S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/17/2016 - 05:22

హైదరాబాద్, జులై 16: దేశ వ్యాప్తంగా టెక్స్‌టైల్ రంగంలో కోటి మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 6 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిందని ఆయన చెప్పారు.

07/17/2016 - 05:21

ముత్తుకూరు, జూలై 16: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో నెలకొల్పిన కృష్ణపట్నం పోర్టు ఆసియా ఖండంలోనే అతి పెద్ద పోర్టుగా విరాజిల్లుతూ ప్రపంచ చిత్రపటంలో ప్రథమ స్థానం సంపాదించుకుంది. పోర్టును అనుసరించి సుమారు నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఎపి థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పామాయిల్ ఫ్యాక్టరీలు, ఎరువుల కర్మాగారాలతో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది.

07/16/2016 - 04:24

న్యూఢిల్లీ, జూలై 15: దేశ ఎగుమతులు సుధీర్ఘకాలం తర్వాత పుంజుకున్న సంకేతాలనిచ్చాయి. 18 నెలల తర్వాత గత నెల జూన్‌లో 1.27 శాతం వృద్ధిరేటు నమోదైంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు పెరిగాయి. దీంతో 22.57 బిలియన్ డాలర్లుగా భారత ఎగుమతులు నమోదయ్యాయి. నిరుడు ఇదే నెల 22.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు కూడా 8.11 బిలియన్ డాలర్లకు వచ్చింది.

07/16/2016 - 04:22

న్యూఢిల్లీ, జూలై 15: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వరంగ బ్యాంకులకు తొలి విడత ఆర్థిక సాయంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో నిధులను విడుదల చేసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా, తొలి విడతలో 20,000 కోట్ల రూపాయల వరకు బ్యాంకులకు ప్రభుత్వ సాయం అందనుంది.

07/16/2016 - 04:18

బెంగళూరు, జూలై 15: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 13 శాతానికిపైగా పెరిగింది. 13.4 శాతం వృద్ధిరేటుతో 3,436 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 3,028 కోట్ల రూపాయలుగా ఉంది.

07/16/2016 - 04:17

ఆదోని టౌన్, జూలై 15: రాయలసీమలో పత్తి మార్కెట్‌కు పేరుగాంచిన కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి ధర భారీగా పెరిగింది. క్వింటాల్ పత్తి ధర రూ. 6,800కు చేరినట్లు మార్కెట్ యార్డు గ్రేడ్-1 కార్యదర్శి రామారావు తెలిపారు. గత వారం క్వింటాల్ రూ. 6,300 పలికిన ధర వారం రోజుల్లోనే రూ. 500 పెరిగి రికార్డు స్థాయికి చేరిందన్నారు.

07/16/2016 - 04:16

విజయవాడ, జూలై 15: అందుబాటులో ఉన్న ఇంధన/శక్తి, సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగంలోకి తేవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు ఖర్చును పొదుపు చేయగలుగుతామని ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఇక్కడ బ్రాహ్మణ వీధిలోని దేవాదాయ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎనర్జీ ఎఫీషియన్సీ మిషన్ సిఇఒ ఎ చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.

07/16/2016 - 04:15

న్యూఢిల్లీ, జూలై 15: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016- 17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో గతంతో పోల్చితే 24.1 శాతం ఎగిసి 7,113 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే త్రైమాసికంలో 6,024 కోట్ల రూపాయల లాభాన్ని రిలయన్స్ అందుకుంది.

07/15/2016 - 04:38

ముంబయి, జూలై 14: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వచ్చే నెల జరిపే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. ఆగస్టు 9న ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను మూడో ద్వైమాసిక ద్రవ్యసమీక్షను ఆర్‌బిఐ చేపడుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా గురువారం అభిప్రాయపడింది.

07/15/2016 - 04:38

న్యూఢిల్లీ, జూలై 14: ద్రవ్యోల్బణం గణాంకాలు మోత మోగిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా అదుపులో ఉన్న చిల్లర, టోకు ధరల సూచీలు ఇప్పుడు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. కూరగాయలు, పప్పు్ధన్యాలు, చక్కెర తదితర ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో గత నెల టోకు ద్రవ్యోల్బణం ఎగిసింది.

Pages