S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/03/2016 - 06:27

న్యూయార్క్, జూన్ 2: ఇప్పట్లో సొంతగా స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలన్న ఆలోచన తమ సంస్థకు లేదని, ప్రస్తుతానికి ఈ విషయంలో ఓఇఎం (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్)లతో కలిసే ముందుకు సాగుతామని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘గూగుల్’ సిఇఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. గూగుల్ ప్రస్తుతం ఓఇఎంల సహకారంతో ‘నెక్సస్’ స్మార్ట్ఫోన్లను తయారు చేయించుకుంటున్న విషయం విదితమే.

06/03/2016 - 06:25

నెల్లూరు, జూన్ 2: ఏపిఎస్ ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో భాగంగా సరకుల పార్శిల్ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రవీంద్రబాబు తెలిపారు. గురువారం నెల్లూరు ప్రధాన బస్టాండ్ ప్రాంగణంలో ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ పార్శిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

06/03/2016 - 05:09

న్యూఢిల్లీ, జూన్ 2: చెల్లింపులకు సంబంధించి పీకల్లోతు కష్టాల్లో మునిగిన సహారా గ్రూపునకు చెందిన మొత్తం 10 ఆస్తులను వేలం వేయడానికి హెచ్‌డిఎఫ్‌సి రియల్టీ, ఎస్‌బిఐ క్యాపిటల్ సిద్ధమవుతున్నాయి. సహారా ఆస్తుల వేలం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సెబిని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

06/03/2016 - 05:04

ఒసాకా (జపాన్), జూన్ 2: స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి గణాంకాలు అందజేస్తున్న ప్రోత్సాహంతో ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రపంచంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పేరును నిలబెట్టడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సంస్కరణల అజెండాను మరింత ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

06/02/2016 - 08:28

టోక్యో, జూన్ 1: భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మరింత ముందుకు దూసుకెళ్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లో పర్యటిస్తున్న జైట్లీ.. మంగళవారం విడుదలైన స్థూల దేశీయోత్పత్తి (జిడిపి), వౌలికరంగాభివృద్ధి అంచనాలపై బుధవారం ఇక్కడ స్పందించారు. తాజా గణాంకాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఎత్తుకు ఎదిగిందని పేర్కొన్నారు.

06/02/2016 - 08:26

ముంబయి, జూన్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం నష్టాలపాలైన నేపథ్యంలో టెలికామ్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి, టెక్నాలజీ, రియల్టీ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు తిరిగి కోలుకోగలిగాయి.

06/02/2016 - 08:26

న్యూఢిల్లీ, జూన్ 1: ఐరోపాలోని లాంగ్ స్టీల్ వ్యాపార అమ్మకం పూర్తయినట్లు టాటా స్టీల్ బుధవారం ప్రకటించింది. స్కన్‌థోర్ప్ ప్లాంట్‌తోసహా మొత్తం టాటా స్టీల్ యుకె బిజినెస్‌ను గ్రేబుల్ క్యాపిటల్ ఎల్‌ఎల్‌పికి అమ్మేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఏళ్ల తరబడిగా నష్టాల్లో నడుస్తున్న టాటా స్టీల్ బ్రిటన్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో టాటా గ్రూప్ ప్రకటించినది తెలిసిందే.

06/02/2016 - 08:24

హైదరాబాద్, జూన్ 1: అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్.. సిలికాన్ వ్యాలీలో రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ముందుగా పాలికామ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కెటిఆర్ సందర్శించినట్లు బుధవారం విడుదలైన ఓ ప్రకటన తెలియజేసింది.

06/02/2016 - 08:22

విశాఖపట్నం, జూన్ 1: ఇప్పటి వరకూ సేంద్రియ వ్యవసాయం, కూరగాయల గురించి మాత్రమే విన్నాం. ఇక సేంద్రియ రొయ్యలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. విదేశాల్లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడా) సేంద్రియ ఆక్వా కల్చర్‌పై దృష్టి సారించింది.

06/02/2016 - 08:21

న్యూఢిల్లీ, జూన్ 1: కొరియా టెక్నాలజీ దిగ్గజం ఎల్‌జి బుధవారం దేశీయ మార్కెట్‌కు మూడు కెమెరాలున్న స్మార్ట్ఫోన్‌ను పరిచయం చేసింది. జి5 పేరుతో వచ్చిన దీన్ని గుర్గావ్‌లో ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండి కిమ్ కి వాన్ ఆవిష్కరించారు. దీని ధర 52,990 రూపాయలు.

Pages