S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/08/2016 - 07:32

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.5 శాతానికి పెరగవచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డిఅండ్‌బి) అంచనా వేసింది. భారత చమురు అవసరాలు ఎక్కువగా విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోయిన ముడి చమురు ధరలు దేశ జిడిపి వృద్ధిరేటు పురోగతికి దోహదపడగలదని డిఅండ్‌బి అభిప్రాయపడింది.

09/08/2016 - 07:31

ముంబయి, సెప్టెంబర్ 7: మంగళవారం భారీ లాభాలను అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 51.66 పాయింట్లు పడిపోయి 28,926.36 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 25.05 పాయింట్లు దిగజారి 8,917.95 వద్ద నిలిచింది.

09/08/2016 - 07:30

బెంగళూరు, సెప్టెంబర్ 7: రుణ ఎగవేత కేసును, కోర్టుల నుంచి సమన్లను ఎదుర్కొంటున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) వాటాదారులకు బుధవారం ఓ లేఖ రాశారు. ఇక్కడ జరిగిన యుబిఎల్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ లేఖను చదివి వినిపించగా, ఇందులో యుబిఎల్ ఉత్పత్తులు ఇక ముందూ కొనసాగుతాయని, మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తులు కూడా వస్తాయని మాల్యా స్పష్టం చేశారు.

09/08/2016 - 07:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 21 శాతం క్షీణించి 4,233 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో లాభం 5,368 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో ఒఎన్‌జిసి స్పష్టం చేసింది.

09/07/2016 - 17:52

ముంబయి: బుధవారం దేశీయ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.38గా కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 52 పాయింట్లు కోల్పోయి 28,926 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 8,917 వద్ద ముగిసింది.

09/07/2016 - 17:51

బెంగళూరు: యునైటెడ్‌ బ్రూవరీస్‌ ఛైర్మన్‌గా విజయ్‌ మాల్యానే కొనసాగుతారని యూబీఎల్‌ యాజమాన్యం బుధవారం ప్రకటించింది. చట్టప్రకారం మాల్యా ఛైర్మన్‌గా కొనసాగవచ్చని యూబీఎల్‌ కంపెనీ డైరెక్టర్‌ ఛుగ్‌ యోగేంద్ర పాల్‌ పేర్కొన్నారు. ఈడీ మాల్యా వాటాలను అటాచ్‌ చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

09/07/2016 - 00:09

హైదరాబాద్, సెప్టెంబర్ 6: మద్య నిషేధానికి తాను వ్యతిరేకమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆడీ గోద్రెజ్ అన్నారు. గోద్రెజ్ గ్రూప్ చైర్మన్, పారిశ్రామిక సంఘం సిఐఐ మాజీ అధ్యక్షుడు కూడా అయిన గోద్రెజ్.. మంగళవారం ఇక్కడ పిటిఐతో మాట్లాడారు. ఈ సందర్భంగా బిహార్‌లో తెచ్చిన మద్య నిషేధంపై స్పందిస్తూ అమెరికాలో మద్య నిషేధం విధించినప్పుడు అక్కడ లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని గుర్తుచేశారు.

09/07/2016 - 00:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రభుత్వరంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 33.47 శాతం క్షీణించింది. ఈసారి 494.41 కోట్ల రూపాయలుగా నమోదైతే, గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 743.21 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,460.85 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,164.12 కోట్ల రూపాయలుగా ఉంది.

09/07/2016 - 00:08

ముంబయి, సెప్టెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 445.91 పాయింట్లు ఎగబాకి దాదాపు 17 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 28,978.02 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 133.35 పాయింట్లు ఎగిసి సుమారు 18 నెలల గరిష్ఠ స్థాయికి చేరి 8,943 వద్ద నిలిచింది.

09/07/2016 - 00:05

న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) మార్కెట్ విలువ మంగళవారం 112 లక్షల కోట్ల రూపాయలను దాటింది. మదుపరుల కొనుగోళ్ల జోరు మధ్య మునుపెన్నడూ లేనివిధంగా 1,12,44,145 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2014 నవంబర్‌లో తొలిసారిగా బిఎస్‌ఇ మదుపరుల సంపద 100 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. వినాయక చవితి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్లు మూతపడినది తెలిసిందే.

Pages