S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/16/2017 - 00:59

జపాన్‌కు చెందిన ఆటోరంగ దిగ్గజం టొయోట.. బుధవారం దేశీయ మార్కెట్‌లో
తమ హైబ్రిడ్ మోడళ్లైన కామ్రి, ప్రియస్‌లలో కొత్త వెర్షన్లను ఆవిష్కరించింది.
ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం వీటి ధరలు 31.99 లక్షల రూపాయల నుంచి 38.96 లక్షల రూపాయల మధ్య ఉన్నాయ.

02/16/2017 - 00:57

ముంబయి, ఫిబ్రవరి 15: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన పేలవ ఆర్థిక ఫలితాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.

02/16/2017 - 00:56

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో తయారీ రంగానికి విస్తృతమైన అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా 2017 ఎయర్ షోలో కెటిఆర్ నాయకత్వాన తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ సందర్భంగా విమాన యాన రంగంలో తెలంగాణ ప్రభు త్వం 2 అవగాహన ఒప్పందాల (ఎమ్‌ఒయు)పై సంతకాలు చేసింది.

02/16/2017 - 00:54

అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ బెంగళూరులోని
యలహంక ఎయర్ బేస్ వద్ద జరుగుతున్న
ప్రీమియర్ ఎయర్ షో.. ఏరో ఇండియా 2017లో బుధవారం ఇలా రఫేల్ ఎయర్‌క్రాఫ్ట్ పైలట్‌గా దర్శనమిచ్చారు. ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఫైటర్ జెట్‌లో దూసుకుపోయారు. రఫేల్ ఎయర్‌క్రాఫ్ట్ తయారీదారైన దస్సాల్ట్ ఏవియేషన్‌తో రిలయన్స్ డిఫెన్స్ జాయంట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తోంది

02/16/2017 - 00:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: శాశ్వత ఖాతా నంబరు (పాన్) కావాలంటే ఇంతకు ముందు వారాలు పట్టేది. అయితే ఇప్పుడు ఇక దరఖాస్తు చేసిన కొద్ది నిమిషాల్లోనే పాన్ మీ చేతికి వస్తుంది. అంతేకాదు పన్ను చెల్లింపుదారులు తమ స్మార్ట్ఫోన్‌ను ఉపయోగించి చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఒక యాప్‌ను కూడా ఆదాయ పన్ను శాఖ రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా ఇ-కెవైసి ధ్రువీకరణను ఎలా జరుపుతారో అలాగే పాన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

02/16/2017 - 00:51

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: మత్స్య పరిశ్రమ సంక్షోభంలో పడింది. మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. మత్స్య పరిశ్రమను కుదేలు చేసింది. తరచూ పెరుగుతున్న డీజిల్ ధరలూ మత్స్య పరిశ్రమను దెబ్బతీస్తున్నాయ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను ఏ విధంగానూ ఆదుకోకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.

02/15/2017 - 01:54

చిత్రం..మార్కెట్‌లోకి మంగళవారం సరికొత్త హోండా సిటి కారు వచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 8.5 లక్షల రూపాయల నుంచి 13.58 లక్షల రూపాయల మధ్య ఉంది

02/15/2017 - 01:52

చిత్రం.. మంగళవారం హైదరాబాద్‌లో సరికొత్త శ్రేణి ఫ్యాన్లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న హావెల్స్ ప్రతినిధులు

02/15/2017 - 01:49

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు టోకు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. గత నెలలో ఏకంగా 30 నెలల గరిష్ఠాన్ని టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) తాకింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 5.25 శాతంగా నమోదైంది. 2014 జూలైలో 5.41 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయ దరిదాపుల్లోకి చేరింది.

02/15/2017 - 01:48

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: హృద్రోగులకు శుభవార్త. గుండె కవాటాలు ముసుకుపోయిన సమయంలో ప్రాణాలను రక్షించే కరోనరి స్టెంట్ల ధరలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం భారీగా తగ్గించింది మరి. ఏకంగా 85 శాతం వరకు ధరలను దించేసింది. బేర్ మెటల్ స్టెంట్స్ (బిఎమ్‌ఎస్) ధరను 45,000 రూపాయల నుంచి 7,260 రూపాయలకు తీసుకొచ్చిన కేంద్రం.. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ (డిఇఎస్) ధరను 1.21 లక్షల రూపాయల నుంచి 31,080 రూపాయలకు తెచ్చింది.

Pages