S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/05/2016 - 06:50

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రపంచంలో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశం మొత్తం సంపదలో మిలియనీర్లు లేదా ఒక మిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సొమ్ము కలిగినవారి చేతిలోనే 54 శాతం ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థను అదుపు చేయగల సామర్థ్యం సామన్యుల కంటే కూడా సంపన్నులకే ఎక్కువగా ఉందని స్పష్టమైంది.

09/05/2016 - 06:49

ముంబయి, సెప్టెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 24వ గవర్నర్‌గా 52 ఏళ్ల ఉర్జిత్ పటేల్ నియామకం ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. రఘురామ్ రాజన్ స్థానంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉర్జిత్ పటేల్‌ను ఎంపిక చేయగా, దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినది తెలిసిందే.

09/05/2016 - 06:48

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌ఇడి బల్బులు అమర్చినందు వల్ల ఇంతవరకు రూ. 911 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ఆదివా రం తెలిపారు. ఒక ఎల్‌ఇడి బల్బును అమర్చితే సాలీనా 73.7 యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేస్తామన్నారు.

09/05/2016 - 06:48

భీమవరం, సెప్టెంబర్ 4: రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్ వినియోగం మరోసారి దేశీయ ఎగుమతి రంగాన్ని కుదిపేస్తోంది. యాంటీ బయోటిక్స్ అవశేషాలున్న రొయ్యలను పలు దేశాలు తిరస్కరిస్తున్నాయి. కంటైనర్లకు కంటైనర్లు వెనక్కు తిరిగిరావడంతోపాటు, విదేశీ సంస్థల నుండి పెద్ద మొత్తంలో చెల్లింపులు సైతం నిలిచిపోతున్నాయి.

09/05/2016 - 06:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: సోమవారంనుంచి దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు రిలయన్స్ జియో 4జి సేవలను పూర్తిస్థాయిలో అందుకోవచ్చు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంచలన 4జి సేవలను అన్ని 4జి ఆధారిత మొబైల్ వినియోగదారులు కావాలనుకుంటే పొందే సౌకర్యం వస్తోంది. ఇప్పటిదాకా కేవలం రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉన్న జియో సిమ్‌లు.. ఇకపై మల్టీ-బ్రాండ్ ఔట్‌లెట్లు, మొబైల్ ఫోన్ షాపుల్లోనూ లభిస్తాయి.

09/05/2016 - 06:47

ఒంగోలు, సెప్టెంబర్ 4: చైనాకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ఎగుమతులు తగ్గిపోతున్నాయి. చైనా వ్యాపారులు అలవెన్స్‌లు ఎక్కువగా తీసుకుంటుండటంతో గ్రానైట్ క్వారీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో ఒక క్యూబిక్ మీటరు గెలాక్సీ రాయిని చైనాకు ఎగుమతి చేస్తే గ్రానైట్ అలవెన్స్‌గా మరో 1.8 క్యూబిక్ మీటరు రాయిని ఎగుమతి చేసేవారు.

09/04/2016 - 01:06

కొచ్చి, సెప్టెంబర్ 3: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పదకొండేళ్లలో తొలిసారి లాభాలను అందుకుంది. ఈ లో-కాస్ట్ ఇంటర్నేషనల్ క్యారియర్ 2005 నుంచి లాభాలనే ఎరుగలేదు. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరం (2015-16) 361.68 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది.

09/04/2016 - 01:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కొరడా ఝుళిపించింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక విదేశాలకు మాల్యా పారిపోయినది తెలిసిందే. ఈ క్రమంలో బకాయిలను రాబట్టడంలో భాగంగా ఇడి శనివారం ఏకంగా 6,630 కోట్ల రూపాయల విలువైన మాల్యా ఆస్తులను అటాచ్ చేసింది.

09/04/2016 - 01:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: రఘురామ్ రాజన్ రూటే సపరేటు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన సాయం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి ప్రభుత్వం ప్రత్యేక డివిడెండ్‌ను తీసుకోవాలన్నదానిపైనా ఆయన అలాగే స్పందించారు. అలా కుదరదని తెగేసి చెప్పారు. ‘ఏవీ ఉచితంగా దొరకవు’.

09/04/2016 - 01:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పడుతూ.. లేస్తూ పరుగులు పెడుతున్నాయి. పసిడి ధర 31,000 రూపాయలను చేరితే, వెండి ధర 46,000 రూపాయలకు చేరువైంది.

Pages