S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/11/2016 - 00:41

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణలో కొత్తగా ఏర్పాటవుతున్న 21 జిలాల్లో దసరా రోజు నుండే విద్యా పాలన ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖలు సకల ఏర్పాట్లు చేశాయి. కొత్తగా కార్యాలయాలను గుర్తించడం, అవసరమైన వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు.

10/11/2016 - 00:40

లండన్, అక్టోబర్ 10: బ్రెంట్ ఆయిల్ ధర ఈ ఏడాదిలోనే గరిష్ఠ స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి అదుపునకు రష్యా చర్యలు తీసుకుంటుందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంకేతాలిచ్చిన నేపథ్యంలో బ్రెంట్ ఉత్తర సముద్ర చమురు బ్యారెల్ ధర సోమవారం 53.45 డాలర్లు పలికింది. క్రితం ముగింపుతో పోల్చితే ఇది 1.53 డాలర్లు అధికం. 2015 అక్టోబర్ నుంచి గమనిస్తే ఈ స్థాయి ధర నమోదు కావడం ఇదే ప్రథమం.

10/11/2016 - 00:39

ముంబయి, అక్టోబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతకుముందు వరుసగా మూడు రోజులపాటు నష్టాలకే పరిమితమైన సూచీలు.. మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటి రంగాల షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి.

10/10/2016 - 00:05

ముంబయి, అక్టోబర్ 9: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలనాత్మక టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో.. ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 4జి సేవలను ప్రారంభించిన తొలి నెల సెప్టెంబర్‌లో ఏకంగా జియో వినియోగదారులు 16 మిలియన్ల (కోటీ 60 లక్షలు)ను దాటిపోయారు మరి. ప్రపంచంలో ఇంతటి స్థాయిలో వృద్ధిరేటును మరే టెలికామ్ ఆపరేటర్ లేదా స్టార్టప్ అందుకోలేదని ఆదివారం రిలయన్స్ జియో ప్రకటించింది.

10/10/2016 - 00:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపు, అంతర్జాతీయ అనుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఈ నెల తొలి వారంలో భారీగా విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయ. 1,445 కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) తీసుకొచ్చారు. నిజానికి గతకొద్ది నెలలుగా భారతీయ మార్కెట్లలో పెట్టుబడులపట్ల విదేశీ మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నారు.

10/10/2016 - 00:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి తమ బాలెనో వాహనాన్ని 100కుపైగా దేశాల మార్కెట్లలోకి ఎగుమతి చేయాలని చూస్తోంది. కరీబియన్ దీవులతోపాటు దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య, ఆగ్నేయాసియా దేశాల్లో బాలెనోను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

10/10/2016 - 00:02

న్యూయార్క్, అక్టోబర్ 9: అమెరికాలోని సంపన్నుల జాబితాలో ఐదుగురు ప్రవాస భారతీయులున్నారు. 400 మందితో ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో వరుసగా 23వసారి మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అగ్రస్థానంలో ఉండగా, 60 ఏళ్ల గేట్స్ సంపద విలువ 81 బిలియన్ డాలర్లు.

10/10/2016 - 00:02

ముంబయి, అక్టోబర్ 9: రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులను పలుమార్లు బ్యాంకులు వేలం వేసినప్పటికీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నది తెలిసిందే. అయితే గోవాలోని సముద్ర తీరంలోగల కింగ్‌ఫిషర్ విల్లా కోసం ఆతిథ్య రంగం నుంచి అర డజను సంస్థలు, ఓ మీడియా గ్రూప్ ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమి ఈ ఏడాది మే నెలలో ఈ విల్లాను స్వాధీనం చేసుకున్నాయి.

10/09/2016 - 02:06

ముంబయి, అక్టోబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 195.18 పాయింట్లు పుంజుకుని 28,061.14 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 86.45 పాయింట్లు అందిపుచ్చుకుని 8,697.60 వద్ద నిలిచింది.

10/09/2016 - 02:04

న్యూయార్క్, అక్టోబర్ 8: పేటెంట్ ఉల్లంఘన కేసులో సామ్‌సంగ్‌పై యాపిల్ గెలిచింది. 120 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని యాపిల్‌కు చెల్లించాలని సామ్‌సంగ్‌ను కోర్టు ఆదేశించింది. స్లైడ్ టు అన్ లాక్, ఆటోకరెక్ట్ ఫీచర్లకు సంబంధించి ప్రపంచ స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజాలైన సామ్‌సంగ్, యాపిల్ మధ్య వివాదం తలెత్తింది.

Pages