S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/11/2016 - 00:52

న్యూఢిల్లీ, జూలై 10: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసుల్లో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు కొత్త చిక్కు వచ్చిపడింది. గతంలో ఆయన నిర్వహించి బ్రిటన్‌కు చెందిన డియాజియోకు విక్రయించిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.

07/11/2016 - 00:52

విజయవాడ, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం ఆశయాల సాధన దిశగా గిరిజన సహకార సంస్థ (జిసిసి) ముందడుగు వేస్తోంది. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోంది. గత రెండేళ్లలో నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, కొత్త వ్యాపార కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

07/11/2016 - 00:50

న్యూఢిల్లీ, జూలై 10: నాలుగో తరం (4జి) స్పెక్ట్రమ్ కొనుగోలుకు సంబంధించి ప్రముఖ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు భారతీ ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్ మధ్య కుదిరిన రూ.3,500 కోట్ల వివాదాస్పద ఒప్పందాన్ని టెలికామ్ మంత్రిత్వ శాఖ ఆమోదించినట్లు తెలుస్తోంది.

07/11/2016 - 00:48

న్యూఢిల్లీ, జూలై 10: పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గంకాలు, టిసిఎస్, ఇన్ఫోసిస్‌లాంటి ఐటి దగ్గజాలు ప్రకటించే త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల పురోగతి వచ్చేవారం దేశీయస్టాక్ మార్కెట్ల గతిని నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. ‘త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల పురోగతి, అంతర్జాతీయ మార్కెట్లలో ధోరణులు ఈ వారం మార్కెట్ సెంట్‌మెంట్‌ను నిర్ణయించనున్నాయి.

07/11/2016 - 00:47

పరకాల, జూలై 10: వరంగల్ జిల్ల్లా భూపాలపల్లి ఓపెన్‌కాస్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గనిలో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. గని ఆవరణలో మొత్తం బురదమయంగా మారడంతో భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయినట్లు తెలిపారు. అంతేకాకుండా మట్టి వెలికితీత పనులపై తీవ్ర ప్రభావం చూపింది.

07/10/2016 - 01:59

ముంబయి, జూలై 9: కార్పొరేట్ ఫలితాల వెల్లడి సీజన్ వచ్చేవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపరులు ఆచి తూచి వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం అంతకు ముందు వారంలో ఆర్జించిన లాభాలు మొత్తం కోల్పోవడమే కాకుండా స్వల్ప నష్టాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 18 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయింది.

07/10/2016 - 01:58

న్యూఢిల్లీ, జూలై 9: ఫెరా (విదేశీ మారకద్రవ్య నిబంధనల చట్టం) ఉల్లంఘన కేసులో సమన్లను తప్పించుకుని తిరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను సెప్టెంబర్ 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీలోని ఒక కోర్టు శనివారం ఆదేశించింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఇంతకుముందు విజయ్ మాల్యాకు ఇచ్చిన మినహాయింపును చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్ దాస్ రద్దు చేశారు.

07/10/2016 - 01:55

న్యూఢిల్లీ, జూలై 9: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) నుంచి తమకు 5.34 కోట్ల రూపాయల ఆర్డర్ లభించిందని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) శనివారం వెల్లడించింది. ఎన్‌టిపిసి ఉద్యోగుల కోసం 23 వేల స్లీవ్‌లెస్ జాకెట్లు తయారుచేసి ఇవ్వాలంటూ ఈ ఆర్డర్ వచ్చిందని, దీని వలన తమకు 5,34 కోట్ల రూపాయల ఆదాయం ఒనగూడుతుందని కెవిఐసి ఒక ప్రకటనలో పేర్కొంది.

07/10/2016 - 01:54

న్యూఢిల్లీ, జూలై 9: దేశంలో అదనంగా 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలన్న లక్ష్యంతో ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ (ఎఎంపి) 2016-26 మరో నెల రోజుల్లో కేంద్ర క్యాబినెట్ పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి అనంత్ గీతే తెలిపారు.

07/10/2016 - 01:52

న్యూఢిల్లీ, జూలై 9: అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో శనివారం ఒక్కరోజే వెండి ధర కిలోకు 800 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీ మార్కెట్లో వెండి కిలో ధర రూ. 46,300కు చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులనుంచి డిమాండ్ బాగా ఉండడం వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం.

Pages