S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/02/2016 - 00:14

న్యూయార్క్, అక్టోబర్ 1: హార్వర్డ్ మేనేజ్‌మెంట్ కంపెనీ (హెచ్‌ఎమ్‌సి) అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా భారత సంతతికి చెందిన ఎన్‌పి నర్వేకర్ నియమితులయ్యారు. ఈ మేరకు హెచ్‌ఎమ్‌సి ఓ ప్రకటనలో తెలియజేసింది. గడచిన పదేళ్లలో హెచ్‌ఎమ్‌సికి నలుగురు కొత్త సిఇఒలు రాగా, 54 ఏళ్ల నర్వేకర్ బాధ్యతలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి.

10/02/2016 - 00:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఈసారి భారీ మొత్తంలో 65,250 కోట్ల రూపాయల లెక్క చూపని ధనం వెలుగులోకి వచ్చింది. దీంతో ఖజానాకు 29,362 కోట్ల రూపాయల పన్ను రూపేణా లభించనుంది. ఆన్‌లైన్‌లో కాని మాన్యువల్‌గా కాని నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడానికి ప్రభుత్వం ఇచ్చిన నాలుగు నెలల కాలపరిమితి సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిపోయింది.

10/02/2016 - 00:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాది పొడిగించింది. ఈ నెల 7 నుంచి పొడిగింపు వర్తించనుండగా, 2013 అక్టోబర్ 7న మూడేళ్లకుగాను ఎస్‌బిఐ చీఫ్‌గా భట్టాచార్య బాధ్యతలు స్వీకరించారు. కాగా, అనుబంధ బ్యాంకులను ఈ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం విలీనం చేసుకుంటున్న వేళ భట్టాచార్యనే మరో ఏడాదిపాటు సారథిగా నిర్ణయించింది కేంద్రం.

10/02/2016 - 00:10

విజయవాడ, అక్టోబర్ 1: వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్న సమయంలో సేద్యంపైనే ఆధారపడే రైతన్నలు పశువుల పెంపకంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పాల విక్రయం ద్వారా నాలుగు మెతుకులు తినగలుగుతున్నారు. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు వ్యవసాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు పశువుల అకాల మరణాలతో మరింత నష్టాల పాలవుతున్నారు.

10/02/2016 - 00:08

తిరుపతి, అక్టోబర్ 1: సెల్‌కాన్ సంస్థ కార్యకలాపాలను ఆంధ్ర రాష్ట్రంలో నవంబర్ నెల నుండి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ వేంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ ఎండి గురుమూర్తి నాయుడు తెలిపారు.

10/02/2016 - 00:06

హైదరాబాద్, అక్టోబర్ 1: రామగుండంలో నెలకొల్పనున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 800 మెగావాట్ల యూనిట్ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎన్టీపిసి ప్రకటించింది. 2020 ఫిబ్రవరి నాటికి మొదటి యూనిట్ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 1,600 మెగావాట్లు. 10,599 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు.

10/02/2016 - 00:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: మునుపెన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో తొలి రోజైన శనివారం 53,531 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 700 మెగాహెట్జ్, 900 మెగాహెట్జ్ మినహా మిగతా అన్ని మెగాహెట్జ్ తరంగాల కోసం టెలికామ్ సంస్థలు పోటీపడ్డాయి. ఐదు రౌండ్ల బిడ్డింగ్ ముగిసే సరికి 53,531 కోట్ల రూపాయల విలువైన బిడ్లు వచ్చినట్లు అధికార వర్గాలు పిటిఐకి తెలిపాయి.

10/02/2016 - 00:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశీయ ఆటో రంగంలో పండగ సీజన్ అమ్మకాలు మొదలయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం, వ్యాపార అవకాశాలు మెరుగుపడుతుండటంతో వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే గత నెల సెప్టెంబర్‌లో మారుతి సుజుకి రికార్డు స్థాయిలో విక్రయాలు జరిపింది. 1,37,321 యూనిట్లను అమ్మగా, నిరుడు సెప్టెంబర్‌లో 1,06,083 యూనిట్లుగానే నమోదయ్యాయి.

10/02/2016 - 00:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: బంగారం ధరలు శనివారం తగ్గుముఖం పట్టాయి. గురు, శుక్రవారాల్లో పెరిగిన ధర.. శనివారం మాత్రం పడిపోయింది. వారం రోజులకుపైగా కనిష్ట స్థాయిని తాకుతూ 325 రూపాయలు దిగి 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 31,200 రూపాయలుగా నమోదైంది. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 31,050 రూపాయలుగా ఉంది. కాగా, అంతకుముందు రెండు రోజుల్లో బంగారం ధర 225 రూపాయలు పెరిగినది తెలిసిందే.

10/01/2016 - 07:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చెందిన ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ జ్యుయలరీ విభాగంలోకి ప్రవేశించింది. దీంతో ఇప్పటిదాకా వస్త్ర ప్రపంచంలో కనిపించిన బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ఇకపై ఆభరణాల రంగంలోనూ అగుపించనుంది. శుక్రవారం ఇక్కడ సల్మాన్ ఖాన్ తమ నూతన వ్యాపారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.

Pages