S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/07/2016 - 01:00

హైదరాబాద్, ఆగస్టు 6: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంకు నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో ఏకంగా 84 శాతం క్షీణించింది. 31.09 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్- జూన్‌లో 202 కోట్ల రూపాయల లాభాన్ని పొందినట్లు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సురేష్ ఎన్ పటేల్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు.

08/07/2016 - 00:58

ముంబయి, ఆగస్టు 6: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం పలికిన క్రమంలో వరుస నష్టాలకు బ్రేక్ పడినప్పటికీ, చెప్పుకోదగ్గ లాభాలు మాత్రం రాలేదు. నిజానికి జిఎస్‌టి కంటే కూడా విదేశీ పరిణామాలు గడచిన వారం భారతీయ మార్కెట్లపై అధిక ప్రభావం చూపడం గమనార్హం.

08/07/2016 - 00:57

విజయవాడ, ఆగస్టు 6: ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య, పారిశ్రామికాభివృద్ధి, వౌలిక సదుపాయాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో విమానాశ్రయాలున్నాయి. బ్రిటీష్ కాలంలో ఏర్పాటైన ప్రకాశం జిల్లా దొనకొండ, కడపలోని విమానాశ్రయాలను పునరుద్ధరించనున్నారు.

08/07/2016 - 00:55

ఒంగోలు, ఆగస్టు 6: సముద్రంలో చేపల వేటపై పరిమితకాల నిషేధం సత్ఫలితాలనిస్తోంది. ఏప్రిల్ 15 నుండి జూలై 15 వరకు సముద్రంలో చేపల వేటను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో మత్స్యకారులు ఆ మూడు నెలలుపాటు వేటను కొనసాగించలేదు. అయతే ప్రస్తుతం సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులకు కనకంతలు, నూనెకావెళ్ళు, చందవ వంటి రకాలకు చెందిన చేపలు ఇబ్బడిముబ్బడిగా పడుతున్నాయి.

08/07/2016 - 00:54

విజయవాడ, ఆగస్టు 6: విద్యుత్ ఆదాతోపాటు రైతులకు సౌకర్యంగా ఉండే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ రిమోట్ పంపుసెట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. విద్యుత్ మోటార్లకు సంబంధించి రైతులు అనేక విధాలుగా ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. కర్షకుల కష్టాలెరిగి, వారి సంక్షేమమే లక్ష్యంగా, అన్ని విధాల సౌకర్యంగా ఉండే పంపుసెట్లు పొలాల్లో బిగించాలని తలంచింది.

08/06/2016 - 08:17

న్యూఢిల్లీ, ఆగస్టు 5: రాబోయే ఐదేళ్లకుగాను ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నూతన ద్రవ్యవిధాన సంస్కరణలో భాగంగా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కూడా కొత్తగా నిర్ణయించింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

08/06/2016 - 08:15

మనీలా, ఆగస్టు 5: రిజల్ కమర్షియల్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఆర్‌సిబిసి)పై ఫిలిప్పీన్స్ సెంట్రల్ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. మునుపె న్నడూ లేనివిధంగా ఏకంగా 21 మిలియన్ డాలర్ల (ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ ప్రకారం దాదాపు 140 కోట్ల రూపాయలు) జరిమానా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ బ్యాంక్ నుంచి హ్యాకర్లు కొట్టేసిన సొమ్ము ఆర్‌సిబిసి ద్వారా బదిలీ కావడమే దీనికి కారణం.

08/06/2016 - 08:14

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలను అందుకున్నాయి. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాజాగా ప్రకటించిన ఉద్దీపనలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం, విదేశీ మదుపరుల నుంచి వచ్చిన పెట్టుబడులు భారతీయ స్టాక్ మార్కెట్లను లాభాల్లో పరుగులు పెట్టించాయి.

08/06/2016 - 08:14

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) రిటైల్ అమ్మకాలు నిరుడుతో పోల్చితే గత నెల జూలైలో 34 శాతం పెరిగి 44,486 యూనిట్లుగా నమోదయ్యాయి. లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, జాగ్వార్ ఎక్స్‌ఇ, ఎఫ్-పేస్ మోడళ్ల అమ్మకాలు అధికంగా జరిగాయని శుక్రవారం సంస్థ తెలియజేసింది.

08/06/2016 - 08:13

న్యూఢిల్లీ, ఆగస్టు 5: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని శుక్రవారం ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ కలుసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఈ నెల 9న జరగనున్న క్రమంలో జైట్లీని రాజన్ కలుసుకున్నారు.

Pages