S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/04/2016 - 00:18

విశాఖపట్నం, అక్టోబర్ 3: పర్యావరణాన్ని పరిరక్షించడం, డీజిల్ రైలింజన్ల సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించడం కోసం తక్కువ ఖర్చుతో కూడుకున్న బయో డీజిల్ వినియోగాన్ని పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా దీని పరిధిలోకి వచ్చే 16 రైల్వేజోన్లు, వీటికి సంబంధించిన డివిజన్లలో నడిచే డీజిల్ లోకోమోటీవ్‌ల్లో బయో డీజిల్ వినియోగాన్ని పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

10/04/2016 - 00:17

ముంబయి, అక్టోబర్ 3: మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తమ కార్యకలాపాల ద్వారా సాధించిన నికర లాభం తొలి ఏడాది 65.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం 364 కోట్ల రూపాయలుగా ఉందని ముద్ర చైర్మన్ క్షత్రపతి శివాజి సోమవారం తెలిపారు.

10/03/2016 - 08:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: విదేశీ మదుపరులు గత నెలలో దేశీయ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. గడచిన 11 నెలల్లో ఈ స్థాయలో పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం.

10/03/2016 - 08:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం జరిగే ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలతోపాటు భారత్-పాక్ యుద్ధ వాతావరణం మదుపరులపై ప్రభావం చూపవచ్చని విశే్లషిస్తున్నారు.

10/03/2016 - 08:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఈ పండగ సీజన్‌లో ఆన్‌లైన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అందిస్తున్న ఆఫర్లు కొనుగోలుదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు తమ ఐదు రోజుల డిస్కౌంట్ సేల్స్‌కు విశేష స్పందన లభిస్తోందని ఆదివారం ప్రకటించాయి.

10/03/2016 - 08:20

కొత్తగూడెం, అక్టోబర్ 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది. 89 శాతం ఉత్పదక రేటును మాత్రమే సాధించింది. సెప్టెంబర్ మాసం ముగిసేనాటికి గడచిన ఆరు మాసాలలో 2 కోట్ల 93 లక్షల 76 వేల 500 టన్నుల బొగ్గును సాధించాల్సి ఉండగా, 2 కోట్ల 61 లక్షల 82 వేల 302 టన్నులు మాత్రమే సాధించి 89 శాతం ఉత్పాదక రేటు నమోదు చేసుకుంది.

10/03/2016 - 08:20

గోదావరిఖని, అక్టోబర్ 2: దేశ రాజధాని ఢిల్లీతోపాటు హర్యానా రాష్ట్రానికి నిరంతరం విద్యుత్‌ను అందిస్తూ, అక్కడి ప్రజల అవసరాల తీరుస్తూ ఇందిరా గాంధీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్‌టిపిసి..

10/03/2016 - 08:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశీయ మార్కెట్లోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన చర్యలు చేపడతామని, పన్ను వసూళ్లకు సంబంధించి విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తావించిన కొన్ని సమస్యలతోపాటు వారి నుంచి వచ్చిన సూచనలను పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.

10/03/2016 - 08:18

కాకినాడ, అక్టోబర్ 2: నగరాలు, పట్టణాల్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేవారు ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ అంతస్తుల భవనాలను (అపార్ట్‌మెంట్స్) ఆశ్రయించక తప్పడంలేదు. ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఉన్నత, మధ్య తరగతి వర్గాలు సైతం అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ల కొనుగోలుకు ముందుకువస్తున్నారు. దీంతో ఆయా వర్గాల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న బిల్డర్లు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.

10/02/2016 - 00:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్‌సి) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజీవ్ శర్మ నియమితులయ్యారు. గత నెల సెప్టెంబర్ 30 (శుక్రవారం)న ఎమ్‌కె గోయల్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలోకి శర్మ శనివారం నుంచి బాధ్యతల్లోకి వచ్చారు. పిఎఫ్‌సిలోకి రాకముందు శర్మ.. రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఇసి) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Pages