S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/07/2016 - 00:04

విజయవాడ, సెప్టెంబర్ 6: మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. తిరుగులేని పురోగతి సాధిస్తోంది. వ్యవసాయం, ఉద్యానవనం రంగాలతో సరిసమానంగా మాంసం ఉత్పత్తిలో కూడా అద్భుత ప్రగతి కనబరుస్తోంది. పేదల ఆర్థిక స్థితిగతులు మార్చడానికి పశు సంవర్థక శాఖ నుంచి అద్భుతమైన అవకాశాలున్నాయని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు పెంపకందారులకు ప్రోత్సాహకాలివ్వడం ప్రారంభించింది. భారీ స్థాయిలో నిధులు మంజూరు చేస్తూ..

09/07/2016 - 00:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా 599 రూపాయలకే విమాన టిక్కెట్‌ను ప్రకటించింది. ప్రత్యేక ఆఫర్లలో భాగంగా గౌహతి-ఇంపాల్ మార్గంలో 599 రూపాయల టిక్కెట్‌ను పరిచయం చేసింది.

09/07/2016 - 00:00

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: దేశీయ విమానయాన రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సిఇఒ ఐ ప్రభాకర్‌రావు అన్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, జిఎంఆర్ విమానాశ్రయాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధి (గాడ్) ఆసియా 2016 సదస్సు బుధవారం నుండి మూడు రోజులపాటు ఢిల్లీలో జరగనుంది.

09/07/2016 - 00:00

ముంబయి, సెప్టెంబర్ 6: ఆర్‌బిఐ 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే వినాయక చవితి కావడంతో ఇందుకు సంబంధించిన కార్యక్రమం మంగళవారం జరిగింది. పటేల్ నియామకం ఆదివారం నుంచే అమలులోకి వచ్చినది తెలిసిందే. 2013 జనవరి నుంచి పటేల్ ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేయగా, ఇప్పుడు రాజన్ స్థానంలో వచ్చారు.

09/06/2016 - 23:59

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రాకను దేశీయ టెలికామ్ రంగంలో పెను సవాల్‌గా అభివర్ణించారు ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ సిఎండి అనుపమ్ శ్రీవాత్సవ. మంగళవారం ఆయన ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ జియో ప్రకటిస్తున్న టారీఫ్‌లు అన్ని ఇతర టెలికామ్ సంస్థలకు సవాల్ విసురుతున్నాయన్నారు. అయినప్పటికీ ఈ పోటీకి అనుగుణంగానే మార్కెట్‌లో టారీఫ్‌లు దిగిరావచ్చన్నారు.

09/06/2016 - 23:58

విజయవాడ, సెప్టెంబర్ 6: నవ్యాంధ్రలోని పారిశ్రామిక అవసరాలకు భూములను కేటాయిస్తూ బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను, మరో 10 గ్రామాల్లో 7,214.87 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం ఏపిఐఐసికి కనీస ధరకు కేటాయించాలని నిర్ణయంచారు.

09/06/2016 - 23:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఇఎస్‌ఐ ఆరోగ్య బీమా వర్తించే పరిధిని ప్రస్తుత 15 వేల రూపాయల నుంచి 21 వేల రూపాయలకు పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. దీని ద్వారా మరో 50 లక్షల మందిని ఇఎస్‌ఐ పరిధిలోకి తీసుకురావాలని సంకల్పించింది. ధరల పెరుగుదల, జీతాల పెంపు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

09/06/2016 - 23:57

గుంటూరు, సెప్టెంబర్ 6: ఇక్కడికి సమీపంలోని నంబూరులో గల వివిఐటి కళాశాలలో గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఫండమెంటల్స్‌పై ఐదు రోజుల పాటు జరిగే రాష్టస్థ్రాయి వర్క్‌షాప్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు.

09/05/2016 - 06:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ విపణిలో ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా సూచీలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

09/05/2016 - 06:50

హాంగ్‌ఝౌ, సెప్టెంబర్ 4: భారత సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న జి-20 దేశాల సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒబామాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సహా ఇతర సంస్కరణలను ఒబామా కొనియాడారు. విపత్కర అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లోనూ సాహాసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు.

Pages