S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/25/2016 - 01:43

న్యూయార్క్, సెప్టెంబర్ 24: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పతనమైనాయి. ఇటీవలి కాలంలో కాస్త పుంజుకుంటున్నట్లు కనిపించిన చమురు ధరలు మళ్లీ పతనమవడం కలకలం రేపుతోంది. ఈ నెల 28న అల్జీరియాలో రష్యా వంటి ఒపెక్‌లో సభ్య త్వం లేని చమురు ఉత్పత్తి దేశాలతో ఒపెక్ కీలక సమావేశం కానున్న నేపథ్యంలో చమురు ధరలు పతనం కావ డం ప్రాధాన్యతను సంతరించుకుంది.

09/25/2016 - 01:43

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) కౌన్సిల్‌లో అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్‌ను నియమించారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ గోయల్ నియామకాన్ని ఆమోదించింది. సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

09/25/2016 - 01:42

ముంబయి, సెప్టెంబర్ 24: అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక సమావేశాల నేపథ్యంలో మదుపరులు అచితూచి పెట్టుబడులు పెట్టడంలాంటి కారణాలతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ ప్రధాన సూచీ సెనె్సక్స్ 69.19 పాయింట్లు లాభపడి 28,668.22 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 51.70 పాయింట్లు లాభపడి 8,831.55 పాయింట్ల వద్దకు చేరుకుంది.

09/25/2016 - 01:41

విశాఖపట్నం(పరవాడ), సెప్టెంబర్ 24: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీపీసీ) రెండవ ఐదు వందల మెగావాట్ల విద్యుత్ యూనిట్‌లో సాంకేతిక లోపంతో శనివారం ఉత్పత్తి నిలిచి పోయింది. రెండవ యూనిట్‌కు సంబంధించిన బాయిలర్ ట్యూబ్స్‌లో సాంకేతిక లోపం తల్తెతడంతో సింహాద్రి అధికారులు రెండవ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమంయలో నిలిపి వేశారు.

09/25/2016 - 01:41

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: విదేశాలకు ఎగుమతులు చేసే ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత ముఖ్యమని ఎక్స్‌పోర్ట్స్ ఇనస్పెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్‌కె సక్సేనా పేర్కొన్నారు. ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో రెండోరోజు శనివారం జరిగిన టెక్నికల్ సెషన్స్‌లో భాగంగా రెగ్యులేటరీ రిక్వైర్‌మెంట్స్ ఆఫ్ సీ ఫుడ్ ట్రేడ్ అం శంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకే విదేశీ ఎగుమతులు జరగాలన్నారు.

09/25/2016 - 01:40

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందం కేసులో నిందితులయిన మలేసియా జాతీయులు టి.ఆనంద కృష్ణన్, ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్‌లను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశిస్తూ 2జి స్పెక్ట్రం కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు శనివారం వారెంట్లు జారీ చేసింది.

09/24/2016 - 01:28

ముంబయి, సెప్టెంబర్ 23: వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో గురువారం ఉరకలేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం చతికిల పడ్డాయి. బ్యాకింగ్ స్టాక్స్ లాంటి ఇటీవల లాభాలు ఆర్జించిన స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మదుపరులు దిగడంతో వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

09/24/2016 - 01:27

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వ్యవసాయ ఎగుమతులకు సంబంధించిన రాయితీలను రద్దు చేసేందుకు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వ్యవసాయ మంత్రులు శుక్రవారం ఆమోదం తెలిపారు.

09/24/2016 - 01:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సహారా గ్రూపు సంస్థల నుంచి డబ్బును రికవరీ చేసేందుకు ఆ సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్న మార్కెట్ నియంత్రణా సంస్థ ‘సెబీ’ ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ సంస్థకు చెందిన మరో 13 ల్యాండ్ పార్శిళ్లను వచ్చే నెలలో వేలం వేయబోతున్నామని, వీటి మొత్తం రిజర్వు ధరను దాదాపు 1,400 కోట్ల రూపాయలు నిర్ణయించడం జరిగిందని సెబీ స్పష్టం చేసింది.

09/24/2016 - 01:24

సింహాచలం, సెప్టెంబర్ 23: ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర తపాలా శాఖ కార్యదర్శి బివి సుధాకర్ తెలిపారు. సింహాచలం వచ్చిన సందర్భంగా శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ఒక లక్షా ఏభైవేల పోస్ట్ఫాసుల్లో అన్‌లైన్ సేవలందించేందుకు నెట్‌వర్కింగ్ పూర్తయిందన్నారు.

Pages