S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/09/2016 - 00:22

సత్యవేడు, సెప్టెంబర్ 8: యుకె దేశానికి చెందిన పవర్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ నూతన ఉత్పత్తి కేంద్రం గురువారం ఉదయం నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ సెజ్‌లో ప్రారంభమైంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి యూనిట్‌గా పవర్ గ్యాస్ గ్రూప్ చైర్మన్ దీపక్ కిల్‌నాని లాంఛనంగా ప్రారంభించారు.

09/09/2016 - 00:21

హైదరాబాద్, సెప్టెంబర్ 8: జీఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన మండలి గురువారం ఆమోదించింది. అంతకుముందు మండలి చైర్మన్ చక్రపాణి అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధాన రాజకీయ పక్షాలు కోరాయి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అలక్ష్య వైఖరిని ప్రదర్శించిందని అధికార పక్షం మినహా మిగతా విపక్షాలన్నీ ఆరోపించాయి.

09/09/2016 - 00:21

హైదరాబాద్, సెప్టెంబర్ 8: విజయవాడ, కర్నూలు, ఖమ్మం పట్టణాల్లో ఇపిఎఫ్‌ఓ డివిజన్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖా సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.

09/09/2016 - 00:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పప్పు్ధన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం భరోసా ఇచ్చింది. అంతేకాకుండా ప్రజలకు చౌకధరలకే పప్పు్ధన్యాలను సరఫరా చేసేందుకు వీలుగా పెద్ద మొత్తంలో నిల్వలను ఏర్పాటు చేసుకునేందుకు రైతుల నుంచి నేరుగా కందులు, మినుములు, పెసలను కొనుగోలు చేయాలని నాఫెడ్ సహా వివిధ కొనుగోలు సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.

09/09/2016 - 00:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఎరువులపై రైతులకు ఇస్తున్న రాయితీలను ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డిబిటి) ద్వారా అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు. ఈ కమిటీ మూడు నెలల్లోగా నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు.

09/09/2016 - 00:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ప్రపంచ వ్యాప్తంగా గాడ్జెట్ ప్రియులను తీవ్రంగా ఊరిస్తున్న ఐఫోన్-7, ఐఫోన్-7 ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్లను ఆపిల్ సంస్థ బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించింది. 60 వేల రూపాయల ప్రారంభ ధరతో ఈ నెల 16వ తేదీ నుంచి అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్లను కొనుగోలు చేయాలంటే భారతీయులు వచ్చే నెల 7వ తేదీ వరకు ఆగాల్సిందే.

09/08/2016 - 16:40

దిల్లీ: దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర గురువారం రూ. 47వేలకు చేరింది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టి, రూ. 44వేల వరకు చేరిన వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావంతో నిన్న ఒక్క రోజే రూ. 750 పెరగగా.. గురువారం మరో రూ. 50 పెరిగింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

09/08/2016 - 07:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. బుధవారం బులియన్ మార్కెట్‌లో రెండున్నరేళ్ల గరిష్ఠానికి పసిడి ధరలు చేరాయి. ఈ ఒక్కరోజే 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 450 రూపాయలు పెరిగి 31,550 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 31,400 రూపాయలు పలికింది. ఫలితంగా 2014 ఫిబ్రవరి 26 నాటి స్థాయికి ధరలు చేరాయి.

09/08/2016 - 07:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పునరుద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక పరోక్ష పన్ను విధానం ఒకసారి ఆచరణలోకి వస్తే పన్ను రేట్లు తగ్గుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వరంగ బ్యాంకులను తిరిగి గాడిలో పెట్డడం అన్నది తమ ముందున్న అతిపెద్ద సవాల్ అని జైట్లీ అన్నారు.

09/08/2016 - 07:32

బీజింగ్, సెప్టెంబర్ 7: చైనా ప్రభుత్వరంగ బ్యాంకులు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న చైనాలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు కీలక రంగాల ప్రగతికి బ్రేకులు వేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Pages