్రతినిధులతో జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎయిర్ కనెక్టివిటికి సంబంధించి కేంద్రం త్వరలో బిడ్డింగ్‌కు ఆహ్వానించనున్నందున ఎయిర్ లైన్స్ ఆపరేటర్లు పాల్గొని సహకరించాలని కోరారు.

10/25/2016 - 01:11

ముంబయి, అక్టోబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 101.90 పాయింట్లు పెరిగి మూడు వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ 28,179.08 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 15.90 పాయింట్లు అందుకుని 8,708.95 వద్ద నిలిచింది. ఐరోపా మార్కెట్ల నుంచి అందుకున్న సానుకూల సంకేతాల మధ్య మదుపరులు కొనుగోళ్లకు ప్రాధాన్యమిచ్చారు.

10/25/2016 - 01:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: రాబోయే ఏడేళ్లలో భారతీయ మీడియా సామర్థ్యం 3-4 రెట్లు పెరుగుతుందని పారిశ్రామిక సంఘం సిఐఐ అంచనా వేసింది. డిజిటల్ మీడియాతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న వినియోగదారుల కారణంగా భారతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ వృద్ధిపథంలో ముందుకెళ్లగలదని సోమవారం సిఐఐ అభిప్రాయపడింది.

10/25/2016 - 01:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: వేతన జీవుల్లో పన్ను చెల్లింపుదారులందరికీ తమ త్రైమాసిక టిడిఎస్ కోతలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ నుంచి ఇకపై ఎస్‌ఎమ్‌ఎస్‌లు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఇక్కడ ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్ సర్వీస్‌ను ప్రారంభించారు. సిబిడిటి కూడా వేతన జీవులుకాని పన్ను చెల్లింపుదారుల కోసం త్వరలో ఈ పథకాన్ని అమలుపరుస్తుందని ఆయన ఈ సందర్భంగా విలేఖరులకు చెప్పారు.

10/25/2016 - 01:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ.. మైక్రో-ఇన్సూరెన్స్ ఏజెంట్లకు పంటల బీమా పాలసీలను విక్రయించే అవకాశాన్ని కల్పించింది. దీంతో వారు ఇక ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, కొకనట్ పామ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తదితర పథకాలను మార్కెటింగ్ చేసుకోవచ్చు.

Pages