S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/06/2016 - 03:51

హైదరాబాద్, అక్టోబర్ 5: జర్మనీకి చెందిన వినియోగదారుల లైఫ్ స్టైల్ వస్తువుల టెక్నాలజీ బ్రాండ్ బ్లాపుంక్ట్.. బుధవారం భారత్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా బ్లాపుంక్ట్ మొబైల్ ఫోన్ యాక్ససరీస్‌ను భారత్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

10/06/2016 - 03:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (ఎటిఎల్) సంస్థకు తమ పవర్ ట్రాన్స్‌మిషన్ ఆస్తులను అమ్మేసింది రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్‌ఇన్‌ఫ్రా). 2,000 కోట్ల రూపాయలకుపైగా ధరకు ఈ ఆస్తులను అమ్మేయగా, ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరినట్లు బుధవారం తెలిపింది అనీల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌ఇన్‌ఫ్రా.

10/06/2016 - 03:49

విశాఖపట్నం, అక్టోబర్ 5: ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. డిజిటలైజేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మరోపక్క ఈ-ఫైలింగ్‌ను ముమ్మరంగా చేపట్టింది. ప్రతి శాఖలోనూ ఐటిని ప్రవేశపెట్టింది. ఆంధ్ర రాష్ట్రంలో ఐటి రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనుకుంటున్నారు.

10/06/2016 - 03:48

రాజమహేంద్రవరం, అక్టోబర్ 5: పొగాకు బోర్డు బ్యారన్ పరిమితిని పెంచింది. గత పంట కాలంలో ఒక బ్యారన్ రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి 19.50 క్వింటాళ్ల దిగుబడి పరిమితి విధించింది. అయతే ప్రస్తుత సీజన్‌లో ఈ పరిమితిని సడలించారు. బ్యారన్ దిగుబడి 3 ఎకరాలకు పెంచి దిగుబడి పరిమితి 26 క్వింటాళ్లకు పెంచారు. నిరుడు దిగుబడి తక్కువ, డిమాండ్ ఎక్కువ కావడంతో రైతులకు మంచి ధర లభించింది.

10/06/2016 - 03:47

విశాఖపట్నం, అక్టోబర్ 5: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం గిరిజన ప్రాంతంలో మరింతగా రబ్బరు సాగుకు రబ్బర్ బోర్డు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తే మరిన్ని ప్రాంతాల్లో రబ్బరు మొక్కల పెంపకంలో గిరిజనులను భాగస్వాములను చేసేందుకు సిద్ధంగా ఉంది. రబ్బర్ బోర్డు జాయింట్ రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్ సి. సాబు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.

10/05/2016 - 07:12

ముఖ్యాంశాలు
ౄ పావు శాతం తగ్గి 6.25 శాతానికి రెపోరేటు
ౄ 5.75 శాతానికి దిగిన రివర్స్ రెపో
ౄ 4 శాతం వద్ద నగదు నిల్వ నిష్పత్తి (సిఆర్‌ఆర్) యథాతథం
ౄ ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనా 7.6 శాతం
ౄ వర్షాలతో జిడిపి వృద్ధికి ఊతం
ౄ వచ్చే ఏడాది మార్చి నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం
ౄ సెప్టెంబర్ నాటికి 372 బిలియన్ డాలర్లతో

10/05/2016 - 07:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: హ్యుందాయ్ మోటార్ ఇండియా 7,657 ఇయాన్ కార్లను రీకాల్ చేసింది. క్లచ్, బ్యాటరీ కేబుల్స్‌కు సంబంధించిన సమస్యలను సరిచేయడానికే ఈ రీకాల్ అని సదరు సంస్థ స్పష్టం చేసింది. కాగా, 2015 జనవరిలో తయారైన ఇయాన్ మోడల్స్‌లోనే ఈ సమస్యలు తలెత్తాయి.

10/05/2016 - 07:08

లండన్, అక్టోబర్ 4: అమెరికా డాలర్‌తో పోల్చితే బ్రిటన్ పౌండ్ మంగళవారం 31 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగే సమయం ఆసన్నమవుతున్న క్రమంలో ఆ దేశ పౌండ్ విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. యూరోతో పోల్చితే కూడా పౌండ్ విలువ మరో మూడేళ్ల కనిష్టాన్ని తాకింది. ఈయు నుంచి వైదొలగడంపై గతంలో నిర్వహించిన రెఫరెండమ్ సమయంలోనూ పౌండ్ విలువ భారీగా పతనమైనది తెలిసిందే.

10/05/2016 - 07:07

ముంబయి, అక్టోబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. గత రెండు రోజుల లాభాలను కొనసాగిస్తూ మూడోరోజూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్ల తగ్గింపు మధ్య మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. బ్యాంకింగ్, రియల్టీ, ఆటో రంగాల షేర్లు ఆకట్టుకున్నాయి.

10/05/2016 - 07:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 10 పైసల చొప్పున పెరిగాయి. డీలర్లకు చెల్లించే కమీషన్ పెంచడంతో ఆ లోటును భర్తీ చేసుకునేందుకే చమురు సంస్థలు ఈ పెంపునకు దిగాయి. కాగా, పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.

Pages