S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/22/2016 - 12:05

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉదయం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.86 పైసలు వద్ద కొనసాగుతోంది. 282 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 89 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

09/22/2016 - 07:24

ఆదోని, సెప్టెంబర్ 21: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం రోజు పత్తి రికార్డు ధర పలికింది. క్వింటాలు పత్తి ధర రూ.6,670 పలికింది. ఇది దేశంలోనే రికార్డు. బుధవారం మార్కెట్‌కు 964 పత్తి చెక్కుల్లో 1908 క్వింటాళ్ళ పత్తి అమ్మకానికి వచ్చినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మదిరే భాస్కర్‌రెడ్డి తెలిపారు.

09/22/2016 - 07:21

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెలికామ్ ఆపరేటర్లు ఇంటర్ కనెక్టివిటీ విషయంలో అనుసరిస్తున్న తీరుపై రిలయన్స్ జియో మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

09/22/2016 - 07:19

ముంబయి, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణులు కొనసాగించినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఒడిదుడుకుల మధ్యనే సాగాయి. ప్రారంభంలో లాభాలతో మొదలైన మార్కెట్లు ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ పరపతి విధానం సమీక్ష తర్వాత మధ్యాహ్నం సమయానికి మరింతగా దూసుకెళ్లాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణ ధోరణిని కనబర్చడంతో ఆ లాభాలన్నిటినీ కోల్పోయాయి.

09/22/2016 - 07:19

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో అంకుర పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ డెస్క్ విధానం ఆచరణలో అత్యుత్తమ ఫలితాలనిస్తోంది. ఈ పథకానికి ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కూడా లభించాయి. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 29న దీనిని ప్రవేశపెట్టింది.

09/22/2016 - 07:18

కొత్తగూడెం, సెప్టెంబర్ 21: వార్షిక ఉత్పత్తిలో వెనుకబడిన సింగరేణికి విదేశీబొగ్గు అశనిపాతంగా మారి సంస్థ మనుగడకే ప్రమాదంగా పరిణమించింది. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తే సంస్థ తిరోగమనానికి సవాలక్ష కారణాలు కనిపిస్తున్నాయి.

09/21/2016 - 00:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూపు ఒడిశాలో 5 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ధమ్రా ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ప్రాజెక్టులో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి)తో పాటు గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) బుధవారం ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి.

09/21/2016 - 00:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూపు ఒడిశాలో 5 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ధమ్రా ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ప్రాజెక్టులో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి)తో పాటు గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) బుధవారం ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి.

09/21/2016 - 00:48

ముంబయి, సెప్టెంబర్ 20: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు అద్దంపడుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు గత నాలుగు రోజులుగా లాభాల్లో సాగిన విషయం తెలిసిందే. ఫలితంగా సెనె్సక్స్ 111 పాయింట్లు పడిపోగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేజి సూచీ నిఫ్టీ తిరిగి 8,800 పాయింట్ల దిగువకు చేరుకుంది.

09/21/2016 - 00:46

గుంటూరు, సెప్టెంబర్ 20: ప్రజలపై అధికంగా పన్నులభారం మోపకుండా జిఎస్‌టిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం జిఎస్‌టి బిల్లు, పెండింగ్‌లో ఉన్న ఆర్థికశాఖకు సంబంధించిన అంశాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సిమెంట్ ధరల నియంత్రణపై మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

Pages