S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/25/2016 - 01:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తి ఉద్వాసనకు గురయ్యారు. భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగంలో బహుళ వ్యాపార దిగ్గజంగా పేరున్న టాటా సన్స్ ఉత్పత్తులు.. సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు, హెయిర్ పిన్ను నుంచి ఏరోప్లేన్ వరకు ఉన్నాయి. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా సన్స్‌కు నాలుగేళ్ల క్రితం 2012, డిసెంబర్ 29న రతన్ టాటా స్థానంలో మిస్ర్తి ఎన్నికై ఆశ్చర్యం కలిగించారు.

10/25/2016 - 01:05

మిస్ర్తి నాయకత్వ మార్పునకు ఎలాంటి కారణాలను ఇప్పటికిప్పుడు బోర్డు చెప్పలేదు. అయినప్పటికీ మిస్ర్తితో మాత్రం టాటా సన్స్ అసంతృప్తిగానే ఉందని చెప్పొచ్చు. లాభాలు లేని సంస్థల గురించి పట్టించుకోకపోవడం, లాభాలున్న సంస్థలపైనే దృష్టి సారించడం ఇందుకు కారణం. ముఖ్యంగా ఐరోపా ఉక్కు పరిశ్రమల్లో టాటా సన్స్‌కున్న చరిత్రే వేరు.

10/25/2016 - 01:03

బ్రిటన్‌కు చెందిన సూపర్‌కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ సోమవారం హైదరాబాద్‌లోని ఐటిసి కాకతీయలో సరికొత్త డిబి11 మోడల్ కారును మార్కెట్‌కు పరిచయం చేసింది.
దీని ధర 4.27 కోట్ల రూపాయలు

10/25/2016 - 01:02

సామ్‌సంగ్ సంస్థ సోమవారం హైదరాబాద్‌లో సరికొత్త ‘మై గెలాక్సీ’ యాప్‌ను ఆవిష్కరించింది.
గత వెర్షన్‌తో పోల్చితే కొత్త వెర్షన్ వినియోగదారులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందని
సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు .

10/25/2016 - 00:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: దేశీయ ప్రముఖ టెలికామ్ సంస్థల్లో ఒకటైన ఐడియా సెల్యులార్ లాభాలకు జియో, స్పెక్ట్రమ్ సెగ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో సంస్థ ఏకీకృత నికర లాభం 91.46 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 762.27 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం.

10/25/2016 - 00:57

పాల్వంచ, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న నాలుగేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధించి మిగులు రాష్ట్రంగా మారుస్తామని టిఎస్ జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్) సి రాధాకృష్ణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో నూతనంగా నిర్మిస్తున్న కెటిపిఎస్ 7వ దశ కర్మాగారాన్ని సోమవారం ఆయన సందర్శించారు.

10/25/2016 - 00:55

విజయవాడ, అక్టోబర్ 24: కర్నూలు జిల్లాలో సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు బ్రిటన్‌లోని భారతీయ కంపెనీ ‘సోలార్ జిస్ ఇండియా’ ముందుకొచ్చింది. అలాగే అనంతపురం జిల్లాలో సోలార్ పార్క్ నిర్మాణానికీ సంస్థ సంసిద్ధత తెలుపుతూ ప్రతిపాదనలు సమర్పించింది. కంపెనీ ప్రతినిధులు సోమవారం సాయంత్రం సిఎంవోలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

10/25/2016 - 00:54

కాకినాడ, అక్టోబర్ 24: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటంతో ఈ ఏడాదైనా డిపాజిట్ల సేకరణ యోచన విరమించుకోవాలని రైస్ మిల్లర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుడు మిల్లర్ల నుండి భారీ ఎత్తున డిపాజిట్లను వసూలు చేయడంతో చిన్న తరహా మిల్లర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

10/25/2016 - 00:54

తడ/సత్యవేడు, అక్టోబర్ 24: చైనాలోని మొబైల్ ఫోన్ ఇండస్ట్రీకి చెందిన 40 మంది ఉన్నత శ్రేణి ప్రతినిధుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో జరిగిన ఇండియా-చైనా మొబైల్ ఉత్పత్తిదారుల వస్తు ప్రదర్శనలో పాల్గొన్న ప్రతినిధుల బృందంలో కొందరు శ్రీసిటీకి విచ్చేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వీరికి సాదర స్వాగతం పలికారు.

10/24/2016 - 06:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రముఖ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Pages