S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/12/2016 - 00:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: వచ్చే వారం వెలువడనున్న వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి. బక్రీద్ కారణంగా మంగళవారం మార్కెట్లకు సెలవు కావడంతో వచ్చేవారం అయిదు రోజులు మాత్రమే మార్కెట్లు పని చేయనున్నాయి. సోమవారం వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను ప్రభుత్వం ప్రకటించనుంది.

09/12/2016 - 00:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల వాణిజ్య మంత్రుల సమావేశం అక్టోబర్ 13వ తేదీన న్యూఢిల్లీలో జరుగనుంది. పనే్నతర వాణిజ్య అవరోధాలతో పాటు సేవల రంగం అభివృద్ధి, మేధో సంపత్తి హక్కుల విషయంలో పరస్పరం సహకారాన్ని పెంపొందించుకోవడం తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

09/12/2016 - 00:50

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: ఉత్పత్తి, నిర్వహణ విభాగాల్లో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి సిఐఓ-100 పురస్కారం లభించింది. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ డేటా గ్రూప్ (ఐడిజి) సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 100 సంస్థలను పరిశీలించిన ఐడిజి విశాఖ స్టీల్‌ప్లాంట్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ (ఐటి)ని వినియోగిస్తున్న తీరును ప్రశంసించింది.

09/12/2016 - 00:50

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: న్యూఢిల్లీలో ఈ నెల 14వ తేదీ నుంచి రెండు రోజుల పాటు భారత్-అమెరికా వాణిజ్య శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంపొందించుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ఇరు దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు వ్యాపార, విద్యా రంగాల నిపుణులు ఈ సదస్సులో చర్చ జరుపనున్నారు.

09/12/2016 - 00:49

కాకినాడ, సెప్టెంబర్ 11: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం తీర ప్రాంతంలో దివీస్ మందుల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు సాగిస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నాయి. పచ్చని గ్రామాలపై విషం చిమ్మే ప్రమాదం ఉన్న మందుల ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఇటీవల స్థానికులు ఆందోళన సాగిస్తున్న విషయం విదితమే.

09/12/2016 - 00:48

ముంబయి, సెప్టెంబర్ 11: కార్పొరేట్ సంస్థలకు రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) విధించిన కఠిన నిబంధనల వల్ల బ్యాంకులు కన్స్యూమర్ రుణాల వైపు మొగ్గే అవకాశముందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయ పడ్డారు. రిటైల్ రంగంలో ఎలాంటి సంక్షోభం లేదని కూడా ఆమె అన్నారు.

09/12/2016 - 00:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశీయ మార్కెట్లు జోరుమీదున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఏకంగా మూడు కంపెనీలు సుమారు 7 వేల కోట్ల రూపాయలు సేకరించడం కోసం ఐపిఓలతో మార్కెట్లోకి రానున్నాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్, జిఎన్‌ఏ యాక్సిల్స్ సంస్థలు ఈ ప్రాథమిక పబ్లిక్ ఇష్యూలతో రానున్నాయి.

09/12/2016 - 00:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రభుత్వం నుంచి రెండో విడత మూలధనం నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ నిధులను పొందాలంటే రుణాల రికవరీ సహా కొన్ని నిబంధనలను నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ వాఖ రీక్యాపిటలైజైషన్ నిబంధనలను సవరించింది.

09/11/2016 - 04:49

ముంబయి, సెప్టెంబర్ 10: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటుగా దేశీయంగా కూడా సర్వీసు రంగం మూడున్నరేళ్లలో ఎన్నడూ లేనంతగా వృద్ధి చెందడం లాంటి పరిణామాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా రెండో వారం కూడా మంచి లాభాలతో ముగిశాయి. ఫలితంగా అంతకు ముందు వారం భారీ లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా గడచిన వారంలో కూడా ఊపు మీద కొనసాగాయి.

09/11/2016 - 04:47

చెన్నై, సెప్టెంబర్ 10: ప్రతిష్టాత్మకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు ఇప్పుడు చట్టంగా మారడంతో ప్రభుత్వం తర్వలో జిఎస్‌టి కౌన్సిల్‌ను ఏర్పాటుచేసి పరోక్ష పన్నుల పెను భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నానని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.

Pages