S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/09/2015 - 16:15

ముంబయి : స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 274 పాయింట్లు నష్టపోయి 25,036 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 7,613 సూచీ వద్ద ముగిశాయి.

12/09/2015 - 06:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వ్యయ నిర్వహణ వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘ప్రణాళికా, ప్రణాళికేతర’ వ్యయాల వర్గీకరణను తొలగించాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రణాళికా సంఘాన్ని తొలగించిన విషయం తెలిసిందే.

12/09/2015 - 06:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ మార్కెట్లలో జరుగుతున్న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండబోదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-నవంబర్ వ్యవధిలో భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు దాదాపు 7,008 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

12/09/2015 - 06:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వొడాఫోన్ ఇండియా దేశీయంగా 4జి సేవలను ప్రారంభించింది. మంగళవారం కొచ్చి నుంచి 4జి సేవల్లోకి వొడాఫోన్ ప్రవేశించగా, ఈ నెల 14 నుంచి కొచ్చిలో 4జి సేవలు వొడాఫోన్ వినియోగదారులకు అందనున్నాయి. అతిత్వరలో త్రివేండ్రం, కాలికట్‌లలోనూ ఈ సేవలను సంస్థ అందుబాటులోకి తేనుంది.

12/09/2015 - 06:24

హైదరాబాద్, డిసెంబర్ 8: కాయలు.. పండ్లుగా మగ్గేందుకు ఎథిలిన్ చాంబర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం హైకోర్టుకు తెలిపాయి. పండ్లుగా మార్చేందుకు వ్యాపారులు ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకుని ఈ అంశాన్ని హైకోర్టు విచారించింది.

12/09/2015 - 06:23

ముంబయి, డిసెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. వరుసగా నష్టాలపాలవడం ఇది ఐదోరోజవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ మూడు నెలల కనిష్ట స్థాయికి పతనమైంది. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర బిల్లుల ఆమోదంపై నెలకొన్న ఆందోళనలు మార్కెట్‌ను కుంగదీశాయి.

12/09/2015 - 06:22

విశాఖపట్నం, డిసెంబర్ 8: శాస్త్ర విజ్ఞానం సమాజానికి ఉపయోగపడాలని డిఆర్‌డిఒ మాజీ డెరెక్టర్ జనరల్ వికే ఆత్రే అన్నారు. నిన్నమొన్నటి వరకు ఏ చిన్న విషయానికైనా ఆసుపత్రులకు పరుగులు తీసేవారమని, ఇక నుంచి మన ఆరోగ్యం ఎలా ఉందన్నదీ మన రిస్ట్ వాచీలతో తెలుసుకునే సదుపాయం కలగనుందన్నారు.

12/09/2015 - 06:21

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం నూతన రుణ హామీ పథకాన్ని తీసుకురానున్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి అరవింద కుమార్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఈసిజిసి సంస్థ ఏర్పాటు చేసిన బీమా అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

12/08/2015 - 17:08

ముంబయి : స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 25,310 వద్ద అదేవిధంగా నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 7,702 సూచీ వద్ద ముగిశాయి.

12/08/2015 - 04:43

విశాఖపట్నం, డిసెంబర్ 7: విశాఖ సాగర తీరంలో బీచ్ కోత నివారణకు విశాఖ పోర్టుట్రస్ట్ సరికొత్త చర్యలు చేపట్టింది. నిన్న, మొన్నటివరకు కోతకు గురైన ప్రాంతాల్లో మట్టిని ఫిల్లింగ్ చేసేవారు. అలలు ఉద్ధృతంగా వచ్చినపుడు మట్టి తిరిగి సముద్రంలోకి కొట్టుకుపోయేది. దీని వల్ల ప్రయోజనం లేదని భావించిన అధికారులు శాశ్వత పరిష్కారానికి చెన్నైకి చెందిన ఎన్‌ఐఒటి నిపుణుల బృందంతో సర్వే జరిపించారు.

Pages