S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/27/2016 - 02:20

హైదరాబాద్, సెప్టెంబర్ 26: అంతర్జాతీయంగా పేరుపొందిన హైదరాబాద్‌లోని ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ’ (సిఎస్‌ఐఆర్-ఐఐసిటి) రూపొందించిన ‘సిఐఎం-పీతాంబర్’ అనే కొత్త పసుపు రకాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం విడుదల చేశారు.

09/26/2016 - 00:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే ప్రధాన అంశాలేవీ లేని నేపథ్యంలో సెప్టెంబర్ నెల డెరివేటివ్‌ల గడువు ముగుస్తూ ఉండడం వచ్చేవారం దేశీ మార్కెట్లను ఆటుపోట్లకు గురి చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే విదేశీ పెట్టుబడుల రాకడ కొనసాగడంలాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా వారంటున్నారు.

09/26/2016 - 00:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తదుపరి రెండు త్రైమాసికాల్లో దేశ వృద్ధి రేటు 8 శాతంకంటే ఎక్కుగా నమోదవడం ఖాయమని, రుతుపవనాలు ఎంతో మెరుగ్గా ఉండటం, కేంద్ర ప్రభుత్వం సకాలంలో విధాన నిర్ణయాలను తీసుకోగలుగుతుండటంతో పాటు ఆర్థిక సంస్కరణల వేగం పెరగడం వృద్ధి రేటు పెరిగేందుకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా స్పష్టం చేశారు.

,
09/26/2016 - 00:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: అంబానీలు మొదలుకొని అదానీల దాకా.. ప్రేమ్‌జీలు మొదలుకొని ఖోరకివాలాల దాకా కుటుంబ వ్యాపారాలను నిర్వహిస్తున్న కుటుంబాలుతమ పిల్లల్ని సైతం తమ వ్యాపారాల్లో వారసులుగా ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాపారాభివృద్ధికి తమ వంతు సేవలందిస్తున్న పుత్ర రత్నాలకు ఆయా కంపెనీలు వేతనాలు, లేదా ఇతర సదుపాయాల రూపంలోఏటా కోట్ల మొత్తం చెల్లిస్తున్నాయి.

09/26/2016 - 00:43

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: మెరైన్ ప్రోడక్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంపెడా), సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ నెల 23 నుంచి విశాఖలో నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ఆదివారంతో ముగిసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించగా, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

09/26/2016 - 00:42

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఎయిర్ టెల్ సర్వీసస్ సంస్ధ 4జి డాటా ప్యాక్‌ను ప్రకటించింది. 90 రోజుల పాటు ఉచితంగా డాటా సేవలను అందిస్తామని ఎయిర్ టెల్ ఇండియా డైరెక్టర్ అజయ్ పూరి తెలిపారు. ఇప్పటికే ఉన్న కస్టమర్లు రూ.1495 చెల్లించిన వారికి మూడు నెలల పాటు ఈ సదుపాయం ఉంటుందన్నారు. కొత్త వినియోగదారులు మొదటి రీచార్జికి రూ.1494 చెల్లించాలన్నారు. 4జి హ్యాండ్‌సెట్లు ఉన్న వారికే ఈ సదుపాయం ఉంటుందన్నారు.

09/26/2016 - 00:41

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ఎగుమతుల నాణ్యత విషయంలో భారత్, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటర్ అథారిటీ (యుఎస్ ఎఫ్‌డిఎ) మధ్య సమన్వయం, ప్రతిభావంతమైన సహకారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని యుఎస్ ఎఫ్‌డిఎ డైరెక్టర్ మాథ్యూ టి థామస్ అన్నారు. విశాఖలో జరుగుతున్న ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన టెక్నికల్ సెషన్‌లో ఆయన మాట్లాడారు.

09/26/2016 - 00:40

హైదరాబాద్, సెప్టెంబర్ 25: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం యూనిట్-1లో నిర్వహించిన సిఒడిరన్ విజయవంతమైంది. ఆదివారం సింగరేణి అధికారులతోపాటు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న తెలంగాణ స్టేట్ సదరన్ డిస్కం, తెలంగాణ స్టేట్ నార్త్ డిస్కం అధికారుల సమక్షంలో సిఒడి రన్ జరిగింది.

09/26/2016 - 00:39

పాల్వంచ, సెప్టెంబర్ 25: ఖమ్మం జిల్లా పాల్వంచలో రూ 5,290 కోట్ల వ్యయంతో నెలకొల్పుతున్న కెటిపిఎస్ 7వ దశ కర్మాగారం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం చేస్తున్న ఈ కర్మాగారం పనులను 1-1-2015న ప్రారంభించారు. 2017 డిసెంబర్ లోపు కర్మాగారం పనులు పూర్తయ్యే విధంగా కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు శ్రమిస్తున్నారు.

09/25/2016 - 01:45

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: రాష్ట్రంలోని ఆక్వా రైతులకు మేలు చేకూర్చేలా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల వివరాలు ఎప్పటి కప్పుడు తెలిజేసే సరికొత్త సాఫ్ట్‌వేర్ రూపొందించారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వా కల్చర్ సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందని మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) చైర్మన్ జయతిలక్ తెలిపారు.

Pages