S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/06/2016 - 23:59

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రాకను దేశీయ టెలికామ్ రంగంలో పెను సవాల్‌గా అభివర్ణించారు ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ సిఎండి అనుపమ్ శ్రీవాత్సవ. మంగళవారం ఆయన ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ జియో ప్రకటిస్తున్న టారీఫ్‌లు అన్ని ఇతర టెలికామ్ సంస్థలకు సవాల్ విసురుతున్నాయన్నారు. అయినప్పటికీ ఈ పోటీకి అనుగుణంగానే మార్కెట్‌లో టారీఫ్‌లు దిగిరావచ్చన్నారు.

09/06/2016 - 23:58

విజయవాడ, సెప్టెంబర్ 6: నవ్యాంధ్రలోని పారిశ్రామిక అవసరాలకు భూములను కేటాయిస్తూ బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను, మరో 10 గ్రామాల్లో 7,214.87 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం ఏపిఐఐసికి కనీస ధరకు కేటాయించాలని నిర్ణయంచారు.

09/06/2016 - 23:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఇఎస్‌ఐ ఆరోగ్య బీమా వర్తించే పరిధిని ప్రస్తుత 15 వేల రూపాయల నుంచి 21 వేల రూపాయలకు పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. దీని ద్వారా మరో 50 లక్షల మందిని ఇఎస్‌ఐ పరిధిలోకి తీసుకురావాలని సంకల్పించింది. ధరల పెరుగుదల, జీతాల పెంపు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

09/06/2016 - 23:57

గుంటూరు, సెప్టెంబర్ 6: ఇక్కడికి సమీపంలోని నంబూరులో గల వివిఐటి కళాశాలలో గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఫండమెంటల్స్‌పై ఐదు రోజుల పాటు జరిగే రాష్టస్థ్రాయి వర్క్‌షాప్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు.

09/05/2016 - 06:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ విపణిలో ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా సూచీలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

09/05/2016 - 06:50

హాంగ్‌ఝౌ, సెప్టెంబర్ 4: భారత సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న జి-20 దేశాల సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒబామాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సహా ఇతర సంస్కరణలను ఒబామా కొనియాడారు. విపత్కర అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లోనూ సాహాసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు.

09/05/2016 - 06:50

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రపంచంలో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశం మొత్తం సంపదలో మిలియనీర్లు లేదా ఒక మిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సొమ్ము కలిగినవారి చేతిలోనే 54 శాతం ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థను అదుపు చేయగల సామర్థ్యం సామన్యుల కంటే కూడా సంపన్నులకే ఎక్కువగా ఉందని స్పష్టమైంది.

09/05/2016 - 06:49

ముంబయి, సెప్టెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 24వ గవర్నర్‌గా 52 ఏళ్ల ఉర్జిత్ పటేల్ నియామకం ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. రఘురామ్ రాజన్ స్థానంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉర్జిత్ పటేల్‌ను ఎంపిక చేయగా, దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినది తెలిసిందే.

09/05/2016 - 06:48

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌ఇడి బల్బులు అమర్చినందు వల్ల ఇంతవరకు రూ. 911 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ఆదివా రం తెలిపారు. ఒక ఎల్‌ఇడి బల్బును అమర్చితే సాలీనా 73.7 యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేస్తామన్నారు.

09/05/2016 - 06:48

భీమవరం, సెప్టెంబర్ 4: రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్ వినియోగం మరోసారి దేశీయ ఎగుమతి రంగాన్ని కుదిపేస్తోంది. యాంటీ బయోటిక్స్ అవశేషాలున్న రొయ్యలను పలు దేశాలు తిరస్కరిస్తున్నాయి. కంటైనర్లకు కంటైనర్లు వెనక్కు తిరిగిరావడంతోపాటు, విదేశీ సంస్థల నుండి పెద్ద మొత్తంలో చెల్లింపులు సైతం నిలిచిపోతున్నాయి.

Pages